ఒక్క రోజులో …1 KG బ‌రువు త‌గ్గ‌డం సాధ్య‌మేనా? కాల‌రీ లెక్క‌లు ఏమంటున్నాయ్. వివ‌ర‌ణ‌.!

బరువు తగ్గడం అన్నది నేటి తరుణంలో ఎంత కష్టంగా మారిందో అందరికీ తెలిసిందే. ఎన్ని వ్యాయామలు చేసినా, పౌష్టికాహారం తీసుకున్నా బరువు తగ్గడం లేదని కొందరు వాపోతుంటారు. అయితే నిజానికి మనకు రోజూ ఎన్ని క్యాలరీల శక్తి కావాలో, ఎన్ని క్యాలరీల ఆహారాన్ని తీసుకుంటే బరువు తగ్గవచ్చో తెలుసా..?

నిత్యం ఒక వ్యక్తికి శారీరక శ్రమ ఎక్కువగా చేయకపోతే 2500 క్యాలరీల శక్తి అవసరం అవుతుంది. అయితే 3500 క్యాలరీల శక్తిని ఖర్చు చేస్తే అప్పుడు మనం 1 పౌండు (దాదాపుగా 0.45 కిలోగ్రాములు) బరువు తగ్గుతాం. అంటే నిత్యం మనం 6000 క్యాలరీల శక్తినిచ్చే ఆహారాన్ని తీసుకుంటే అందులో 2500 క్యాలరీల శక్తిని శరీరం వినియోగించుకుంటే మిగిలిన 3500 క్యాలరీల శక్తి కొవ్వు కింద మన శరీరంలో మారుతుంది. అంటే 1 పౌండ్‌ బరువు పెరుగుతారన్నమాట.

అయితే మనకు కావల్సిన 2500 క్యాలరీల కన్నా తక్కువ క్యాలరీలను ఇచ్చే ఆహారాన్ని తీసుకుంటే అంత మొత్తం క్యాలరీలకు కొరత ఏర్పడుతుంది కనుక శరీరం ఆ మొత్తాన్ని ఫ్యాట్‌ నుంచి తీసుకుంటుంది. దీంతో బరువు తగ్గుతారు. ఇక దాదాపుగా 7000 క్యాలరీల శక్తిని ఖర్చు చేస్తేనే గానీ మనం 1 కిలో బరువు తగ్గలేం. అయితే 7000 క్యాలరీల శక్తిని కరిగించాలంటే అందుకు మనం చాలా సమయమే పడుతుంది. ఎలా అంటే.. ఒక గంట పాటు జాగింగ్‌ చేస్తే 400 క్యాలరీలు ఖర్చవుతాయి. అదే 17.5 గంటల పాటు జాగింగ్‌ చేస్తే 7000 క్యాలరీలను కరిగించవచ్చు. అయితే ఇలా నిరంతరాయంగా ఆగకుండా 17.5 గంటల పాటు జాగింగ్‌ చేయడం ఎవరి తరం కాదు. అంటే.. ఒక కిలో బరువును ఒక రోజులో తగ్గించుకోలేం. కేవలం లైపో సక్షన్‌ సర్జరీ చేస్తే తప్ప అలా బరువును తగ్గించడం సాధ్యం కాదు. అయితే నిత్యం కనీసం 1 గంట పాటు హై ఇంటెన్సిటీ ఎక్సర్‌సైజ్‌లను చేస్తే రోజుకు 500 నుంచి 1000 క్యాలరీల వరకు తగ్గించుకోవచ్చు. దీంతో ఎంత లేదన్నా వారం, పది రోజుల్లో ఒక కిలో బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. ఈ దిశగా ప్రయ్నతిస్తే ఎవరైనా అధిక బరువు సులభంగా తగ్గవచ్చు

Comments

comments

Share this post

scroll to top