ద్రౌప‌ది త‌న ఐదుగురు భ‌ర్తలు అయిన పాండ‌వుల‌తో ఎలా కాపురం చేసిందో తెలుసా..?

మ‌న‌లో చాలా మందికి మ‌హాభార‌త పురాణం గురించి తెలుసు. అందులో ముఖ్యంగా పాండ‌వుల‌కు ద్రౌప‌ది ఉమ్మ‌డి భార్య అని కూడా తెలుసు. అయితే మీకు తెలుసా..? నిజానికి స్వ‌యంవ‌రంలో ద్రౌప‌దిని గెలుచుకుంది అర్జునుడే. కానీ మిగిలిన న‌లుగురు అన్న‌ద‌మ్ములు కూడా ద్రౌప‌దిని వివాహం చేసుకోవాల్సి వ‌చ్చింది. కొన్ని అనుకోని ప‌రిస్థితుల్లో ఆ సంఘ‌ట‌న జ‌రుగుతుంది. అయితే అలా ఎందుకు జ‌రిగిందో, అస‌లు ద్రౌప‌ది త‌న ఐదుగురు భ‌ర్త‌ల‌తో ఎలా కాపురం చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం.

పాంచాల రాజు ద్రుప‌దుడు. అత‌ని కుమార్తె ద్రౌప‌ది. ఈమె య‌జ్ఞ కుండం నుంచి జ‌న్మించింద‌ని చెబుతారు. అయితే ద్రౌప‌దికి యుక్త వ‌య‌స్సు రాగానే ఆమెకు ద్రుప‌దుడు స్వ‌యం వ‌రం ప్ర‌క‌టిస్తాడు. అందులో భాగంగా ఏర్పాటు చేసిన మ‌త్స్య యంత్రాన్ని ఛేదించిన వీరుడికే ద్రౌప‌దిని ఇచ్చి పెళ్లి చేస్తానంటాడు. ఒక శుభ ముహుర్తాన స్వ‌యం వ‌రం ఏర్పాటు చేస్తాడు కూడా. అయితే దానికి దుర్యధునుడు, క‌ర్ణుడు, ఇత‌ర కౌర‌వులు, ఇత‌ర రాజ్యాల‌కు చెందిన రాజుల‌తోపాటు పాండ‌వులు కూడా వెళ్తారు. కానీ వారు బ్రాహ్మ‌ణ వేషాల్లో ఉంటారు. ఎందుకంటే అప్పుడు వారు అర‌ణ్య వాసంలో ఉంటారు.

అయితే క‌ర్ణుడితోపాటు చాలా మంది మ‌త్స్య యంత్రాన్ని ఛేదించ‌డంలో విఫ‌ల‌మ‌వుతారు. కానీ అర్జునుడు మ‌త్స్య యంత్రాన్ని కొడ‌తాడు. దీంతో ద్రౌప‌ది అత‌న్ని వివాహ‌మాడుతుంది. అనంత‌రం పాండవులు ఐదుగురు, ద్రౌప‌ది క‌ల‌సి ఇంటికి వెళ్తారు. తాము ఒక బ‌హుమ‌తి తెచ్చామ‌ని త‌ల్లి కుంతికి చెప్ప‌గా, ఆమె విష‌యం తెలుసుకోకుండానే ఏ బ‌హుమ‌తి అయినా అంద‌రూ స‌మానంగా పంచుకోవాల‌ని చెబుతుంది. దీంతో పాండవులు విస్మయానికి లోన‌వుతారు. అయినా త‌ల్లి ఆదేశించింది క‌నుక‌, అంద‌రూ క‌ల‌సి ద్రౌప‌దిని వివాహ‌మాడ‌తారు. తీరా విష‌యం తెలిసే స‌రికే వివాహం జ‌రిగిపోతుంది. దీంతో కుంతికి కూడా ఏం చేయాలో అర్థం కాదు. ఇక అప్ప‌టి నుంచి ద్రౌప‌ది పాండ‌వులు ఐదుగురికి భార్య అవుతుంది.

పాండ‌వుల‌కు భార్య‌గా ద్రౌప‌ది చ‌క్క‌గా మెలుగుతుంది. అయితే ఒక‌సారి నార‌ద‌ముని పాండ‌వుల వ‌ద్ద‌కు వ‌స్తాడు. పూర్వం ఒక‌ప్పుడు సందుడు, ఉప సందుడు అనే ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు దేవుళ్ల‌ను జ‌యించ‌గ‌లిగే బ‌ల‌వంతులు అయిన‌ప్ప‌టికీ ఒక యువ‌తి కార‌ణంగా ఎలా విడిపోయారో నార‌దుడు పాండవుల‌కు చెబుతాడు. దీంతో నార‌ద‌ముని సూచ‌న మేర‌కు పాండ‌వులు ఐదుగురు ఒక నియ‌మం పెట్టుకుంటారు. అదేమిటంటే… ద్రౌప‌ది త‌న ఐదుగురు భ‌ర్త‌ల్లో ఒక్కొక్క‌రి ద‌గ్గ‌ర కొన్ని నెల‌లు ఉంటుంది. ఆ స‌మ‌యంలో ఇత‌ర భ‌ర్త‌లు ఎవ‌రూ ఆమె వ‌ద్దకు వెళ్ల‌కూడ‌దు. వెళితే అర‌ణ్య వాసం చేయాల‌నే నియ‌మం పెట్టుకుంటారు. ఈ క్ర‌మంలో ద్రౌప‌ది ఒక‌సారి ధ‌ర్మ‌రాజు వ‌ద్ద ఉంటుంది. అయితే అదే స‌మ‌యంలో ఓ వ్య‌క్తి అర్జునుడి వ‌ద్ద‌కు వ‌చ్చి త‌న ప‌శువుల‌ను కొంద‌రు దొంగిలించుకుపోయార‌ని, కాపాడాల‌ని అడుగుతాడు. దీంతో అర్జునుడు సిద్ధ‌మ‌వుతాడు. అయితే అత‌ని విల్లు ధ‌ర్మారాజు ఇంట్లో ఉంటుంది. అయిన‌ప్ప‌టికీ ఓ వ్య‌క్తికి స‌హాయం చేయాల‌ని చెప్పి తాము పెట్టుకున్న నియ‌మాన్ని ఉల్లంఘించి మ‌రీ అర్జునుడు ధ‌ర్మ‌రాజు ఇంట్లోకి ప్ర‌వేశించి విల్లును తీసుకుని వెళ్లి ఆ వ్య‌క్తికి స‌హాయం చేస్తాడు. అయితే నియమాన్ని ఉల్లంఘించినందుకు గాను అర్జునుడు స్వ‌యంగా అర‌ణ్య వాసం వెళ్తాడు. అలా ద్రౌప‌దికి ఐదుగురు భ‌ర్త‌లు ఉన్న‌ప్ప‌టికీ వారి మ‌ధ్య‌ ఏనాడూ గొడ‌వ‌లు రాలేదు..!

Comments

comments

Share this post

scroll to top