వారం రోజుల్లో మీ ఒంట్లోని అదనపు కొవ్వును కరిగించే ఫ్యాట్ బర్నింగ్ సూప్..

అధిక బరువు నేడు చాలామంది ఎదుర్కొంటున్న సమస్య…దానికి ఫలాన కారణం అని చెప్పలేం.అస్త్యవస్త జీవన విధానం వలన బరువు పెరుగుతారు…కొందరు నోరు కట్టేసుకుని గంటలు గంటలు వాకింగ్ లు ,జాగింగ్లు అంటూ పార్క్ ల చుట్టూ తిరిగినా ఫలితం ఉండదు.మరికొందరు తిండి మానకుండా బరువు తగ్గడం ఎలా అనే మార్గాలు ఆలోచిస్తుంటారు.. అధిక బరువుతో బాదపడే వారందరికీ వారంరోజుల్లలో ఒంట్లో ఉన్న కొవ్వును కరిగించే సూప్ ఒకటుంది..దానికి కావలసిన పదార్ధాలు…తయారు చేసుకునే విధానం…ఏ విధంగా తీసుకోవాలి…ఏ  ఏ టైం కి తీసుకోవాలి తెలుసుకుని చాలా ఈజీగా మంచి బాడీ షేప్ ను సొంతం చేసుకోండి…

కావల్సిన పదార్థాలు:

* 1 క్యాబేజ్ పెద్దది 

* పది బీన్స్
* టమోటాలు 4
* కొత్తిమీర 1 కట్ట 
* 3 క్యారెట్లు 
* 2 పొడవాటి ఉల్లికాడలు
* 1 టీస్పూన్ ఉప్పు
* 1 టీస్పూన్ మిరియాల పొడి 

cccc
తయారీ ఇలా: 
* క్యాబేజిని,టమాటాలు,క్యారెట్,బీన్స్ ఉల్లికాడలు అన్నింటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
* వీటన్నింటినీ ఒక పాన్ లో వేసుకుని,దానికి ఉప్పు,మిరియాలపొడి కలపాలి…
* సరిపడా నీళ్ళు పోసి 10 నిముషాలు స్టవ్ పై ఉడికించాలి…. 
* తర్వాత మంటను పూర్తిగా తగ్గించి సిమ్ లో పెట్టి, వెజిటేబుల్స్ మెత్తబడే వరకూ ఉడికించాలి. 
* రెగ్యులర్ ఫుడ్స్ తో పాటు, ఈ  ఫ్యాట్ బర్నింగ్ సూప్ ను కూడా తాగాలి 
ఇలా చేస్తేనే పూర్తి ఫలితం:
* రాత్రి భోజనం తర్వాత నిద్రకు కనీసం 2 గంటల వ్యవధి ఉండాలి.
* ఈ జ్యూస్ తాగినన్ని రోజులు  ఆల్కహాల్, కూల్ డ్రింక్స్, ఫాస్ట్ ఫుడ్స్, ఫ్రైలు, బ్రెడ్, మైదా అయిటమ్స్ తినడం మానేయాలి.
* వారం రోజులు క్రమం తప్పకుండా ఈ జ్యూస్ తాగితే అనూహ్యంగా బరువు తగ్గుతారు..

Comments

comments

Share this post

scroll to top