మాటలు కూడా సరిగ్గా పలకడం రాని పిల్లాడు….ఉగ్రవాదుల గురించి మీడియాకిచ్చిన ఇంటర్వ్యూ.! గుండెల్ని పిండింది.

పారిస్ లో ఉగ్రవాదుల నరమేధానికి బలైన వారికి  బాటాక్లాన్‌ థియేటర్‌ వద్ద పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించి, వారి ఆత్మ కు శాంతి కలగాలని ప్రార్థించారు  ఫ్రాన్స్ పౌరులు. ఈ సందర్భంగా హృదయాన్ని కలిచిదేసే సంఘటన ఒకటి అక్కడ జరిగింది.   ఓ  మీడియా ప్రతినిధి… ఓ తండ్రిని, అతని కుమారుడిని పలకరించాడు. . ఐసిస్‌ ఉగ్రవాదులు ప్రజలను ఎందుకు చంపారు తెలుసా..?  అని అడిగిన ప్రశ్నకు ఆ కుర్రాడు చెప్పిన సమాధానానికి  సోషల్‌ మీడియా యావత్తు నివ్వెరపోయింది. వారి మధ్య జరిగిన సంభాషణ యధాతథంగా మీకోసం.

 • బాలుడు : అవును. వారు నిజంగా చెడ్డవాళ్లు. అలాంటి వాళ్లెప్పుడూ మంచిపనులు చేయరు. మేము జాగ్రత్తగా ఉండాలంటే ఇల్లు మారాలి.
 • తండ్రి : డోంట్‌ వర్రీ. మనం ఇల్లు మారాల్సిన అవసరం లేదు. ఫ్రాన్స్ మన నివాసం.
 • బాలుడు : కానీ ఇక్కడ చెడ్డవాళ్లున్నారు డాడీ.
 • తండ్రి : అవును. కానీ చెడు వ్యక్తులు ఎక్కడైనా ఉంటారు.
 • బాలుడు : వారి వద్ద తుపాకులున్నాయి. నిజంగా కాల్చేస్తారు డాడీ.
 • తండ్రి : సరే. వాళ్ల దగ్గరు గన్స్ ఉంటే.. మన దగ్గర ఫ్లవర్స్ ఉన్నాయి.
 • బాలుడు : కానీ పూలు ఏమీ చేయలేవు కదా?
 • తండ్రి : అయ్యుండొచ్చు. ప్రతి ఒక్కరూ పూలను కింద పెడుతున్నారు. ఇవి తుపాకులకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి.
 • బాలుడు : అవి కాపాడతాయా? క్యాండిల్స్ కూడా రక్షిస్తాయా?
 • తండ్రి : ఇవి చనిపోయిన వారిని గుర్తుచేస్తాయి.
 • బాలుడు : పూలు, క్యాండిల్సే ఇక్కడ రక్షించడానికి మిగిలాయి.
 • తండ్రి : అవును.
 • రిపోర్టర్‌ : ఇపుడు బెటర్‌గా ఉందని భావిస్తున్నారా..?
 • బాలుడు : అవును. బెటర్‌గా ఉందని నేను భావిస్తున్నా.

Watch Video:

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top