ఆటోడ్రైవ‌ర్ కొడుకు క్రికెట‌ర్‌గా రూ.2.60 కోట్ల‌కు ఐపీఎల్‌లో సెలెక్ట్ అయ్యాడు..!

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌… ఐపీఎల్‌… ఎలా పిలిచినా భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లో ఈ లీగ్ సృష్టించిన సంచ‌ల‌నం అంతా ఇంతా కాదు. ఇక మ‌రికొద్ది రోజుల్లోనే ఈ లీగ్‌కు చెందిన 10 ఎడిష‌న్ షురూ కానుంది. కాగా ఎప్ప‌టి లాగానే లీగ్‌లో ప్లేయ‌ర్ల కోసం తాజాగా వేలం నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలో ప‌లువురు విదేశీ క్రికెట‌ర్ల‌తోపాటు, భార‌త క్రికెట‌ర్లు కూడా పెద్ద మొత్తాల‌కే ఆయా ఫ్రాంచైజీల‌కు అమ్ముడ‌య్యారు. అయితే తాజాగా జ‌రిగిన ప్లేయ‌ర్ల వేలం పాట‌లో ఓ క్రికెట‌ర్ అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించాడు. అంత‌ర్జాతీయ మ్యాచ్‌లు ఆడ‌లేదు. వాటి అనుభ‌వం లేదు. అయినా… అనూహ్యంగా చాలా పెద్ద మొత్తానికి స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ టీం అత‌న్ని కొనుగోలు చేసింది. ఇంత‌కీ ఆ క్రికెట‌ర్ ఎవ‌రో తెలుసా..?

mohammed-siraj
అత‌ని పేరు మ‌హ‌మ్మ‌ద్ సిరాజ్. హైద‌రాబాద్ క్రికెట్ జ‌ట్టు రంజీ ప్లేయ‌ర్‌. ఇప్ప‌టి వ‌ర‌కు అంత‌ర్జాతీయ మ్యాచ్‌లు ఆడలేదు. వాటిలో అనుభ‌వం లేదు. అయినా చ‌క్క‌గా బౌలింగ్ చేయ‌గ‌ల‌డు. ఓ మ్యాచ్‌లోనైతే ఏకంగా 20 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి 9 వికెట్లు తీశాడు. అలా చెప్పుకుంటూ పోతే ఫ‌స్ట్ క్లాస్ మ్యాచ్‌ల‌లో అత‌ను తీసిన వికెట్లు ఎన్నో. ఈ క్ర‌మంలోనే సిరాజ్ చాలా మంది బౌల‌ర్‌గా పేరు తెచ్చుకున్నాడు. అయితే అత‌ని తండ్రి ఆటో డ్రైవ‌ర్‌. అయినా కొడుక్కి క్రికెట్ ప‌ట్ల ఉన్న ఆస‌క్తిని చూసి అత‌ని ఇష్టాన్ని కాద‌న‌లేదు. ఫ‌లితంగా ఎప్ప‌టికప్పుడు అందులో కోచింగ్ తీసుకుని మంచి బౌల‌ర్‌గా ఎదిగి అంద‌రి దృష్టిలో ప‌డ్డాడు. ఇప్పుడు ఐపీఎల్ రూపంలో అదృష్టం అత‌న్ని వ‌రించింది. ఈ క్ర‌మంలోనే తాజాగా జ‌రిగిన వేలం పాట‌లో సిరాజ్‌ను స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ టీం ఏకంగా రూ.2.60 కోట్ల‌కు కొనుక్కుంది.

mohammed-siraj-1
తొలుత సిరాజ్ బేస్ రేట్‌ను రూ.20 ల‌క్ష‌లు మాత్ర‌మే ఉంచ‌గా, ప్రాంచైజీలు ఇత‌ని ప‌ట్ల ఆస‌క్తిని చూప‌డంతో ఆ రేట్ కాస్తా రూ.2.60 కోట్ల‌కు చేరింది. దీంతో అలా ఐపీఎల్‌లో సెలెక్ట్ అయ్యే స‌రికి ఇప్పుడు సిరాజ్ కుటుంబంలో ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. తన తండ్రి ప‌డిన క‌ష్టానికి, తాను చేసిన ప్ర‌య‌త్నానికి మంచి ఫ‌లితం ద‌క్కింది అంటున్నాడు సిరాజ్‌. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఐపీఎల్ 10వ ఎడిష‌న్‌లో విరాట్ కోహ్లి వికెట్ తీస్తాన‌ని ధీమాగా చెబుతున్నాడు. మ‌రి ఐపీఎల్‌లో ఇత‌ను ఎలా రాణిస్తాడో, త‌ద్వారానైనా భార‌త జ‌ట్టులో స్థానం సంపాదించి, అంత‌ర్జాతీయ స్థాయిలో రాణిస్తాడో లేదోన‌న్న‌ది వేచి చూస్తే తెలుస్తుంది..! ఏది ఏమైనా అంతటి పేద కుటుంబం నుంచి క‌ష్ట‌ప‌డి పైకి వ‌చ్చి ల‌క్ష్య సాధన దిశ‌గా ప‌య‌నించిన సిరాజ్ కృషిని నిజంగా మ‌నం అభినందించాల్సిందే..!త‌న‌కు వ‌చ్చే ఈ డ‌బ్బుల‌తో…మంచి ఇళ్లు కొంటాన‌ని, తండ్రి చేత ఆటో న‌డిపించ‌డం మాన్పించి, అత‌నికి విశ్రాంతినిస్తానంటున్నాడు సిరాజ్.

Comments

comments

Share this post

scroll to top