కాలమా…? సమాధానం చెప్పుమా?

అప్పుడెప్పుడో అమ్మమ్మ వాళ్లింటికి వెళ్ళాలంటే…NTR,ANR శోభన్ బాబు ల పోస్టర్లతో అందంగా అలంకరించిన రిక్షాలలో వెళ్ళేవాళ్లం.. కాలం మారుతూ వస్తుంది. రిక్షాలు పోయి ఆటోలు, ఇప్పుడు ఎసి క్యాబ్ లు వచ్చేశాయ్. ఇది ప్రస్తుతం చాలా నగరాల్లో జరుగుతున్న విషయమే, అయితే కలకత్తాది మాత్రం వింత పరిస్థితి. అక్కడ ఇప్పటికీ చాలా మంది రిక్షాలను నడుపుతూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు, అది కూడా చేతులతో లాగే రిక్షాలను……

తాజా లెక్కల ప్రకారం కలకత్తా లో  6000 మంది చేతులతో లాగే రిక్షాలను, 35000 వేల మంది కాళ్ళతో నడిచే రిక్షాలను వాడుతున్నారు. రోజుకు 10 నుండి 12 గంటల వరకూ రిక్షాను నడిపితే వారి చేతికందేది మాత్రం రూ. 100 లేదా రూ. 200 మాత్రమే. లక్ష 20 వేల కుటుంబాలు ఇలా జీవనం సాగిస్తున్నాయి. కనీసం చెప్పులు కూడా దరించకుండా ఎండకు, వానకు తడుస్తూ రిక్షాలను నడుపుతూ,ప్రయాణికులను గమ్య స్థానానికి చేర్చుతున్నారు.

rk

తమ చెమటని పెట్రోల్ గా మార్చి, తమ కష్టాన్ని పెట్టుబడిగా పెట్టి  జీవితాన్ని నెట్టుకొస్తున్న రిక్షావాలలపై అడుగడుగన అసహానాన్ని వ్యక్తం చేస్తున్నారు కలకత్తా నగరవాసులు..  రిక్షా అడ్డుగా ఉందని బైక్ పై వచ్చే పోలీస్ తిడతాడు, రోడ్ కు అడ్డంగ ఉందని కారులో వెళ్ళేవాడు గొడవపడతాడు. ఇన్ని భరిస్తూ రిక్షాను నడుపుతున్న మూడుపూటలు తిండి తినడానికి వెళ్లని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు, రిక్షా తొక్కి తొక్కి కాళ్ళు పుండ్లయ్యాయి. పాదాలు అరిగిపోయాయి. లంగ్ ప్రాబ్లమ్స్ వచ్చి వేలమంది చనిపోతున్నారు.

కష్టాన్ని నమ్ముకున్న ఆ రిక్షావాలల జీవితాలు బాగుపడాలని కోరుకుందాం.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top