మన దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక రెస్టారెంట్లు, ఆఫీస్లు, ఇతర ప్రదేశాల్లో రోజూ ఎంత ఆహారం వృథా అవుతుందో అందరికీ తెలిసిందే. ఇంత జరుగుతున్నా చాలా మంది మాత్రం అవసరానికి మించిన ఆహారాన్ని తీసుకుంటున్నారు, కానీ దాన్ని మొత్తం తినడం లేదు. దీంతో ఎంతో ఆహారం వృథా అవుతోంది. ఇక మన దేశంలో అయితే ఇలా వృథా అయ్యే ఆహారం కొన్ని లక్షల క్వింటాళ్లు ఉంటుంది. దాన్ని సరిగ్గా ఉపయోగిస్తే ఎంతో మందికి ఆహారం దొరుకుతుంది. వారికి ఆకలి బాధలు ఉండవు. సరిగ్గా ఇదే సూత్రాన్ని ఇప్పుడు అనేక కార్పొరేట్ కార్యాలయాల్లో పాటిస్తున్నారు. అందులో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కూడా ఒకటి.
బెంగుళూరులోని టాటా కన్సల్టెన్సీ సర్వీసస్ కార్యాలయంలో ఉన్న క్యాంటీన్లో ఏర్పాటు చేసిన బోర్డు తాజాగా వైరల్ అయింది. అందులో ఏముందంటే… మీకు కావల్సినంత ఆహారాన్ని తీసుకోండి, కానీ తీసుకున్న మొత్తం ఆహారాన్ని తినండి, వేస్ట్ చేయకండి, నిన్న 45 కిలోల ఆహారం వేస్ట్ అయింది. దాంతో 180 మంది కడుపు నిండేది… అని ఉంది. అయితే ఈ బోర్డును ఎవరో ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఆ ఫొటో కాస్తా వైరల్ అయింది. ఆహారం వేస్ట్ చేయరాదంటూ అందరూ ఆ ఫొటోకు కామెంట్లు పెడుతున్నారు. అయితే మీకు తెలుసా..? కొన్ని రెస్టారెంట్లలో కూడా దాదాపుగా ఇలాంటి బోర్డులే మనకు దర్శనమిస్తున్నాయి. వాటిలో చాలా వరకు విదేశాల్లోనివే. ఆహారం వేస్ట్ చేయకండి, వేస్ట్ చేస్తే మీరు వేస్ట్ చేసిన ఆహారానికి చార్జ్ చెల్లించాలి. అని ఒక బోర్డు ఉంటే, మీరు ప్లేట్ ఖాళీ అయ్యేలా మొత్తం తింటే మీకు చాక్లెట్ ఇస్తాం.. అని మరొక బోర్డు ఉంటుంది. కావాలంటే మీరు ఆ బోర్డులను చూడవచ్చు.
చూశారుగా… పైన ఇచ్చిన బోర్డు ఫొటోలను. అవును, ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు అనేక చోట్ల ఆహారం పై ఇదే ధోరణి అందరిలోనూ ఉంది. అందుకే రెస్టారెంట్లు, హోటల్స్, ఇతర కార్యాలయాల్లో ఇలాంటి బోర్డులు దర్శనమిస్తున్నాయి. కాబట్టి మీరు కూడా ఆహారాన్ని వేస్ట్ చేయకండి. ఎంత కావాలనుకుంటే అంతే తినండి, కానీ పెట్టుకుంది మొత్తం తినండి. వేస్ట్ చేస్తే అది కొంత మంది కడుపు నింపుతుందని మాత్రం గుర్తుంచుకోండి..!