వాట్సాప్ లో మిమ్మల్ని ఎవరు “బ్లాక్” చేసారో తెలియాలా.? అయితే ఈ 5 స్టెప్స్ ఫాలో అవ్వండి.!

వాట్సాప్‌.. ప్ర‌పంచంలోనే అత్య‌ధిక మంది యూజ‌ర్లు వాడుతున్న ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ఇది. ఎప్ప‌టిక‌ప్పుడు ఇందులో కొత్త కొత్త ఫీచ‌ర్లు వ‌స్తూనే ఉన్నాయి. అవి యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకుంటూనే ఉన్నాయి. అయితే వాట్సాప్ లో మ‌న‌కు ల‌భిస్తున్న ప్ర‌త్యేక‌మైన ఫీచ‌ర్‌.. బ్లాకింగ్‌. దీని స‌హాయంతో అపరిచితులను మనం బ్లాక్ చేయవచ్చు. ఇలా చేయడం వల్ల వారి నుంచి మనకు అవాంఛిత కాల్స్, మెసేజ్‌లు రాకుండా ఉంటాయి. కానీ ఒక్కోసారి మనకు అవసరం ఉన్నవారు, తెలిసిన వారు కూడా పొరపాటున మన ఫోన్ నంబర్‌ను వాట్సాప్‌లో బ్లాక్ చేస్తుంటారు. దీంతో మనకు, వారికి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడుతుంది. ఇది ఒక్కోసారి మనకు తెలియదు కూడా. దీంతో ఇబ్బందులు వస్తాయి. అయితే ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే వాట్సాప్‌లో మిమ్మల్ని ఎదుటి యూజర్ బ్లాక్ చేశారా లేదా అన్నది తెలుసుకోవాలి. దీంతో సమస్యను పరిష్కరించుకునేందుకు వీలుంటుంది. అయితే వాట్సాప్‌లో మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేశారా, లేదా అనేది ఎలా తెలుసుకోవడం.. అంటే.. అందుకు కింద చెప్పిన స్టెప్స్ పాటించాలి..! అవేమిటంటే..

1. వాట్సాప్‌లో ఎవరైనా యూజర్ మిమ్మల్ని బ్లాక్ చేస్తే వారి స్టేటస్ మీకు కనిపిందు. అంటే వారు ఆన్‌లైన్‌లో ఉన్నారా, ఆఫ్‌లైన్‌లో ఉన్నారా అనే విషయం మీకు తెలియదు. అయితే ఈ సెట్టింగ్ బ్లాక్ చేయకపోయినా అందరికీ అందుబాటులో ఉంటుంది. కాకపోతే బ్లాక్ చేస్తే మాత్రం సదరు యూజర్ స్టేటస్ మీకు కనిపించదు. దీంతో మిమ్మల్ని ఆ యూజర్ బ్లాక్ చేశారని తెలుసుకోవాలి.

2. ఎవరైనా యూజర్ వాట్సాప్‌లో మిమ్మల్ని బ్లాక్ చేస్తే మీరు ఆ యూజర్‌కు చెందిన ప్రొఫైల్‌ను చూడలేరు. ప్రొఫైల్ బొమ్మపై క్లిక్ చేసినా బ్లాంక్ సర్కిల్ వస్తుంది. ఎలాంటి ఫొటో కనిపించదు. ఇలా ఉన్నా మిమ్మల్ని అవతలి వ్యక్తి బ్లాక్ చేశాడని గుర్తించాలి.

3. ఎవరైనా ఒక యూజర్‌కు మీరు ఏదైనా మెసేజ్ పంపితే దానికి కేవలం సింగిల్ టిక్ మాత్రమే చూపిస్తుంటే అప్పుడు మిమ్మల్ని ఆ యూజర్ బ్లాక్ చేసినట్టు తెలుసుకోవాలి. బ్లాక్ చేయకపోతే మెసేజ్ డెలివరీ అయినట్టు డబుల్ టిక్ వస్తుంది. యూజర్ ఆ మెసేజ్‌ను చూశాక బ్లూ టిక్ కనిపిస్తుంది.

4. మీ స్మార్ట్‌ఫోన్‌లో మొబైల్ డేటా లేదా వైఫై సిగ్నల్ బాగానే ఉన్నప్పటికీ మీరు వాట్సాప్‌లో ఎవరికైనా వాయిస్ లేదా వీడియో కాల్ చేస్తే అది కలవకపోతే అప్పుడు ఆ యూజర్ మిమ్మల్ని బ్లాక్ చేసినట్టు గుర్తించాలి.

5. మీరు ఓ గ్రూపు క్రియేట్ చేసి అందులో మిమ్మల్ని బ్లాక్ చేసిన వ్యక్తిని ఇన్వైట్ చేసినప్పుడు మీకు You are not authorized to add this contact ఇలా కనిపిస్తే అప్పుడు అతను మిమ్మల్ని క‌చ్చితంగా బ్లాక్ చేశాడని తెలుసుకోవాలి.

Comments

comments

Share this post

scroll to top