చినుకు-చిత్తడి-మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే.

నిన్నా మొన్నటి వరకు ఉక్కపోతతో, వేసవి తాపంతో అల్లాడిన ప్రజలు ఇప్పడిప్పుడే ఆ హీట్ నుండి బయటపడుతున్నారు. కానీ వాతావరణం ఒక్కసారిగా చేంజ్ అవ్వడం కూడా అనర్థాలకు దారితీస్తుంది. ఈ సమయంలో మనం కాస్త జాగ్రత్తగా ఉండకపోతే ఆసుపత్రుల బాట పట్టాల్సిందే..

వర్షాలు కురుస్తున్న ఈ తరుణంలో వాతావరణంలో కలిగే మార్పులు ఆరోగ్యం మీద చాలా ప్రభావం చూపెడతాయి. జాగ్రత్తగా ఉండకపోతే  వైరల్ జ్వరం, మెదడు వాపు, అలెర్జీలు వంటి పలు ఆరోగ్య సమస్యలువచ్చి పడతాయి.

pure water

వర్షాకాలంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

  • చల్లటి నీరు స్నానానికి, తాగడానికి ఉపయోగించరాదు.
  • హేర్బల్ టీ మరియు సూపులు వంటి వేడి వేడి పానీయాలను తాగడానికి ఇష్టపడండి.
  • బయటి చిరుతిండ్లకు, ఫాస్ట్ ఫుడ్ లకు దూరంగా ఉండండి.
  • ఇంట్లో కానీ, మన చుట్టు పక్కల కానీ నీటిని నిల్వ ఉండకుండా చూసుకోండి
  • దోమలు పెరిగే వాతావరణాన్ని పూర్తిగా నిర్మూలించండి.
  • తినే పదార్థాలను వేడి వేడి గా ఉండేటట్లు చూసుకొండి, అవసరమైతే ఎప్పటి వటకం అప్పుడే వండుకోండి.
  • కూల్ డ్రింక్స్ కు టాటా చెప్పండి.
  • దోమలు,ఈగలు,బొద్దింకలు ఇంట్లో లేకుండా చూసుకోండి.
  • చికెన్,మటన్ లాంటి నాన్ వెజ్ ఐటమ్స్ అయితే బాగా ఉడికించిన తర్వాతే తినండి.
  • వర్షంలో తడవకుండా జాగ్రత్త పడండి.

fast foood

చిట్కాలు చిన్నవే పాటిస్తే మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top