నిమ్మకాయ లో దాగున్న రహాస్యం… సింపుల్ ట్రిక్ తో విద్యుత్ ఉత్పత్తి చేసే విధానం.

నిమ్మకాలనగానే మనకు గుర్తుకు వచ్చేది ఏవి? చల్ల చల్లని షర్బత్, శీతల పానీయాలు. అయితే మనం ఇవే కాదు, నిమ్మకాయలతో ఏకంగా చిన్నపాటి మంటనే సృష్టించవచ్చు. ఏంటి! ఆశ్చర్యంగా ఉందా? కానీ ఇది నిజమే. యాసిడ్‌లోకి జింక్ పదార్థాన్ని పంపిస్తే విద్యుత్ ఉత్పత్తి అవుతుందని చదువుకున్నాం కదా! ఆక్సిడేషన్-రిడక్షన్ అనే ఓ రసాయనిక చర్య వల్ల ఇలా జరుగుతుంది. అయితే ఇప్పుడదే సూత్రంతో నిమ్మకాయ ద్వారా మంటను ఎలా సృష్టించవచ్చో తెలుసుకుందాం.
9b35ld7wow7ggr2qdsjw
నిమ్మకాయల్లో ఉండే సిట్రిక్ యాసిడ్ వల్లే ఇలా మంటను సృష్టించేందుకు వీలు కలుగుతుంది. ఇప్పుడు ఈ విధానం కోసం కావల్సిన పదార్థాలేమిటో తెలుసుకుందాం. తాజా నిమ్మకాయ ఒకటి, కొన్ని జింక్ మేకులు, కొన్ని కాపర్ (రాగి) మేకులు, కొద్దిగా స్టీల్ వైర్, సన్నపాటి ఇన్సులేటెడ్ వైర్ ఒకటి. ముందుగా చిత్రంలో చూపిన విధంగా కాపర్, జింక్ మేకులను నిమ్మకాయపై ఒకదానికొకటి ఎదురుగా ఉండే విధంగా గుచ్చాలి. ఒక స్టీల్ వైర్‌ను తీసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక్కో ముక్కను డయాగోనల్‌గా కాపర్, జింక్ మేకులకు కలుపుతూ పోవాలి. అలా చేస్తే చిత్రంలో చూపిన విధంగా వస్తుంది. దీంతో రెండు వైపులా ఒక్కో మేకు విడిగా మిగులుతుంది
i6gylqhfa5jf7e3pxkt5
ఇలా విడిగా మిగిలిన మేకుల్లో ఒకటి జింక్‌ది, మరొకటి కాపర్‌ది అయి ఉంటుంది. ఇప్పుడు వాటికి ఇన్సులేటెడ్ వైర్‌ను చిత్రంలో చూపిన విధంగా రెండు వైపులా లోపలి నుంచి తీగలు వచ్చేలా అమర్చాలి. ఈ తీగల కొనలను ఒక తేలికపాటి ఉన్ని వస్త్రంపై కలుపుతూ ఉంచితే చాలు. వెంటనే అక్కడ షార్ట్ సర్క్యూట్ జరిగి విద్యుత్ ప్రవహించి మంట వస్తుంది. ఇది క్రమంగా పెద్దదవుతుంది.
lemon
ఇలా జరిగే సమయంలో దాదాపు 1 వోల్ట్ వరకు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.
చూశారుగా నిమ్మకాయను బ్యాటరీ మాదిరిగా ఉపయోగించి మంటను ఎలా తయారుచేయవచ్చో. అయితే ఇది పిక్‌నిక్ వంటి ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఎక్కువగా ఉపయోగపడుతుంది. కానీ ఇలా మంటను ఉత్పత్తి చేసే సమయంలో కచ్చితంగా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేదంటే అనుకోని ప్రమాదం సంభవించవచ్చు.
Watch Video:

Comments

comments

Share this post

scroll to top