అగ్ని సాక్షిగా పెళ్లిరోడ్డు రూపంలో మృత్యువు నోట్లో నోరు పెట్టి ఆక్సిజన్ అందించిన బతకని భార్య

ఈ మధ్య భార్య,భర్తల దాంపత్యం చిన్న చిన్న కారణాలతో ముగుస్తుంది. చిన్న విషయానికే గొడవపడి గోరంత దానిని కొండంత చేసుకుంటున్నారు. కానీ ఖమ్మంలో జరిగిన రోడ్డు ఆక్సిడెంట్ ఘటన మాత్రం అందరిని కన్నీళ్లు పెట్టించింది. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన తన భార్యను కాపాడుకోవడానికి భర్త చేసిన ప్రయత్నం అందరిని కంటతడి పెట్టించింది. భార్యకు ఎలాగైనా ప్రాణం పొయ్యాలని నోటితో ఆక్సీజన్‌ అందించే ప్రయత్నం చేశాడు భర్త. హృదయవిదారకమైన ఈ ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం మండాలపాడులో జరిగింది.

అసలేం జరిగిందంటే?మండాలపాడు గ్రామం వద్ద వ్యాను అదుపుతప్పి పల్టీలు కొట్టి ప్రమాదానికి కారణమైంది… ఈ ప్రమాదంలో భూక్యా రాములమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందింది… విషయం తెలుసుకున్న రాములమ్మ భర్త హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని తన భార్య రాములమ్మను బతికించుకోవాలని పడిన తాపత్రయం అక్కడున్నవారి గుండెలను పిండేసింది…తన భార్య చనిపోయిందని తెలిసి కూడా నోట్లో నోరు పెట్టి గాలి ఊదుతూ చేసిన ప్రయత్నానికి అక్కడున్న వారంతా కన్నీరు పెట్టుకున్నారు.

భార్య చనిపోయినా… తన ప్రయత్నం మాత్రం మానుకోకుండా నోటిలో నోరు పెట్టి ఆక్సీజన్‌ అందించే ప్రయత్నం చూస్తే చాలు. తన భార్యపై ఎంత ప్రేమ ఉందొ.. కానీ ఏం లాభం అగ్ని సాక్షిగా ఒక్కటైన ఈ జంటను రోడ్డు ప్రమాదం విడదీసింది.

Comments

comments

Share this post

scroll to top