మీరు కొన్న మెడిసిన్ అస‌లుదా, న‌కిలీదా..? దాన్ని ఎలా గుర్తించ‌వ‌చ్చో తెలుసుకోండి..!

నేడు మార్కెట్‌లో మ‌న‌కు ల‌భ్య‌మ‌వుతున్న ప్ర‌తి వ‌స్తువు ఎలా క‌ల్తీమ‌య‌మ‌వుతుందో అంద‌రికీ తెలిసిందే. ఒక‌టా రెండా ఎన్నో వంద‌ల ప‌దార్థాలు క‌ల్తీ అవుతూ మ‌న‌కు అనారోగ్యాల‌ను తెచ్చి పెడుతున్నాయి. ఆహార ప‌దార్థాలు మొద‌లుకొని మ‌న రోగాల‌ను న‌యం చేయాల్సిన మందులు కూడా క‌ల్తీ అయిపోతున్నాయంటే నేటి త‌రుణంలో కల్తీ దందా ఏవిధంగా కొన‌సాగుతుందో మ‌న‌కు స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలో మ‌నం వాడుతున్న ఆహార ప‌దార్థాలను కల్తీ జ‌రిగాయో లేదో ఏదో ఒక విధంగా క‌నిపెట్ట‌వ‌చ్చు. అందుకు వివిధ‌ మార్గాలు కూడా ఉన్నాయి, కానీ మెడిసిన్స్ విష‌యంలో కల్తీ వాటిని గుర్తించ‌డం ఎలా? వాటి గురించి మ‌న‌కు ఏం తెలుస‌ని? ఏవి న‌కిలీవో, ఏవి అస‌లువో క‌నిపెట్ట‌డం ఎలా సాధ్య‌మ‌వుతుంది? ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాన‌మే ఫార్మా సెక్యూర్ మెడిసిన్ వెరిఫికేష‌న్ టూల్‌.

pharma-secure-medicine-verification-2

మ‌నం మందుల షాపులో కొనే ప్ర‌తి ట్యాబ్లెట్ ప్యాక్‌పై 9 అంకెల యూనీక్ ఐడీ నంబ‌ర్ కచ్చితంగా ఉంటుంది. ఈ నంబ‌ర్‌ను ఎస్ఎంఎస్ రూపంలో టైప్ చేసి 9901099010 అనే ఫోన్ నంబ‌ర్‌కు పంపాలి. వెంట‌నే మన ఫోన్‌కు ఓ మెసేజ్ వ‌స్తుంది. అందులో వ‌చ్చిన వివ‌రాల‌తో పోలుస్తూ మ‌నం కొన్న మెడిసిన్ ఒరిజిన‌లో కాదో తెలుసుకోవ‌చ్చు. ఒక వేళ ఎస్ఎంఎస్‌లోని స‌మాచారం, మనం కొన్న మెడిసిన్ వివ‌రాలు మ్యాచ్ కాక‌పోతే ఆ మెడిసిన్ న‌కిలీద‌ని అర్థం చేసుకోవాలి. దీంతో మ‌న‌కు వ‌చ్చిన ఆ ఎస్ఎంఎస్‌ను పైన చెప్పిన అదే నంబ‌ర్‌కు రిప్లైగా పంపితే చాలు, వెంట‌నే ఫిర్యాదు న‌మోద‌వుతుంది. మ‌న‌కు న్యాయం జ‌రుగుతుంది.

pharma-secure-medicine-verification

https://verify.pharmasecure.com/india/ అనే వెబ్‌సైట్‌ను సందర్శించి కూడా మ‌నం కొన్న మెడిసిన్ అస‌లుదో, న‌కిలీదో గుర్తించ‌వ‌చ్చు. అదెలాగంటే ముందు చెప్పిన సైట్‌లోకి వెళ్లి మ‌న మొబైల్ నంబ‌ర్‌, మెడిసిన్ ప్యాక్‌పై ఉన్న 9 అంకెల అథెంటికేష‌న్ కోడ్‌, వ‌ర్డ్ వెరిఫికేష‌న్‌ను ఎంట‌ర్ చేయాలి. అనంతరం మ‌న మొబైల్‌కు ఓటీపీ వ‌స్తుంది. దాన్ని స‌బ్‌మిట్ చేస్తే మ‌న మెడిసిన్ అస‌లుదో, న‌కిలీదో తెలుస్తుంది. దీంతో మ‌నం జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు. ఎంతో ఉప‌యోగ‌క‌ర‌మైన ఈ స‌మాచారాన్ని న‌లుగురికీ తెలియ‌జేయండి. దీంతో ఫార్మా కంపెనీలు చేసే మోసాల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top