చపాతీని ఇలా చేసుకొని తింటే..ఇక మీకు ఎటువంటి రోగాలు రావు.!

జనాలంతా డైటింగ్ ల పేరుతో..వరి అన్నానికి సెలవు పెట్టి, గోధమ చపాతీ, జొన్న రొట్టల వెంట పడుతున్నారు. ఇది ఆరోగ్యపరంగా చాలా ఉత్తమమైన మార్గం. అయితే దీనికంటే కూడా బెటర్ సొల్యూషన్ ఇంకొకటి ఉంది. అదే ఇప్పుడు చెప్పబోయే ” విభిన్న చిరు ధాన్యాల చపాతీ”….అవును ఈ చపాతీ గనక క్రమం తప్పకుండా తింటే ఎటువంటి రోగాలు మీ ధరి చేరవు. కాకపోతే దీని కోసం మార్కెట్ లో దొరికే పిండి మీద ఆధారపడకుండా..మనమే స్వయంగా ఆ పిండిని పట్టించుకోవాలి.

ఈ కింది 8 ధాన్యాలలో…గోధుమ పిండి మినహా…ఇతర ధాన్యాలను కాస్త వేయించి, చల్లారాక..గోధుమలతో కలిపి పిండిగా పట్టించాలి. అలా పట్టించిన పిండిని కాసింత ఆరనిచ్చి….ఓ బాక్స్ లో వేసిపెట్టాలి.

atta-raw

  • పొట్టు తీయని గోధుమ పిండి… 2 కిలోలు
  • పొట్టు తీయని సెనగ పప్పు … 100 గ్రాములు
  • పొట్టుతీయని మొక్కజొన్న/జొన్న 100 గ్రాములు
  • పొట్టుతీయని సజ్జలు 50 గ్రాములు
  • పొట్టుతీయని బార్లీ 50 గ్రాములు
  • పొట్టుతీయని రాగులు 50 గ్రాములు
  • పొట్టుతీయని సోయాబీన్ 50 గ్రాములు
  • పొట్టుతీయని ఓట్స్ 100 గ్రాములు.

fotor1

ఇక చపాతీ చేసేటైమ్ లో…ముందుగానే రెడీ చేసుకున్న పిండిని కావాల్సిన పరిమాణంలో తీసుకొని, దానికి కొత్తిమీర, పుదీనా ల పేస్ట్, ఐయోడిన్ సాల్ట్ ను కలిపి…..చపాతీల్లాగా చేసుకొని తినాలి. రాత్రి పడుకునే ముందు ఈ చపాతీలను తినడం వల్ల….శరీరంలోని వ్యర్థకొవ్వు ఇట్టే కరిపోతుంది. అంతే కాదు ఎముకలు గట్టిపడతాయి.  జొన్న లోని ఫినాలిక్ యాసిడ్స్, ట్యానిన్స్, యాంథోసయనిన్ వంటి పోషకాలు కొన్ని రకాల క్యాన్సర్లను సమర్థంగా నివారిస్తాయి. గోధుమలో ఉండే గ్లూటెన్ అలర్జీని నివారిస్తుంది. గుండె జబ్బులను నివారించి, శారీరక ధారుడ్యాన్ని పెంచే అన్ని రకాల పోషకాలు ఈ మిశ్రమ పిండిలో ఉంటాయి.

Comments

comments

Share this post

scroll to top