వెండి తెర‌పై వాలిన వెన్నెల హుమా ఖురేషీ

మోడ‌ల్ గా, న‌టిగా హుమా ఖురేషీ బాలీవుడ్‌లో పేరు తెచ్చ‌కున్నారు. ఫేమ‌స్ డైరెక్ట‌ర్ పా .రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో త‌మిళంలో సూప‌ర్ స్టార్ రజ‌నీకాంత్ అలియాస్ త‌లైవాతో తీసిన కాలా మూవీలో హుమ న‌ట‌న‌లో విశ్వ‌రూపం ప్ర‌ద‌ర్శించింది. మోస్ట్ టాలెంటెడ్ న‌టీమ‌ణిగా వంద మార్కులు కొట్టేసింది. ర‌జ‌నీకాంత్ కు ధీటుగా ఆమె ప్ర‌ద‌ర్శించిన న‌ట‌న అభిమానుల‌ను మెస్మ‌రైజ్‌కు గురి చేసింది. న‌డ‌క‌లో.హుందాత‌నం.మాటల్లో క‌రుకుద‌నం.చూపుల్లో కొంటెద‌నం క‌లిపి జ‌రీనా పాత్ర‌లో ఆమె లీన‌మైంది. ఇండిపెండెంట్ మ‌న‌స్త‌త్వం క‌లిగిన వ్య‌క్తిగా త‌లైవాను డామినేట్ చేసింది. ఈ పాత్ర‌ను సృష్టించిన రంజిత్‌ను అభినందించ‌క త‌ప్ప‌దు. 28 జూలై 1986లో జ‌న్మించారు. 32 ఏళ్ల వ‌య‌సు. చూస్తే అలా క‌నిపించ‌దు.

Huma Qureshi

ఢిల్లీ యూనివ‌ర్శిటీలో చ‌దువుకుంది. న‌ట‌నంటే అమిత‌మైన ఆస‌క్తి. మోడ‌ల్ గా పేరు తెచ్చుకుంది. హిస్ట‌రీ మెయిన్ స‌బ్జెక్టుగా డిగ్రీ హాన‌ర్స్ చేసింది. థియేట‌ర్ ఆర్టిస్టుగా , మోడ‌ల్‌గా ప‌నిచేసింది. ఈ సంద‌ర్భంగా ప‌లు నాట‌క కంపెనీల ఆధ్వ‌ర్యంలో న‌టించింది. ఇదే స‌మ‌యంలో రెండేళ్ల కాంట్రాక్టు పై క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్‌ల‌లో న‌టించేందుకు హిందూస్తాన్ యునిలివ‌ర్ సంస్థ‌తో ఒప్పందం చేసుకుంది. ఇందు కోసం ఢిల్లీ నుండి ముంబ‌యికి మ‌కాం మార్చింది. ఇదే స‌మ‌యంలో శాంసంగ్ మొబైల్ క‌మ‌ర్షియ‌ల్ యాడ్ చేస్తుండ‌గా ముంబ‌యి డైరెక్ట‌ర్ అనురాగ్ కాశ్య‌ప్ హుమా ఖురేషిని చూశాడు. త‌న కంపెనీలో మూడేళ్ల పాటు సినిమాల్లో న‌టించేందుకు కాంట్రాక్టు రాయించుకున్నాడు.

2012లో వాసియేపూర్ సినిమాలో న‌టించింది. బెస్ట్ ఫిలిం ఫేర్ అవార్డు ద‌క్కించుకుంది. బెస్ట్ స‌పోర్ట్ న‌టిగా పేరు తెచ్చుకుంది. ల‌వ్ సువే తే చికెన్ ఖురానా అనే మూవీలో న‌టిగా ఆరంగ్రేటం చేసింది. ఏక్ థి ద‌యాన్ దేదే ఇష్కియా, రివెంజ్ డ్రామా నేపథ్యంలో వ‌చ్చిన బాద్లాపూర్లో న‌టించి మెప్పించింది. మ‌రాఠిలో రోడ్ డ్రామా హైవే తో పాటు మూవీ ఎక్స్ పాస్ట్ లో న‌టించింది. యాక్ట్ ఒన్ థియేట‌ర్ గ్రూప్ కంపెనీలో న‌టించింది మొద‌ట్లో. హుమాకు ఎన్. కె. శ‌ర్మ మెంటార్‌గా ఉన్నారు. ఆయ‌న వ‌ద్ద న‌ట‌న‌లో మెళ‌కువ‌ల‌ను నేర్చుకున్నారు. ఇదే స‌మ‌యంలో ఎన్నో స్వ‌చ్చంధ సంస్థ‌ల్లో కార్య‌క‌ర్త‌గా, వ‌లంటీర్‌గా ప‌నిచేశారు. ఎలాంటి రుసుము లేకుండానే స్ల‌మ్స్ పై డాక్యుమెంట‌రీలు కూడా జ‌రీనా తీశారు.

2008లో ముంబైలో సినిమాల్లో న‌టించేందుకు గాను ప్రాక్టీస్ చేసింది. జంక్ష‌న్ సినిమా కోసం ఆడిష‌న్స్‌కు అటెండ్ అయ్యింది. అమీర్ ఖాన్‌తో క‌లిసి శాంసంగ్ మొబైల్ యాడ్‌లో న‌టించింది. షారూఖ్ ఖాన్‌తో క‌లిసి నెరోలాక్ పెయింట్స్ కంపెనీ యాడ్‌లో న‌టించింది. విటా మేరీ, స‌ఫోలా ఆయిల్, మెడెర్మా క్రీం, పియ‌ర్స్ సోప్ యాడ్స్ ల‌లో న‌టించి మెప్పించింది. అనురాగ్ కాశ్య‌ప్ ఆమె న‌టన‌కు ఇంప్రెస్ అయ్యాడు. ఫిల్మ్స్ లో ఛాన్స్ ఇస్తాన‌ని చెప్పాడు.కానీ తాను న‌మ్మ‌లేదంది హుమా. కానీ అనురాగ్ మాట త‌ప్ప‌లేదు.మూడు సినిమాల్లో న‌టించేలా ఒప్పందం చేసుకున్నాడు.

త‌మిళ డైరెక్ట‌ర్ చ‌క్రి తోలేటి ద‌ర్శ‌క‌త్వంలో బిల్లా 2 త‌మిళ గ్యాంగ్ స్ట‌ర్ బేస్ డ్ సినిమా ఇది. ఈ సినిమాలో న‌టించేందుకు 700 మంది హాజ‌ర‌య్యారు. ఆమె ఎంపిక‌య్యారు. సినిమా తీయ‌డంలో లేట్ కావ‌డంతో ఆ ప్రాజెక్టు నుండి వైదొల‌గారు. వాసియేపూర్ పార్ట్ -1 గా సినిమా 2012లో వ‌చ్చింది. న‌వాజుద్దీన్ సిద్దిఖీ కి వైఫ్‌గా న‌టించింది. మొహిసినా పాత్ర‌లో మెప్పించింది. ఆమె న‌ట‌న‌కు బాలీవుడ్ బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టింది. 65వ కేన్స్ ఫెస్టివ‌ల్‌లో ప్ర‌ద‌ర్శించ‌బ‌డింది. హుమా న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు అందాయి. స్మితా పాటిల్ లాగా ఉందంటూ గోవింద్ నిహ్లాని కామెంట్ చేశాడు. త‌ర‌న్ ఆద‌ర్శ్ ఆమెను గొప్ప న‌టిగా అభివ‌ర్ణించారు. వాస్సియేపూర్ పార్ట్ 2 కేన్స్ డైరెక్ట‌ర్స్ ఫార్ట్‌నైట్‌లో ప్ర‌ద‌ర్శించారు. అక్క‌డ కూడా హుమ‌కే ఎక్కువ మార్కులు ప‌డ్డాయి. క్రిటిక్స్ ఆమె న‌ట‌న‌కు ఫిదా అయ్యారు. సింప్లీ పెంటాస్టిక్ అంటూ కీర్తించారు. స‌మీర్ శ‌ర్మ డైరెక్ష‌న్‌లో న‌టించింది. నేచుర‌ల్ యాక్టింగ్‌లో ఆమె ప‌రిణ‌తి సాధించిన న‌టిగా మారిపోయారంటూ ప్ర‌శంస‌లు పొందారు. ఏక్ థి ద‌యాన్ సినిమాలో ఇమ్రాన్ హష్మి, కొంక‌నా సేన్ తో క‌లిసి న‌టించింది. ఈ సినిమా బాక్స్ ఫిస్ బ‌ద్ద‌లు కొట్టింది. హుమా ఖురేషికి మంచి పేరు వ‌చ్చేలా చేసింది.

కొంక‌ణా సేన్ ఫాద‌ర్ రాశారు ఈ సినిమా క‌థ‌ను ఆర్ మాధ‌వ‌న్‌తో పాటు హుమా ఫిల్మ్ ఫేర్ అవార్డు తీసుకున్నారు. ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ చేతుల మీదుగా పుర‌స్కారాన్ని అందుకున్నారు హుమా ఖురేషి. సుజాత షార్ట్ మూవీలో న‌టించారు. జోయా రెహ‌మాన్ తో క‌ల‌సి డి -డే నాట‌కంలో న‌టించారు. రాంపాల్, రిషి కపూర్, ఇర్ఫాన్ ఖాన్ తో క‌లిసి న‌టించారు. సూర‌య్యా పాత్ర‌లో న‌టించేందుకు అవ‌కాశం ఇస్తాన‌ని అన్నాడు.నిఖిల్ అద్వాని. జోయా పాత్ర‌లో న‌టించేందుకు ఒప్పుకుంది హుమ‌. 2014లో అభిషేక్ చౌబే ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన దేదే ఇష్కియా సినిమాలో న‌టించారు. 4.1 మిలియ‌న్ డాల‌ర్ల‌ను వ‌సూలు చేసింది. మాధురీ దీక్షితో క‌లిసి న‌టించారు. ఇండియా టుడే ఆమె న‌ట‌న అద్బుత‌మ‌ని వ‌ర్ణించింది. బ‌ద్లాపూర్ మూవీలో వేశ్య‌గా న‌టించింది హుమా ఖురేషి. ఫిల్మ్ ఫేర్ అవార్డు పొందింది. అన్షుమాన్ ఝా సినిమా మంచి పేరు తీసుకొచ్చింది.

2016లో మ‌ళ‌యాలం సినిమాలో మమ్ముట్టి తో క‌లిసి న‌టించింది. జాలీ ఎల్ ఎల్ బీ 2 అక్ష‌య్ కుమార్‌తో క‌లిసి న‌టించింది. గురింద‌ర్ చందా వైస్రాయ్ స్ హౌస్ సినిమాలో త‌న న‌ట‌న‌తో మెప్పించింది. 67వ బెర్లిన్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌కు ఆ మూవీ ఎంపికైంది. హార్ర‌ర్ ఫిల్మ్ దోబారాలో న‌టించింది. 2018లో జూన్‌లో ర‌జ‌నీకాంత్‌తో క‌లిసి న‌టించిన కాలా అంచ‌నాల‌కు మించి ఆడింది. గొప్ప న‌టిగా పేరు తెచ్చుకుంది. మొత్తం మీద స‌హ‌జ‌సిద్ధ‌మైన న‌ట‌న‌తో.అందంతో మెప్పిస్తున్న హుమా ఖురేషీ మ‌రిన్ని సినిమాల్లో మంచి పాత్ర‌ల్లో జీవించాల‌ని కోరుకుందాం.

Comments

comments

Share this post

scroll to top