ఏషియన్ బ్యూటీ సీక్రెట్ అంటే ఏంటో…దాని ఉపయోగాలేంటో మీకు తెలుసా………

బియ్యప్పిండిని ముఖానికి ఉపయోగించడం వల్ల చర్మ సంరక్షణలో ఎఫెక్టివ్ గా పనిచేసి అనేక రకాల ప్రయోజనాలను అందిస్తుంది. బియ్యంపిండి వంటలకు మాత్రమే కాదు, చర్మ సౌందర్యం మెరుగుపరుచుకోవడంలో కూడా అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే దీన్ని ”ఫేమస్ ఏసియన్ బ్యూటీ సీక్రెట్” అని కూడా అంటారు. బియ్యంపిండితో ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.మీ  చర్మంలో అద్భుతమైన మార్పు వస్తుంది.

  • కళ్ళ క్రింది నల్లని చారలు, నల్లని వలయాలు వయస్సైన వారి లక్షణాలను సూచిస్తాయి. బియ్యం పిండిలో ఆముదం నూనెను మిక్స్ చేసి, కళ్ళ క్రింది ప్యాక్ లా వేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే ఏజింగ్ లక్షణాలను కనబడనివ్వకుండా డార్క్ సర్కిల్స్ ను మాయం చేస్తుంది.
  • బియ్యం పిండిలో కొద్దిగా కీరదోసకాయ జ్యూస్ మిక్స్ చేసి, ఫేస్ కు ప్యాక్ వేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ వల్ల చర్మంను టైట్ గా మార్చి చర్మంలో వయస్సైన లక్షణాలు కనబడనివ్వదు.. ఇది టాన్ నివారించడంలో గొప్పగా సహాయపడుతుంది.
  • బియ్యం పిండిలో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఈ నేచురల్ రెమెడీ సూర్యరశ్మి నుండి వెలువడే యూవికిరణాల నుండి చర్మంను కాపాడటంలో సహాయపడుతుంది. అందుకోసం కొద్దిగా రైస్ పౌడర్ తీసుకుని అందులో కొద్దిగా పాలు మిక్స్ చేయాలి. పేస్ట్ లా చేసి, ముఖానికి అప్లై చేయాలి. పూర్తిగా డ్రై అయిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే చర్మంలో తప్పనిసరిగా మార్పువస్తుంది.
  • రైస్ పౌడర్ కు కొద్దిగా పెరుగు మిక్స్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖం, మెడ మొత్తానికి అప్లై చేయాలి. 15 నిముషాలు తర్వాత కడిగేయాలి. దీన్ని ఫేస్ ప్యాక్ గా వేసుకోవడం వల్ల చర్మంలో అద్భుతమైన మార్పు వస్తుంది.
  • చర్మంలో డెడ్ స్కిన్ సెల్స్ ఉన్నాయంటే చర్మం చూడటానికి చాలా డల్ గా కనబడుతుంది.చర్మంలో డెడ్ స్కిన్ సెల్స్ ను ఎఫెక్టివ్ గా నివారించడంలో బియ్యంపిండి హెల్ప్ చేస్తుంది.బియ్యంపిండికి తేనె లేదా ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి, ముఖానికి అప్లై చేసి, స్క్రబ్ చేయడం వల్ల చర్మంలో డెడ్ స్కిస్ సెల్స్ తొలగిపోయి, కొత్త చర్మ కణాలు ఏర్పడుతాయి.
  • బియ్యం పిండిని జల్లించి అందులో కార్న్ (మొక్కజొన్న పౌడర్ )ను మిక్స్ చేసి, మీరే స్వయంగా పౌడర్ ను తయారుచేసుకోవచ్చు. ఈ పౌడర్ వల్ల చర్మంలో ఎక్కువ జిడ్డు కనబడదు. ఎక్కువ సమయం నేచురల్ స్కిన్ కలిగి ఉంటారు.

Comments

comments

Share this post

scroll to top