పోయిన SSC( 10 వ తరగతి) సర్టిఫికేట్ పొందడానికి సులువైన మార్గం.

ఏ ఉద్యోగ దరఖాస్తు చేసుకోవడానికైనా, వయసు ధృవీకరణకైనా, వ్యక్తిగత ఐడెంటిటీ ని గుర్తించే క్రమంలోనేనా మొదట అడిగేది  ఎస్.ఎస్.సి. సర్టిఫికేట్ (టెన్త్ మార్క్స్ మెమో).  దీని అవసరం  ప్రతి చోట ఉంటుంది. అయితే ఎస్.ఎస్.సి. ఒరిజినల్  సర్టిఫికేట్ ను పోగొట్టుకొని చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. ప్రయాణ సంధర్భంలోనో, ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించినప్పుడో, ఎలుకలు కొట్టినప్పుడో, వర్షాలు, వరదల వల్లనో   ఆ సర్టిఫికేట్స్ పాడైపోవడమో/ పోగొట్టుకోవడమో జరుగుతూ ఉంటుంది. ఆ ఒరిజనల్ సర్టిఫికేట్ తరిగి దక్కించుకోవడం కోసం నానాహైరానా పడాల్సి ఉండేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఎటువంటి హైరానా అవసరం లేదు. కింద సూచించిన విధంగా మీ 10 th సర్టిఫికేట్ సులభంగా పొందండి.

ఎస్.ఎస్.సి. ఒరిజినల్ సర్టిఫికేట్ పొందడానికి ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.:
1. మీ కంప్యూటర్ లో గూగుల్ పేజ్ ఓపెన్ చేయండి.
2. అందులో ‘హౌ టు డౌన్ లోడ్ ఎస్.ఎస్.సి. ఒరిజినల్ సర్టిఫికేట్ ఆన్ లైన్’ అని టైప్ చేసి సర్చ్  చేయండి.
3. అలా టైప్ చేసి సర్చ్ చేయగానే ‘ఎస్.ఎస్.సి. మెమోరెండమ్ ఆఫ్ మార్క్స్ ఫర్  పాస్డ్ క్యాండిడేట్స్’ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
4. అది ఓపెన్ చేయగానే ఎస్.ఎస్.సి. బోర్డ్ కు సంబంధించిన డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ పేజ్ కనిపిస్తుంది. అందులో మీ హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఏ సంవత్సరం  రాశారు, రెగ్యులరా? సప్లీనా? ప్రైవేటా? అని ఉంటుంది. వాటి కింద ఒక నెంబర్ కోడ్ ఉంటుంది. అందులో టైప్ చేసి సబ్ మిట్ పై క్లిక్ చేయండి.
5.ఆ విధంగా మీ డిటైల్స్ అన్నీ ఎంటర్ చేసి సబ్ మిత్ చేయగానే, మీ కళ్ళ ముందు మీ ఒరిజినల్ సర్టిఫికేట్ ప్రత్యక్షమవుతుంది.
6. మీ ఎస్.ఎస్.సి. ఒరిజినల్ సర్టిఫికేటే ను మీ దగ్గర ఉంచుకోవాలంటే, ఒరిజినల్ సర్టిఫికేట్  కనిపిస్తున్న చోటు ఎడమచేయి వైపు పైన ‘ప్రింట్ దిస్ పేజ్’ పై క్లిక్ చేయండి.
7. దానిపై క్లిక్ చేయగానే ‘సేవ్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది.  సేవ్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీ డెస్క్ టాప్ మీకు అనువైన చోట భద్రంగా దాచుకోవచ్చు.
అలా మీ ఎస్.ఎస్.సి. ఒరిజనల్ సర్టిఫికేట్ ను పోగొట్టుకున్న వారు తిరిగి దక్కించుకోవచ్చు.
For More Info Fallow This Video Tutorials:

Comments

comments

Share this post

scroll to top