లైంగిక వేధింపులకు గురైన అతన్ని “శ్రీదేవి” అతనిని కాపాడింది అంట.! ఎలాగో తెలుసా.?

బాలీవుడ్ న‌టి శ్రీ‌దేవి మ‌ర‌ణం దేశ వ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానుల‌ను ఎంత‌టి ఆవేద‌న‌కు గురి చేసిందో అంద‌రికీ తెలిసిందే. చాలా మంది ఆమె మ‌ర‌ణాన్ని జీర్ణించుకోలేక‌పోయారు. చాలా ఆరోగ్యంగా ఉన్న వ్య‌క్తి అంత స‌డెన్‌గా ఎలా చనిపోయింది అంటూ అంద‌రూ ఆందోళ‌న వ్యక్తం చేశారు. ఒక గొప్ప న‌టిని కోల్పోయామ‌ని యావ‌త్ సినీ ప్ర‌పంచం క‌న్నీళ్లు పెట్టింది. అయితే నటిగా ఆమెకు ఎంతో మందికి ప్రేర‌ణ‌నిచ్చింది అన‌డంలోనూ ఎలాంటి సందేహం లేదు. ఈ క్ర‌మంలోనే ఓ వ్య‌క్తికి మాత్రం న‌టిగా కాక‌, ఓ శ‌క్తిగా ప్రేర‌ణ‌ను ఇచ్చింది శ్రీ‌దేవి. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఇంత‌కీ ఆ వ్య‌క్తి ఎవ‌రంటే…

అత‌ని పేరు హ‌రీష్ అయ్య‌ర్‌. ఇత‌ను ఓ సామాజిక వేత్త‌. ప‌లు స్వ‌చ్ఛంద కార్య‌క్ర‌మాల్లో భాగ‌స్వామి అవుతున్నాడు. అయితే హ‌రీష్ చిన్న‌త‌నంలో లైంగిక వేధింపుల‌కు చాలా సార్లు గుర‌య్యాడు. దీంతో దాని ప్ర‌భావం అత‌ని మాన‌సిక ఆరోగ్యంపై ప‌డింది. ఆ దెబ్బ‌కు అత‌ను కోలుకోలేదు. కానీ శ్రీ‌దేవి అంటే అభిమానం ఉండడం వ‌ల్ల ఆమె సినిమాల‌ను చూస్తూ ప్రేర‌ణ పొందాడు. బాల న‌టిగా ఆమె కెరీర్ ఎలా ప్రారంభించింది, ఎలా బాలీవుడ్ స్థాయికి చేరుకుంది ప్రేర‌ణ‌గా తీసుకున్నాడు. దీంతో లైంగిక వేధింపుల‌కు గురైన‌ప్ప‌టికీ అత‌నికి స‌రైన ప్రేర‌ణ ల‌భించ‌డం వ‌ల్ల అత‌ను మాన‌సికంగానూ ఎదిగాడు. ఒక ద‌శ‌లో జీవితాన్ని అంతం చేసుకోవాల‌ని చూసినా త‌న‌కు ల‌భించిన ప్రేర‌ణ‌తో జీవితంలో ముందుకే సాగాడు.

అయితే హ‌రీష్ తాను శ్రీ‌దేవిని ఇన్‌స్పిరేష‌న్ గా తీసుకున్న విష‌యం ఎప్పుడు చెప్పాడో తెలుసా..? 2012లో జ‌రిగిన స‌త్య‌మేవ జ‌య‌తే అనే టీవీ షోలో తాను ఒక అతిథిగా వెళ్లిన‌ప్పుడు న‌టుడు అమీర్‌ఖాన్‌తో మాట్లాడుతున్న సంద‌ర్భంలో ఈ విష‌యాన్ని అత‌ను చెప్పాడు. అంతేకాదు, ఆ షోలో స్వ‌యంగా శ్రీ‌దేవి పాల్గొని హ‌రీష్‌ను క‌లిశారు కూడా. దీంతో అప్పుడు హరీష్‌కు క‌లిగిన ఆనందం మాటల్లో చెప్ప‌లేనిది. అప్పుడు శ్రీ‌దేవి హ‌రీష్ మాన‌సిక శ‌క్తికి అత‌న్ని అభినందించింది కూడా. అత‌ను చేస్తున్న యాక్టివిటీల‌కు స‌పోర్ట్‌గా ఆమె సంత‌కం కూడా చేసింది. అయితే ఆ త‌రువాత మ‌ళ్లీ శ్రీ‌దేవిని క‌ల‌వ‌కపోయినా, ఆమె జీవితాన్ని మాత్రం అత‌ను ఇన్‌స్పిరేష‌న్‌గా తీసుకుంటూనే ఉన్నాడు. కాగా ఇటీవ‌ల ఆమె మ‌ర‌ణం అత‌న్ని మ‌రింత బాధించింది. దీంతో అత‌ను ట్విట్ట‌ర్‌లో ఆమెకు నివాళులు తెలియ‌జేశాడు. ఇదీ.. శ్రీ‌దేవిని ప్రేర‌ణ‌గా తీసుకున్న ఓ వ్య‌క్తి స్టోరీ. ఇంకెంత‌మంది ఇలాంటి వారున్నారో క‌దా..!

Watch Video:

Comments

comments

Share this post

scroll to top