భాగ్యనగరమే బెటర్ – తెలంగాణా షాన్ దార్..!

ప్రపంచంలోని మేటి సామాజిక మాధ్యామాలలో టాప్ ఫైవ్ లలో ఒకటిగా కొనసాగుతున్న ‘లింక్డ్‌ఇన్‌’ వెబ్ సైట్ దేశ వ్యాప్తంగా అనువైన ..వనరులు కలిగిన ..ఉద్యోగాలు కల్పించే విషయంలో నగరాలను సర్వే చేసింది . తెలంగాణా రాష్ట్ర రాజధానిగా ..ఐటి హబ్ గా వినుతికెక్కిన భాగ్యనగరం ఇండియాలో మూడో స్థానంలో నిలిచింది . ప్రతిభ ..నైపుణ్యం కలిగిన నిపుణుల లభ్యతలో సౌకర్యవంతమైన ప్రాంతంగా నిలిచింది . ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తో పాటు మేనేజ్ మెంట్ ఉద్యోగార్థులకు డిమాండ్ పెరిగింది. ఈ విషయాన్ని ‘లింక్డ్‌ఇన్‌’ వెల్లడించింది . నైపుణ్యం కలిగిన వారిని ఆకర్షించడం లో మొదటి మూడు నగరాల్లో హైదరాబాద్ కు ఎక్కువమంది ఉద్యోగులు తమ ప్రయారిటీని తెలియచేసారు. ఈ విషయంలో మొదటి స్థానాన్ని ఢిల్లీ చేజిక్కించుకుంటే ..రెండో స్థానాన్ని బెంగళూర్ పొందింది . అతి పెద్ద ప్రొఫెషనల్ నెట్ వర్క్ కలిగిన సామాజిక మాధ్యమంగా పేరున్న లింక్డ్‌ఇన్‌’ 2018-19 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థానికి రూపొందించిన ‘భారత ఉద్యోగస్థుల నివేదిక’ ఈ వివరాలు తెలిపింది .

Startups in Hyderabad

కొత్తగా ఏఏ రంగాల్లో ఉద్యోగాలు అధికంగా వస్తున్నాయి, ఎటువంటి నిపుణులకు గిరాకీ ఉంది, దేశంలోని ఏఏ నగరాలు సమర్థులైన ఉద్యోగులను ఆకర్షించగలుగుతున్నాయి… అనేఅంశాలతో ఈ నివేదికను లింక్డ్‌ఇన్‌ రూపొందించింది. ప్రపంచ వ్యాప్తంగా యువ జనాభా, యువ ఉద్యోగులు అత్యధిక సంఖ్యలో ఉన్న దేశం భారతదేశమేనని, అందువల్ల ఉద్యోగాలు, ఉద్యోగస్తుల తీరుతెన్నులను ప్రతిబింబిస్తూ ఈ నివేదిక రూపొందించినట్లు లింక్డ్‌ఇన్‌ ఇండియా కంట్రీ మేనేజర్‌ మహేష్‌ నారాయణన్‌ అన్నారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ రంగాలకు 2018లో విశేష గిరాకీ కనిపించినట్లు తెలిపారు. హైదరాబాద్ తర్వాత ఇంకొన్ని నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి . ముంబయి; చెన్నై; కోల్‌కతా; అహ్మదాబాద్‌, చండీగఢ్‌; వడోదర; జైపూర్ పట్టణాలు చోటు దక్కించుకున్నాయి .

అత్యధిక ఉద్యోగాలు సాఫ్ట్‌వేర్‌- ఐటీ సేవలు, తయారీ రంగం, ఫైనాన్స్‌, కార్పొరేట్‌ సేవలు; విద్య, ఏ దేశాలకు వెళ్తున్నారు అనే వాటిని సంస్థ పరిగణలోకి తీసుకుంది . కాస్తోకూస్తో చదువుకొని విదేశాలకు వెళ్లి మంచి ఉద్యోగంలో స్ధిరపడాలని కోరుకునే యువకుల సంఖ్య ఇటీవల కాలంలో మనదేశంలో పెరిగిపోతోంది. అటువంటి ఏ దేశాలకు వెళ్లాలనుకుంటున్నారు? అనే కోణాన్ని కూడా ఈ నివేదిక స్పృజించింది. దీని ప్రకారం యువకులు అత్యధికంగా యూఎస్‌ వెళ్తున్నారు. ఆ తర్వాత స్థానాల్లో యూఏఈ, కెనడా, యూకే, ఆస్ట్రేలియా దేశాలు ఉన్నాయి. ఇదే సంస్థ ఏయే నైపుణ్యాలు కలిగి వుంటే లేదా నేర్చుకుంటే ..అందులో ప్రతిభ కనబరిస్తే త్వరగా కొలువులు పొందవచ్చో కూడా లింక్డ్ ఇన్ వెల్లడించింది .

ఎస్‌క్యూఎల్‌, జావా, సీ ల్యాంగ్వేజ్‌. ఉత్పత్తి, నిర్మాణ రంగం, విద్యుత్తు, మైనింగ్‌ రంగాల్లో ఆటో క్యాడ్‌ నిపుణులకు గిరాకీ ఉందని పేర్కొంది . ఇక మేనేజ్‌మెంట్‌ ఉద్యోగార్ధుల్లో నాయకత్వ లక్షణాలు, కస్టమర్‌ సర్వీస్‌, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ సామర్థ్యాలు ప్రదర్శించే వారికి పెద్దగా వెతుక్కోకుండానే ఉద్యోగాలు లభిస్తాయని తెలిపింది . ఐటి ఉద్యోగాలకు అయితే బెంగళూరు భూతల స్వర్గమని కొనియాడింది . మొత్తంగా చూస్తే నిన్నటి దాకా కొంత ఇబ్బందులు ఎదుర్కొన్న భాగ్యనగరం ఇప్పుడు అందరికి అనువైన నగరంగా చోటు దక్కించు కోవడం శుభ పరిణామంగా భావించాల్సి ఉంటుంది .

Comments

comments

Share this post

scroll to top