“జియో” వినియోగిస్తున్నారా?… ప్రైమ్ మెంబర్షిప్ ఎలా పొందాలో, ప్లాన్స్ ఏంటో తెలుసా? ఇదిగోండి వివరాలు!

రిల‌య‌న్స్‌కు చెందిన జియో 4జీ… ఆది నుంచి ఈ నెట్‌వ‌ర్క్ సంచ‌నాలే సృష్టించింది. ఉచిత 4జీ డేటా, కాల్స్‌, ఎస్ఎంఎస్‌ల‌తో ముందుకు రావ‌డంతో ఈ నెట్‌వ‌ర్క్ హ‌వా ఒక ఊపు ఊపింది. అయితే మొన్నా మ‌ధ్య తాజాగా ఆ సంస్థ అధిప‌తి ముఖేష్ అంబానీ జియో ప్రైమ్ మెంబ‌ర్‌షిప్‌ను మార్చి 1 నుంచి ప్రారంభిస్తున్న‌ట్టు చెప్పారు. చెప్పిన విధంగానే ఆ మెంబ‌ర్‌షిప్ కాస్తా ఇప్ప‌టికే స్టార్ట్ అయిపోయింది. అయితే దీన్ని పొందాలంటే జియో 4జీ సిమ్‌లను వాడుతున్న యూజర్లు తమ తమ ఫోన్లలోని మై జియో యాప్ లేదా జియో వెబ్‌సైట్ లేదా రిలయన్స్ స్టోర్స్‌కు వెళ్లి తమ జియో సిమ్‌లను ప్రైమ్ మెంబర్‌షిప్‌కు అప్‌గ్రేడ్ చేయించుకోవచ్చు. అయితే అందుకు గాను యూజర్లు రూ.99 రుసుం చెల్లించాలి. దీంతో ఏడాది పాటు వారికి జియో ప్రైమ్ మెంబర్‌షిప్ సభ్యత్వం ఉంటుంది.

jio-prime-membership-ambani

యాప్ ద్వారా ప్రైమ్ మెంబర్‌షిప్‌కు రిజిస్టర్ చేసుకోవాలంటే ముందుగా మై జియో యాప్‌ను కొత్త వెర్షన్‌కు అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. అనంతరం యాప్‌ను ఓపెన్ చేసి అందులో జియో అకౌంట్‌లోకి లాగిన్ అవ్వాలి. అనంతరం వచ్చే స్క్రీన్‌లో ఎడమ వైపు పైభాగంలో ఉండే గీతలను టచ్ చేస్తే వేరే మెనూ వస్తుంది. అందులో జియో ప్రైమ్ మెంబర్‌షిప్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని టచ్ చేసి ఓపెన్ చేశాక వచ్చే గెట్ జియో ప్రైమ్ మెంబర్‌షిప్ ఆప్షన్‌ను ఎంచుకుని పేమెంట్ పూర్తి చేస్తే చాలు. యూజర్లు జియో ప్రైమ్ మెంబర్‌షిప్ సభ్యులు అవుతారు. అదే జియోకు చెందిన వెబ్‌సైట్‌లోనైతే ముందుగా అకౌంట్‌లోకి లాగిన అయి, ఆ తరువాత అందులో కనిపించే జియో ప్రైమ్ మెంబర్‌షిప్ ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. అనంతరం రూ.99 పేమెంట్ పూర్తి చేయాలి. దీంతో జియో ప్రైమ్ మెంబర్‌షిప్‌ను పొందవచ్చు. ఈ రెండు విధానాల్లోనూ కుదరకపోతే యూజర్లు నేరుగా రిలయన్స్ స్టోర్‌కు వెళ్లి రూ.99 చెల్లించి తమ సిమ్‌ను ప్రైమ్ మెంబర్‌షిప్‌కు రిజిస్టర్ చేసుకోవచ్చు.

jio-app-1

jio-app-2

ఓ సారి ప్రైమ్ మెంబర్‌షిప్‌ను పొందితే ఇక ఏడాది పాటు అంటే 2018 మార్చి నెలాఖరు వరకు దాని సభ్యత్వం ఉంటుంది. ఆ సమయంలో యూజర్లు జియోలో అందుబాటులో ఉన్న ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్లలో తమకు నచ్చిన దాన్ని ఎంచుకుని ముందుకు సాగవచ్చు. ఈ క్రమంలో ప్రీపెయిడ్ వినియోగదారులకు రూ.19 మొదలు కొని రూ.9,999 ప్లాన్లు లభిస్తున్నాయి. ఆయా ప్లాన్లకు అనుగుణంగా ఉచిత డేటా, కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. అయితే ఇంతకు ముందు వరకు కొనసాగిన హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ (రోజుకు 1 జీబీ ఫ్రీ 4జీ డేటా, ఉచిత వాయిస్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు, ప్రీమియం యాప్స్ సబ్‌స్క్రిప్షన్) కావాలనుకునే వారు రూ.303 రీచార్జి చేసుకోవాలి. అదే పోస్ట్‌పెయిడ్ యూజర్లు అయితే ప్లాన్‌కు కేవలం సబ్‌స్ర్కైబ్ అయితే చాలు ఆఫర్‌ను ఎంజాయ్ చేయవచ్చు. నెలాఖరులో బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. అయితే పోస్ట్‌పెయిడ్, ప్రీపెయిడ్ ఏ యూజర్ అయినా తమకు ఇంకా ఎక్కువ డేటా కావాలనుకుంటే అందుకు అనుగుణంగా రూ.11 నుంచి రూ.301 వరకు బూస్టర్ ప్యాక్‌లను అదనంగా వేసుకోవచ్చు. దాంతో కనిష్టంగా 100 ఎంబీ మొదలుకొని, గరిష్టంగా 10 జీబీ వరకు డేటాను పొందవచ్చు.

jio-site

ఇక జియో ప్రైమ్ మెంబర్‌షిప్ రిజిస్ట్రేషన్‌కు ఈ నెల 31వ తేదీ వరకు గడువు ఉండగా, ఒక వేళ దాన్ని పొందకపోతే వారికి సాధారణ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిలో లిమిటెడ్‌ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు, డేటా లభిస్తున్నాయి. కనుక జియో సిమ్‌లను వాడుతున్న వారు ప్రైమ్ మెంబర్‌షిప్‌కు మారితేనే మంచిది. అప్పుడే డేటా, కాల్స్, యాప్స్ సబ్‌స్క్రిప్షన్ రూపంలో ఎక్కువ లాభాన్ని పొందవచ్చు..!

రిలయన్స్ జియో 4జీలో అందుబాటులో ఉన్న ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ ఇవి..!

jio-plans-1

Comments

comments

Share this post

scroll to top