జ్యూస్, టీ, కాఫీలతో కలిపి …..ట్యాబ్లెట్లను వేసుకోవొద్దు.! ఎందుకో తెలుసా?

చాలా మందికి టాబ్లెట్ లు ఏ ఏ ప‌దార్థాల‌తో వేసుకోవాలో తెలియ‌దు. టీ తాగుతూనో లేదా జ్యూస్ లు తాగుతూనో మందు బిల్ల‌లు వేసుకుంటారు. ఇది అత్యంత ప్ర‌మాద‌క‌రం అంటుంది భార‌త వైద్య మండ‌లి ( IMA ). ముఖ్యంగా పండ్ల ర‌సాల‌తో టాబ్లెట్స్ వేసుకుంటే ప్ర‌మాదం అంటున్నారు. అస‌లు టాబ్లెట్ వేసుకునే ముందు ఏం నియ‌మాలు పాటించాలి..? వేటితో పాటుగా మందుల‌ను వేసుకోకూడ‌దు..? ఒక వేళ వేసుకుంటే ఏం జ‌రుగుతుంది..? తెలుసుకుందాం.

shutterstock140491252

టాబ్లెట్స్ వీటితో పాటు వేసుకోకూడ‌దు..

 • నీళ్ళతో మాత్రమే టాబ్లెట్స్ వేసుకోవాలి
 • ద్ర‌వ‌ప‌దార్థ‌మే క‌దా అని టీ, జ్యూస్ ల‌తో ట్యాబ్లెట్స్ వేసుకుంటే ప్ర‌మాదం
 • ఉబ్బసం వంటి వాటికి వాడే మందుల గుణాన్ని కాఫీలోని కెఫీన్‌ దెబ్బతీస్తుంది
 • కెఫీన్‌ కడుపులో మంటను పెంచుతుంది. సో కాఫీతో అస‌లు టాబ్లెట్స్  వేసుకోవ‌ద్దు
 • టీతో మందుల‌ను తీసుకోవద్దు.. కార‌ణం పాలల్లోని కాల్షియం యాంటీబయోటీస్‌ మందుల ప్రభావాన్ని బాగా తగ్గిస్తుంది.
 • మామిడిపండు పీచుతో కూడిన పళ్ళరసాలు, కూర‌గాయ‌ల‌తో కూడిన ప‌ళ్ల‌ రసాలతో మాత్రలు తీసుకుంటే షుగ‌ర్, బీపీ వంటి మందుల ప్రభావం తగ్గిపోతుంది.
 • ద్రాక్షరసం తో మందులు వేసుకుంటే అందులోని ఎంజైములు మాత్రల ప్రభావాన్ని గణనీయంగా తగ్గిస్తాయి.
 • గుండె జబ్బులకు ఉపయోగించే మందులు, యాంటీ ఫంగల్‌ మందులు పనిచేయ‌వు.. అంతేకాక‌ సైడ్‌ ఎఫెక్టులు వ‌చ్చే అవ‌కాశం కూడా ఎక్కువే.

getty_rm_photo_of_man_holding_pills_and_milk

టాబ్లెట్లు ఇలా వేసుకొండి

 • చేతులు శుభ్రంగా క‌డుక్కున త‌రువాత‌నే టాబ్లెట్లు వేసుకొండి
 • చ‌ల్ల‌ని నీటితో మందులు వేసుకోకూడ‌దు.. గోరు వెచ్చ‌ని నీటిని వాడాలి
 • టాబ్లెటును ముక్క‌లు చేసి వేసుకోకూడ‌దు. అత్యంత ప్ర‌మాదం
 • క్యాప్సుల్స్ లాంటి వాటిని న‌మ‌ల‌కూడ‌దు.. నేరుగా మింగేయాలి.

Comments

comments

Share this post

scroll to top