మార్కెట్ లోకి నకిలీ 10/- కాయిన్స్….ఫేక్ కాయిన్స్ ను గుర్తించడానికి 5 సూచనలు.!

రూపాయి బిళ్ల మొదలు ..1000 రూపాయల నోటు వరకు నకిలీ కరెన్సీని ఇండియాలోకి చొప్పించే ప్రయత్నం గట్టిగానే జరుగుతుంది.  ఒరిజినల్ నోట్స్ ను పోలిన నోట్లను తయారు చేయడం, ఒరిజినల్ కి, ఫేక్ కి అంతగా తేడా తెలియని జనాలను టార్గెట్ చేసుకొని వారి దగ్గర  ఆ ఫేక్ నోట్లను మార్చడం…సాధారణం అయిపోయింది. ఈ మొత్తం ప్రక్రియలో మూడు వేర్వేరు  గ్రూపులు పనిచేస్తాయని సమాచారం.  గతంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుండి ఫేక్ కరెన్సీ ఇబ్బడి ముబ్బడిగా వచ్చేది. ఇప్పుడు తెలివిమీరిన మన వాళ్లే ఫేక్ కరెన్సీని సృష్టించి, మార్కెట్లోకి సరఫరా చేస్తున్నారు.

500/- 100/- రూపాయాల కరెన్సీ నోట్లపై జనాల్లో అవగాహన పెరిగిందని, ఫేక్ నోట్లను జనాలు గుర్తుపడుతున్నారని  తెలుసుకున్న కొన్ని దొంగనోట్ల తయారీ సంస్థలు…తమ దృష్టిని నకిలీ 10 రూపాయల కాయిన్స్ మీదకు మళ్లించాయి. కొత్తగా విడుదలైన 10 రూపాయల కాయిన్స్ ను పోలిన కాయిన్స్ మార్కెట్ లోకి విడుదల చేస్తూ కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నాయి కొన్ని అక్రమ నాణాల ముద్రణాసంస్థలు.

ఒరిజినల్ 10/- కాయిన్స్ కు నకిలీ 10/- కాయిన్స్ కు మధ్య ప్రధాన తేడాలు:

1)ఒరిజినల్ కాయిన్ కి… పైన 10 గీతలుంటాయి, ఫేక్ కాయిన్ కి 15 గీతలుంటాయి:

10-final-1

2) ఒరిజినల్ కాయిన్ కి…10 అనే సంఖ్య, సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ రెండింటిని  టచ్ చేస్తూ ఉంటుంది, ఫేక్ కు కేవలం సిల్వర్ కలర్ లోనే 10 అనే సంఖ్య ఉంటుంది.

10-final2

3)ఒరిజినల్  కాయిన్ కు పైన రూపీ సింబల్ ఉంటుంది, ఫేక్ కాయిన్ కు ఉండదు.

10-fianl-3

4)ఒరిజినల్ కాయిన్ కు భారత్ అనే హిందీ పదం, ఇండియా అనే ఇంగ్లీష్ పదం.. కాయిన్ అడ్డంలో ఉంటాయి. ఫేక్ కాయిన్ కు ఈ పదాలు నిలువులో ఉంటాయి.

10-final-4

5)ఒరిజినల్ కాయిన్ కు ఎటువంటి గీతలుండవ్..అదే ఫేక్ కాయిన్ కు నాలుగు సింహాల మీదుగా రెండు లైన్స్ అతికించిన విధంగా ఉంటాయి.

10-final-5

ఈ 5 జాగ్రత్తలు పాటిస్తే…10 రూపాయల ఫేక్ కాయిన్ ను ఇట్టే గుర్తుపట్టవచ్చు. ఎవరైనా మీ చేతికి ఈ కాయిన్ ఇస్తే..వెంటనే పోలీసులకు పట్టించవచ్చు.

Note: ఇటువంటి సమాచారాన్ని డైరెక్ట్ గా మీ వాట్సాప్ లో చదవాలనుకుంటున్నారా? అయితే మా వాట్సాప్ నెంబర్ 7997192411 కు START అని మెసేజ్ చేయండి

Comments

comments

Share this post

scroll to top