ఆ హైదరాబాద్ కార్పొరేటర్ చేసిన నాగినీ డ్యాన్స్ కి ఎలా తిడుతున్నారో తెలుసా.? మధ్యలో ఒకరు డబ్బు నోట్లు కూడా.!

రాజ‌కీయ నాయ‌కులు అంటే అంతే. ఎప్పుడు ఎలా ప్ర‌వర్తిస్తారో ఎవ‌రికీ తెలియ‌దు. అధికారంలోకి రాక‌ముందు ప్ర‌జ‌ల ఎదుట ఓట్ల కోసం అన్ని వేషాలు వేస్తారు. మ‌నం ఓట్లు వేసి గెలిపించాక ఏమ‌వుతుందో తెలియ‌దు కానీ.. అస‌లు మ‌న ముఖాల‌ను చూడ‌రు. పైగా అప్పుడ‌ప్పుడు వింత వింత‌గా చేస్తుంటారు. అయితే రాజ‌కీయ నాయ‌కులు అంటే ఇలాగే చేయాలి అనుకుందో ఏమో గానీ ఆమె మాత్రం అంద‌రి ఎదుట నృత్యం పేరిట స‌ర్క‌స్ ఫీట్లు చేసింది. చివ‌రకు సోష‌ల్ మీడియాకు బుక్ అయింది. దీంతో ఇప్పుడామెను నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే…

ఆమె పేరు డాక్ట‌ర్ స‌మీనా బేగం. హైద‌రాబాద్‌లోని కుర్మ‌గూడ డివిజ‌న్ కార్పొరేట‌ర్ అట‌. అయితే ఈమె స్థానికంగా ఉన్న యునానీ మెడిక‌ల్ కాలేజీలో డాక్ట‌ర్ విద్య‌ను కూడా అభ్యసిస్తోంది. ఈ క్ర‌మంలోనే తాజాగా కాలేజీ వారు ఏర్పాటు చేసిన యాన్యువ‌ల్ డే వేడుక‌ల‌కు స‌మీనా హాజ‌రైంది. అయితే ఓ స‌మ‌యంలో ఆమె ఏమ‌నుకుందో తెలియ‌దు కానీ స్టేజీపై నాగినీ డ్యాన్స్ చేయ‌డం మొద‌లు పెట్టింది.

వేడుక సంద‌ర్భంగా వ‌స్తున్న నాగినీ డ్యాన్స్ పాట‌కు ఆమెకు జోష్ వ‌చ్చిన‌ట్లుంది. దీంతో బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అయ్యే పాట‌కు అనుగుణంగా నాగినీ డ్యాన్స్ చేసింది. ఈ క్ర‌మంలో ఆమెకు స్టేజీపై ఉన్న ప‌లువురు స‌పోర్ట్‌గా వ‌చ్చారు. దీంతో ఆమె మ‌రింత ఎక్కువ సేపు డ్యాన్స్ చేసింది. అయితే ఈమె అలా డ్యాన్స్ చేస్తున్న స‌మ‌యంలో ఎవ‌రో వీడియో తీసి దాన్ని నెట్‌లో పెట్టారు. ఇంకేముందీ.. ఇప్పుడా వీడియో వైర‌ల్ అవుతోంది. కావాలంటే మీరు దాన్ని చూడ‌వ‌చ్చు. అయితే ఓ ప్ర‌జా ప్ర‌తినిధి అయి ఉండి ఇలా డ్యాన్స్ ఎందుకు చేశావ్ ?అంటూ కొంద‌రు ఆమెను విమ‌ర్శిస్తుండ‌గా, మ‌రికొంద‌రు మాత్రం డ్యాన్స్ చేస్తే త‌ప్పేంటి అని ప్ర‌శ్నిస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడీ నాగినీ డ్యాన్స్ వీడియో మాత్రం నెట్‌లో తెగ వైర‌ల్ అవుతోంది.

Comments

comments

Share this post

scroll to top