మీరు….హైదరాబాద్ లో జీవిస్తున్నారా?ఐతే మీకో భయంకర ప్రమాదం పొంచి ఉంది అదేంటి అంటే..

మహానగరం దోమల ఆవాసంగా మారుతోంది. జీహెచ్‌ఎంసీ నివారణ చర్యలు విఫలమవడం… స్వచ్ఛత కార్యక్రమాలు ప్రకటనలకే పరిమితం కావడంతో గ్రేటర్‌ అనారోగ్యం బారిన పడుతోంది. ఒకటి, రెండు కాదు… నగరంలోని 280 ప్రాంతాల్లో అత్యంత ప్రమాదకర స్థాయిలో దోమలు ఉన్నట్టు గుర్తించారు. ఇది సాక్షాత్తు జీహెచ్‌ఎంసీ వర్గాలు చెబుతున్న అధికారిక లెక్కలు. 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం… 150 డివిజన్లున్న నగరంలో జనాభా కంటే వేగంగా దోమలు వృద్ధి చెందుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో నమోదవుతున్న దోమ కారక వ్యాధుల ఆధారంగా సర్వే నివేదిక రూపొందించారు. గతంతో పోలిస్తే దోమల తీవ్రత పెరుగుతున్న ప్రాంతాలు అధికమవుతుండడం గమనార్హం.

రెండు వేల మంది కార్మికులు నిత్యం పని చేస్తున్నా… యేటా రూ.5 కోట్లు నివారణ కోసం(సిబ్బంది వేతనాలు కాకుండా) వెచ్చిస్తున్నా.. దోమలు మాత్రం తగ్గడం లేదు. యేటికేడు ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో డెంగీ, మలేరియా, పైలేరియా కేసులు పెరగడం దోమల తీవ్రతకు నిదర్శనం. ఎప్పుడూ లేని విధంగా గత వేసవిలో నగరంపై దోమల దాడి పెరిగింది. సాయంత్రం 6 గంటలు దాటితే ఆరు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఎండల తీవ్రత పెరిగి ఎట్టకేలకు దోమలు తగ్గాయని ఊపిరి పీల్చుకుంటే… ఇటీవల మొదలైన వానలతోపాటే మళ్లీ దోమలు విజృంభిస్తున్నాయి.

కేసుల తీవ్రత ఆధారంగా…

ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల నుంచి వివరాలు సేకరించిన జీహెచ్‌ఎంసీ డెంగీ, మలేరియా, పైలేరియా, మెదడు వాపు వ్యాధుల కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాలను గుర్తించారు. కొన్ని ఏరియాల్లో అప్పుడప్పుడు దోమ కారక వ్యాధుల కేసులు నమోదవుతుండగా.. మరికొన్ని చోట్ల తరచూ ఆ వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కువ కేసులు నమోదవుతున్న ఏరియాలను హానికర ప్రాంతాలుగా గుర్తించారు. హైదరాబాద్‌ జిల్లాలో 142, గ్రేటర్‌ పరిధిలోకి వచ్చే మేడ్చల్‌ జిల్లాలో 66, రంగారెడ్డి జిల్లాలో 72 ప్రాంతాల్లో దోమకారక వ్యాధులు ఎక్కువగా సోకుతున్నట్టు గుర్తించారు. ఆయా వ్యాధులతో పలుమార్లు మరణాలూ సంభవిస్తున్నాయి.

బస్తీలే అధికం…

నాలాలు, చెరువుల పక్కన ఉండే బస్తీల్లోనే దోమల తీవ్రత ఎక్కువగా ఉంది. ఆయా ప్రాంతాల్లో నెలకొన్న అపరిశుభ్ర పరిసరాలు, మురుగు నీరు దోమల వ్యాప్తికి కారణమవుతోంది. చెరువుల్లో గంబూసియా చేపలు వదులుతున్నా.. మస్కిటో లార్వాసైడల్‌ ఆయిల్‌(ఎంఎల్‌ఓ) పిచికారి చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. టెమోఫాస్‌, ఏఎంసీతో నిర్వహిస్తోన్న యాంటీ లార్వా ఆపరేషన్‌, డీజిల్‌, సైఫర్‌నోథ్రిన్‌తో కలిపి చేస్తోన్న ఫాగింగ్‌తోనూ ప్రయోజనం లేకుండా పోతోంది. ఓపెన్‌ డ్రైన్‌లు, పరిసరాల్లో నీటి నిల్వలు ఉండే ప్రాంతాల్లో దోమల వృద్ధి అధికమవుతోంది. ఆయా ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించామని జీహెచ్‌ఎంసీ వర్గాలు చెబుతున్నాయి.

ఇదీ యాక్షన్‌ ప్లాన్‌…

హానికర ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఇంటింటికీ యాంటీ లార్వా సర్వే నీటి నిల్వ ప్రాంతాలను తగ్గించడం టెంపోస్‌ అండ్‌ ఏసీఎం రసాయనాల పిచికారి ఫాగింగ్‌ నిర్వహణ జ్వరం వచ్చిన వారి గుర్తింపు రక్త నమూనాలు సేకరించి పరీక్షల నిర్వహణ ప్రజల్లో అవగాహన కల్పించడం దోమల కిట్‌లు యూపీహెచ్‌సీ/సీహెచ్‌సీలలో అందుబాటులో ఉంచనున్నారు మలేరియా, డెంగీ పాజిటివ్‌ కేసులు నమోదైతే చుట్టు పక్కల ఉన్న 50 నుంచి 100 ఇళ్లలో ఫోకల్‌ స్ర్పే చేస్తారు ఆయా ప్రాంతాల్లో జ్వరపీడితులు ఉంటే ఏఎన్‌ఎంలు, మలేరియా సిబ్బంది పరీక్షలు నిర్వహించి తగిన చికిత్స కోసం సిఫారసు చేస్తారు.

Comments

comments

Share this post

scroll to top