జియో కి దిమ్మతిరిగే షాక్…”వైఫై డబ్బాలు” వస్తున్నాయ్..! రూ.2కే 4జీబీ డేటా!! ఎలా పొందాలంటే..?

తాడిని తన్నేవాడొకడుంటే వాడి తల తన్నేవాడు ఒకడుంటాడు అన్నట్టు..టెలికాం కంపెనీలను ఒక్కసారిగా కుదేలయ్యేలా చేసింది జియో..అయితే ఇప్పుడు జియో కే షాక్ ఇచ్చేలా కొందరు కుర్రోళ్లు ప్లాన్ చేసారు..ఫ్రీగా ఢాటా,కాల్స్ ఇస్తూ టెలికాం కంపెనీలను దెబ్బతీసి,ఇప్పుడు పోటీలు పడి ఆఫర్లు పెడుతుంటే..వాటన్నింటికి పోటీగా వైఫై డబ్బాలు అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చింది ఒక ఇంటర్నెట్ సంస్థ…టెలికాం కంపెనీల ఆఫర్లు కాదని ఈ వైఫై డబ్బాలవైపు జనాల దృష్టి మరల్చుకుంటున్నారు..ఇంతకీ ఇవి ఎక్కడో చూడండి..

ఎక్కడ ..

బెంగళూరు సిటీలో 350 వైఫై డబ్బాలు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్నాయి.యూత్ ఈ వైఫై డబ్బాలకు తెగ ఎట్రాక్ట్ అయిపోయారు. దీంతో వేలాది మంది ఈ కొత్తతరం నెట్ ను వాడేస్తున్నారు.వైఫై డబ్బాలను షాపుల దగ్గర ఏర్పాటు చేస్తారు. అందులో మీకు కావాల్సిన ప్యాకేజీకి ఓచర్ కార్డు కొనుగోలు చేసుకోవాలి. సంబంధిత వెబ్ సైట్ కు వెళ్లి మన ఫోన్ – కార్డులోని నెంబర్ ను ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తోంది. దాన్ని ఎంటర్ చేయగానే వైఫై కనెక్ట్ అవుతుంది. మనం మొబైల్ నంబర్ ను రీఛార్జ్ చేసుకున్న విధంగానే ఉంటుంది. మొబైల్ ప్రీ పెయిడ్ కస్టమర్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది.

ఇంతకూ ఈ వైఫై డబ్బాలు ఎలా పని చేస్తాయంటే..

రూటర్లను డబ్బాల్లో వివిధ ప్రాంతాల్లో పెడతారు. 200 మీటర్ల దూరం వరకు కనెక్ట్ అవుతుంది. 50mbps స్పీడ్ ..100mb – రూ.2,500 mb – రూ.10,1GB – రూ.20,వ్యాలిడిటీ 24 గంటలు.కనీసం రూ.2 నుంచి రూ.20 వరకు ప్యాకేజీలు ఉన్నాయి. 1GB డేటాను 20 రూపాయలకే అందిస్తున్నారు. ప్యాకేజీలతో కాకుండా ఎప్పుడుకావాలంటే అప్పుడు 2, 10 రూపాయల్లో వైఫై డబ్బా అందుబాటులో ఉండటంతో ఒకేసారి వందలకు వందల రూపాయలు చెల్లించే బాధ తప్పిందంటున్నారు బెంగళూరువాసులు.ప్రస్తుతం బెంగళూరు సిటీలో విస్తరిస్తున్న వైఫై డబ్బాలు.. రాబోయే రోజుల్లో మన సిటీకే కాకుండా పల్లెపల్లెకి వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.

Comments

comments

Share this post

scroll to top