తెలుగులో మాట్లాడితే చాలు…వాట్సాప్ మెసేజ్ టైప్ అయిపోతుంది..! ఎలాగో తెలుసా..?

వాట్సప్ ..మెసేజ్ చేయాలంటే వాట్సప్,ఫొటో పంపాలంటే వాట్సప్ ..వీడియో కాల్ కి వాట్సప్,ఆడియో కాల్ కి వాట్సప్..దీనికి దానికంటూ కాదు ప్రతి దానికి వాట్సప్..స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సప్ ని ప్రతిరోజు ఏదో ఒక విధంగా వాడుతునే ఉంటారు..వాట్సప్ ప్రొఫైల్ పిక్,స్టాటస్ మారుస్తూనే ఉంటారు..కొన్ని కోట్లమంది వాడుతున్న యాప్స్ లో వాట్సప్ ఒకటి..మెసెజ్ అనగానే మనం ఇంగ్లీషులో చేస్తుంటాం..కానీ మనకు నచ్చిన భాషలో టైప్ చేయకుండానే,మెసేజ్ చేయోచ్చు..అదెలాగో తెలుసుకోండి..

రెండు రకాలుగా మీరు వాట్సప్ లో తెలుగులో లేదా ఇంగ్లీష్..మీకు నచ్చిన భాషలలో మెసేజ్ చేయోచ్చు అది కూడా టైప్ చేయకుండా..దానికోసం మీరు చేయాల్సింది..

  • write SMS by voice అనే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి.యాప్ ని ఓపెన్ చేయగానే మీకు క్లియర్ గా అంతా కనిపిస్తుంది.

  • అక్కడ సెట్టింగ్స్ లో కి వెళ్లి లాంగ్వెజ్ సెలక్ట్ చేసుకోవాలి.
  • తర్వాత బ్యాక్ వచ్చి మైక్ సింబల్ పై క్లిక్ చేసి మీరు ఏదైతే టైప్ చేయాలనుకున్నారో అది వాయిస్ ఇవ్వండి..

  • మీరు చెప్తున్నది అక్కడ అక్షరాల రూపంలో టైప్ అవుతుంది.
  • ఆ మెసేజ్ ని సెండ్ చేయాలనుకుంటే సెండ్ అని క్లిక్ చేస్తే అక్కడ మీకు వాట్సప్,ఫేస్ బుక్ మిగతా యాప్స్ ఓపెన్ అవుతాయి.అప్పుడు మీరు ఏ యాప్ లో కావాలనుకుంటే ఆ యాప్ లో సెండ్ చేసుకోవచ్చు.

SPEECHNOTES అనే యాప్ ద్వారా కూడా సేమ్ ఇదే విధంగా మీరు సెండ్ చేయాలనుకున్న మెసేజ్ వాయిస్ ఇస్తే టైప్ అయిపోతుంది.టైప్ అయిన మ్యాటర్ ని సెండ్ చేసుకోవచ్చు.ఈ యాప్ మీరు ఓపెన్ చేయగానే లాంగ్వెజ్ ది కనిపిస్తుంది.దానిపై క్లిక్ చేసి మీకు నచ్చిన లాంగ్వెజ్ సెలక్ట్ చేసుకుని ,మైక్ సింబల్ పై క్లిక్ చేసి మ్యాటర్ చెప్తే టైప్ అవుతుంది.సెండ్ ఆఫ్షన్ పై క్లిక్ చేసి కావలసిన యాప్ లో సెండ్ చేసుకోవడమే..అంతే సింపుల్..లెటర్స్  ఎక్కడున్నాయో వెతుక్కోనక్కర్లేదు..తప్పు టైప్ చేస్తున్నామేమో అనే టెన్షన్ అక్కర్లేదు….

 

Comments

comments

Share this post

scroll to top