వాట్సాప్.. ప్రపంచంలోనే అత్యధిక మంది యూజర్లు వాడుతున్న ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్‌లలో ఈ యాప్ మొదటి స్థానంలో ఉంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను కూడా వాట్సాప్ తన యూజర్లకు అందిస్తూ వస్తోంది. దీంతో వాట్సాప్‌ను వాడేవారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. అయితే వాట్సాప్‌లో ఏ యూజర్ అయినా తన స్టేటస్ మెసేజ్ పెట్టుకోవచ్చని అందరికీ తెలిసిందే. ఆ మెసేజ్‌కు చెందిన ఫైల్ సాధారణంగా ఆడియో, వీడియో, జిఫ్, ఇమేజ్ రూపంలో ఉంటుంది. ఈ క్రమంలోనే తరచూ మనకు వాట్సాప్‌లో అలాంటి స్టేటస్లు పెట్టుకునే వారు చాలా మంది కనిపిస్తారు. ఈ క్రమంలో కొన్ని స్టేటస్లు మనల్ని ఆకట్టుకుంటాయి కూడా. కానీ వాటిని డౌన్లోడ్ చేసుకునేందుకు వీలు కాదు. అయితే కింద సూచించిన స్టెప్స్ ఫాలో అయితే ఇతరుల వాట్సప్ స్టేటస్ ఫైల్స్‌ను మనం సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదెలాగంటే…
మీ ఫోన్లో ఎవరైనా వాట్సాప్ యూజర్‌కు చెందిన స్టేటస్ మొదటి సారిగా చూస్తే అది బ్యాక్‌గ్రౌండ్‌లో డౌన్లోడ్ అవుతుంది. అనంతరం ఆ స్టేటస్ ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్‌లో సేవ్ అవుతుంది. ఇక అదే స్టేటస్ మెసేజ్ ను మళ్లీ రెండో సారి చూస్తే అప్పుడు మీ ఫోన్ లో ఇంటర్నల్ స్టోరేజ్‌లో సేవ్ అయిన స్టేటస్ మెసేజ్ దర్శనమిస్తుంది. ఈ క్రమంలో ఫోన్లో ఇంటర్నల్ స్టోరేజ్‌లో సేవ్ అయిన ఆ వాట్సాప్ స్టేటస్ మెసేజ్‌ను కింద తెలిపిన విధంగా ఫైల్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
1. ముందుగా ఫోన్లోని ఫైల్ మేనేజర్‌లోకి వెళ్లాలి.
2. ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి.
3. వాట్సాప్ ఫోల్డర్‌ను ఓపెన్ చేయాలి.
4. అందులో ఉండే మీడియా ఫోల్డర్లోకి వెళ్లాలి.
5. ఆ ఫోల్డర్ రాగానే పై భాగంలో రైట్ కార్నర్లో ఉండే మోర్ ఆప్షన్ ను ఓపెన్ చేయాలి.
అనంతరం వచ్చే షో హిడెన్ ఫైల్స్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అక్కడే .Statuses పేరిట ఒక కొత్త ఫోల్డర్ మనకు దర్శనమిస్తుంది. దాన్ని ఓపెన్ చేస్తే అందులో వాట్సాప్ యూజర్లకు చెందిన సేవ్ చేయబడిన స్టేటస్ మెసేజ్‌లు మనకు కనిపిస్తాయి. వాటి ఫైల్స్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడి నుంచి ఆ ఫైల్స్‌ను ఇతర ఫోల్డర్స్కు కాపీ చేయవచ్చు. కాబట్టి తెలిసిందిగా.. ఇంకెందుకాలస్యం.. వాట్సాప్‌లో మీకు నచ్చిన యూజర్లకు చెందిన స్టేటస్ మెసేజ్‌లను ఇలా డౌన్లోడ్ చేసుకోండి మరి..!