కొవ్వును క‌రిగించే హార్మోన్ల‌ను ఎలా యాక్టివేట్ చేయాలో తెలుసుకోండి..!

ఎక్క‌డ చూసినా నేడు దాదాపు అధిక శాతం మంది అధిక బ‌రువు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. అధిక బ‌రువుకు కార‌ణం శ‌రీరంలో కొవ్వు నిల్వ‌లు ఎక్కువ‌గా పేరుకుపోవ‌డ‌మే అని అంద‌రికీ తెలుసు. అయితే వీటిని క‌రిగించ‌డం కోసం అనేక మంది ర‌క ర‌కాల ప‌ద్ధ‌తులను పాటిస్తున్నారు. ఈ క్ర‌మంలో వాటిక‌న్నా మెరుగ్గా ప‌నిచేసే ప‌ద్ధ‌తుల‌ను కింద ఇస్తున్నాం. వీటి వ‌ల్ల కొవ్వు క‌రిగించే హార్మోన్లు మీ శ‌రీరంలో యాక్టివేట్ అవుతాయి.

fat-waist

స్టెప్ 1 :
పిండి ప‌దార్థాలు అధికంగా ఉండే కూర‌గాయ‌లు తీసుకోకూడ‌దు. ఉదాహ‌ర‌ణ‌కు ఆలుగ‌డ్డ‌ల వంటివి. చ‌క్కెర శాతం త‌క్కువ‌గా ఉన్న పండ్ల‌ను మాత్ర‌మే తినాలి. ఎలాంటి స్వీట్లు తిన‌కూడ‌దు. కొద్దిగా తేనెను వాడుకోవ‌చ్చు. మ‌ద్యపానం, ధూమ‌పానం చేయ‌కూడ‌దు. చాక్లెట్లు, కేక్స్‌, బిస్క‌ట్లు, ప్రాసెస్డ్ ఫుడ్స్ వంటివి అస్స‌లు తిన‌కూడ‌దు.

స్టెప్ 2 :
ఆకుప‌చ్చ‌ని కూర‌గాయ‌ల‌ను అధికంగా తినాలి. ఉడికించిన లేదా ప‌చ్చి కూర‌గాయ‌లు ఎక్కువ‌గా తినాలి. భోజ‌నంలో స‌గ భాగం ఇవి ఉండేలా జాగ్ర‌త్త వ‌హించాలి. మాంసాహారం తిన‌కూడ‌దు. ప‌ప్పు ధాన్యాల‌ను తీసుకోవాలి. వెన్న‌, నెయ్యికి బ‌దులుగా కొబ్బ‌రినూనెను ఉప‌యోగించాలి. ఆలివ్ ఆయిల్ కూడా వాడ‌వ‌చ్చు.

green-veggies

స్టెప్ 3 :
రాత్రి 7 గంట‌లు దాటిన త‌రువాత అస్స‌లు ఆహారం ఏమీ తిన‌కూడ‌దు. క‌నీసం ఓ పండు కూడా తిన‌కూడ‌దు. భోజ‌నానికి, భోజ‌నానికి మ‌ధ్య లెమ‌న్ లేదా హెర్బ‌ల్ టీ తాగాలి. పండ్ల ర‌సాలు తాగ‌కూడ‌దు. 3 సార్లు త‌క్కువ మోతాదులో తినాలి. లేదంటే 2 సార్లు భోజ‌నం చేసి ఒక‌సారి కూర‌గాయ‌ల స‌లాడ్ వంటివి తీసుకోవాలి.

స్టెప్ 4 :
రోజుకు క‌నీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. అందులో క‌నీసం 10 నిమిషాల పాటైనా కార్డియో వ‌ర్క‌వుట్ చేయాలి.

పైన చెప్పిన 4 స్టెప్స్ పాటిస్తే 24 నుంచి 48 గంట‌ల లోపు మీ శ‌రీరంలో ఉన్న కార్బొహైడ్రేట్ల‌న్నీ ఖ‌ర్చ‌యి, ప్రోటీన్‌, ఫ్యాట్ క‌ర‌గ‌డం మొద‌ల‌వుతుంది. దీంతో కేవ‌లం కొద్ది రోజుల్లోనే మీరు సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు.

Comments

comments

Share this post

scroll to top