ఇంటికి ద్వారాలు ఎలా ఏర్పాటు చేసుకోవాలి..? ఏ ఆకారంలో ఇల్లు ఉంటే మంచిది..?

మనసుకు నచ్చిన విధంగా ఇల్లు కట్టుకోవాలని, అందులో కలకాలం సుఖసంతోషాలతో జీవించాలని ఎవరికి మాత్రం ఉండదు. అయితే ఇంటిని ఎంత గొప్పగా కట్టినా, దాన్ని ఎంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దినా సరైన వాస్తు లేకపోతే మాత్రం అందులో నివసించే వారికి ఇబ్బందులు తప్పవని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఈ క్రమంలో అసలు ఇల్లు ఏ ఆకారంలో ఉండాలి, దానికి ఎన్ని ద్వారాలు ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.

చతురస్రాకారంలో ఉండే ఇండ్లకే వాస్తు బలం ఎక్కువగా ఉంటుందట. దీర్ఘ చతురస్రాకారంలో, పొడవుగా ఉండే ఇళ్లకు వాస్తు బలం తగ్గుతుందట. ఇలాంటి ఇళ్లలో నివసించే వారికి ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, ఇతర బాధలు ఎదురవుతాయట.

ఇక ద్వారాలు, కిటికీల విషయానికి వస్తే అవన్నీ సరి సంఖ్యలోనే ఉండాలట.

ఒక ద్వారం ఎదురుగా మరో ద్వారం వచ్చే విధంగా ద్వారాలను ఏర్పాటు చేసుకోవాలి. అంటే ద్వారాలు ఎదురెదురుగా ఉండాలి.

doors-vaastu

అన్ని ద్వారాలు సరి సంఖ్యలోనే ఉండాలి. అయితే సంఖ్య చివర్లో 10, 20 లా సున్నా ఉండే విధంగా ద్వారాల సంఖ్య ఉంచకూడదు. ఎందుకంటే వాటి గుణిజాలు ఏవైనా ఒకటి సరి సంఖ్య, మరొకటి బేసి సంఖ్య అవుతాయి కాబట్టి. ఉదాహరణకు 10 తీసుకుంటే 2 x 5 = 10 కదా. అందులో 2 సరి సంఖ్య, 5 బేసి సంఖ్య వస్తుంది. అదేవిధంగా 20, 30, 40 లకు కూడా 5 బేసి సంఖ్య గుణిజంగా వస్తుంది. కాబట్టి సున్నా చివర్లో ఉంటే ఆ సంఖ్యతో ద్వారాలను ఏర్పాటు చేయకూడదు.

ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా వాటర్ ట్యాంక్ ఉండకూడదు. దీని వల్ల ఇంట్లో నివసించే వారికి తాము దీనస్థితికి చేరుకుంటున్నామనే భావన కలుగుతుంది.

అలాగే ఇంటి గుమ్మానికి ఎదురుగా టెలిఫోన్ స్తంభాలు గానీ, విద్యుత్ స్తంభాలు గానీ ఉండకూడదట. ఎందుకంటే వాటిని తాకిన గాలులు ఇంట్లోకి వీస్తే వాటి వల్ల మనకు దుష్ప్రభావాలు కలుగుతాయట.

ఇంటి ప్రహారీ గోడల అంచులకు ఆలయాలు ఉండకూడదు. ఆంగ్ల టి అక్షరాన్ని పోలి ఉండే రోడ్డుకు ఎదురుగా ప్రధానం ద్వారం ఉండడం మంచిది కాదట.

ఇంటికి ఎదురుగా శిథిలమైన భవనాలు, ఫ్యాక్టరీలు, శ్మశానవాటికలు ఉండకూడదని చెబుతారు.

Comments

comments

Share this post

scroll to top