కంటి ఆకృతిని బ‌ట్టి ఎదుటి వ్య‌క్తుల స్వ‌భావాన్ని ఎలా తెలుసుకోవ‌చ్చో చూడండి..!

ఎదుటి వ్య‌క్తులు ఎలాంటి వారో, వారి మ‌న‌స్త‌త్వం ఎలాంటిదో చెప్పేందుకు అనేక ర‌కాల ప‌ద్ధ‌తులు అందుబాటులో ఉన్నాయి. ఈ విష‌యం గురించి దాదాపు అంద‌రికీ బాగానే తెలుసు. ఈ క్ర‌మంలో ఎదుటి వారి క‌ళ్ల ఆకృతిని బ‌ట్టి వారు ఎలాంటి వారో, ఎలా ఉంటారో, ఆ విష‌యాల‌ను ఎలా తెలుసుకోవ‌చ్చో ఇప్పుడు చూద్దాం.

eye-shapes

1. బొమ్మ‌లో ఇచ్చిన విధంగా బాదం గింజ‌ల లాంటి కంటి ఆకృతిని క‌లిగి ఉన్న‌వారు కోరిక‌ల‌ను అణ‌చుకునే వారై ఉంటార‌ట‌. వీరు అత్యంత క్ర‌మ‌శిక్ష‌ణ‌గా మెలుగుతార‌ట‌. వీరికి కామన్ సెన్స్ ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌. వీరు సెన్సిటివ్‌గా ఉండ‌డ‌మే కాకుండా త‌మ భావాల‌ను త‌మ‌కు తామే పూర్తిగా నియంత్రించుకుంటార‌ట‌.

2. గుండ్ర‌ని క‌ళ్ల ఆకృతిని క‌లిగిన వారు చూసిన వెంట‌నే ఆక‌ట్టుకునే రూపం క‌లిగి ఉంటార‌ట‌. వీరికి సృజ‌నాత్మ‌క శ‌క్తి ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌. వీరు త‌మ మ‌న‌స్సులో ఏముందో దాచుకోకుండా బ‌య‌ట‌కు చెప్పేస్తార‌ట‌. కొన్ని సంద‌ర్భాల్లో ఎమోష‌న‌ల్ అవుతార‌ట‌.

3. క‌ళ్లు ద‌గ్గరికి ఉన్న వారు ఏదైనా ఒక విష‌యాన్ని ఎంత లోతుకు వెళ్ల‌యినా తెలుసుకుంటార‌ట‌. వీరు వాతావ‌ర‌ణంలో ఏర్ప‌డే మార్పుల‌ను ప్ర‌ధానంగా అధిక‌, అల్ప ఉష్ణోగ్ర‌త‌ల‌ను, ట్రాఫిక్ జాంల‌ను త‌ట్టుకోలేర‌ట‌. వీరికి కోపం కూడా త్వ‌ర‌గా వ‌స్తుంద‌ట‌.

4. క‌ళ్లు దూరంగా ఉన్నవారు పైన చెప్పిన వారికి పూర్తిగా వ్య‌తిరేక‌మ‌ట‌. వీరు ఎలాంటి ప‌రిస్థితినైనా త‌ట్టుకుంటార‌ట‌. కొత్త‌గా ఆలోచిస్తార‌ట‌.

5. చిత్రంలో చూపిన విధంగా క‌ళ్ల‌ను క‌లిగి ఉన్న వారు అత్యంత సునిశిత దృష్టిని క‌లిగి ఉంటార‌ట‌. తాము అనుకున్న దాంట్లో ముందుకు సాగుతుంటార‌ట‌. స‌హ‌జంగా ఇలాంటి క‌ళ్లు ఉన్న వారు ర‌చ‌యిత‌లుగా ఎక్కువ‌గా రాణించేందుకు అవ‌కాశం ఉంటుంద‌ట‌.

6. క‌ళ్లు చిన్న‌గా ఉన్న‌వారు ప్ర‌తి విష‌యంలో ప‌ర్‌ఫెక్ష‌న్‌ను కోరుకుంటార‌ట‌. వీరి మెద‌డు ఎల్ల‌ప్పుడూ షార్ప్‌గా ప‌నిచేస్తుంద‌ట‌. అత్యంత ప్ర‌తిభావంతులై ఉంటార‌ట‌.

eye-shapes

7. బొమ్మ‌లో ఇచ్చిన విధంగా క‌ళ్లు ఉన్న‌వారు ఏదైనా ఒక విష‌యం ప‌ట్ల అత్యంత ఆస‌క్తిని ప్ర‌దర్శిస్తార‌ట‌. దాని గురించి తెలుసుకునేంత వ‌ర‌కు విడిచిపెట్ట‌ర‌ట‌. ఏ ప‌ని పట్ల‌యినా వారు అత్యంత కృత నిశ్చ‌యంతో ఉంటార‌ట‌.

8. ఈ క‌ళ్లు క‌లిగి ఉన్న‌వారు ఎల్ల‌ప్పుడూ భ‌యాందోళ‌న‌ల‌తో ఉంటార‌ట‌. త‌మ‌కు ఏదైనా కీడు జ‌రుగుతుందేమోన‌ని ఆలోచిస్తుంటార‌ట‌. ఎల్ల‌ప్పుడూ నిరుత్సాహానికి గుర‌వుతుంటార‌ట‌. అయితే వీరు ఎవ‌రిని ప్రేమించినా అత్యంత అంకిత‌మైన ప్రేమ‌ను క‌న‌బ‌రుస్తార‌ట‌.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top