“కమెడియన్ సప్తగిరి” అసలు పేరు ఏంటో తెలుసా..? “సప్తగిరి” గా మార్చిన సంఘటన ఏంటంటే..?

సినిమా పరిశ్రమకి వచ్చాక పేర్లు మార్చుకోవడం సహజం..హీరోలు,హీరోయిన్ల పేర్లను వారికి తగ్గట్టుగా దర్శకులు మారిస్తే రంభ,జయసుధ,రవితేజ,మోహన్ బాబు ఇలా కొందరి నటుల అసలు పేర్లు వేరే…..కొంతమంది నటులు వారి మొదటి సినిమా పేర్లనే వారి పేర్ల ముందు చేర్చుకుంటారు అల్లరి నరేశ్….మరికొంతమంది దర్శకులు,నిర్మాతల పేర్లు కూడా ఈ విధంగా మార్చుకున్నవారున్నారు ఉదాహరణకు దిల్ రాజు..సప్తగిరి సిని పరిశ్రమకు రాకముందు తన పేరు వెంకట ప్రభు ప్రసాద్..ఈ పేరు సప్తగిరిగా  ఎలా మారాడాన్నది ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పారు సప్తగిరి…అసలు విషయమేమంటే…

పరుగు సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా,ఆ సినిమాలో కమెడియన్ గా నటించిన సప్తగిరి..ఆ తర్వాత ప్రేమ కథ చిత్రమ్ లో నెల్లూరు యాసలో తెగ నవ్వించారు.వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాలో సప్తగిరి కామెడికి పడి పడి నవ్వనివరుండరు..  దర్శకుడు అవ్వాలని సినీ ఫీల్డ్ కి వచ్చిన సప్తగిరి.. నటుడిగా..కమెడియన్.. హీరోగా విజయాలను అందుకున్నారు.సప్తగిరి ఎక్స్ ప్రెస్,సప్తగిరి ఎల్ ఎల్ బి సినిమాల్లో హీరొగా నటించారు.ఇప్పుడు సప్తగిరి ఎల్ ఎల్ బి సినిమాతో  హిట్ కొట్టారు. సప్తగిరి   అసలు పేర వెంకట ప్రభు ప్రసాద్‌.చిత్తూరుకి చెందిన సప్తగిరి ఇప్పటికే కమెడియన్ గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు.సప్తగిరి అనే పేరు పెట్టుకోవడం వెనుక పెద్ద స్టోరీ ఉంది.

ఆ స్టోరి ఏంటటో  సప్తగిరి మాటల్లోనే.. ” సినిమా ఇండస్ట్రీకి వెళ్లాలనే ఆలోచన ఉన్న రోజుల్లో ఒక రోజు తిరుమలకు దర్శనానికి వెళ్లా. స్వామివారిని చక్కగా దర్శించుకున్నాక కూడా సానుకూల ఆలోచనలు లేవు. అలా తిరుమల మాడ వీధుల్లో తిరుగుతున్నా. ఆలయాన్ని చూస్తూ ఒకచోట అలా నిలబడి ఉన్నా. సడెన్‌గా ఓ వ్యక్తి నా వెనుక నుంచి వచ్చి ‘నాన్నా సప్తగిరీ.. పక్కకు జరుగు’ అన్నాడు. సాధారణంగా తిరుమలలో ఏ వ్యక్తి పేరైనా తెలియకపోతే వారిని గోవిందు.. నారాయణ.. ఇలా స్వామివారి పేర్లతో పిలుస్తారు. కానీ నన్ను ఎవరబ్బా సప్తగిరి అని పిలిచారని వెనక్కి తిరిగి చూశా.ఆయన్ని చూడగానే ఒకరకమైన వైబ్రేషన్‌ వచ్చింది. కాషాయ వస్త్రధారణలో చినజీయర్‌ స్వామి వారిలా ఉన్నారు. పక్కకు జరిగి పూర్తిగా వెనక్కి తిరిగి చూడగా, అలాంటి వేషధారణలోనే ఓ 40మంది సాధువులు కనిపించారు. ఆ సన్నివేశం నాలో పాజిటివ్‌ వైబ్రేషన్‌ కలిగించింది. వాళ్లందరూ నన్ను దాటుకుంటూ వెళ్లారు. చాలా మంది నన్ను చూసి చిరునవ్వు చిందిస్తూ వెళ్లారు. ఆ రోజుతో నా పేరు సప్తగిరి అని పెట్టుకోవాలని నిర్ణయం తీసుకున్నా. ఆ తర్వాత ఓ పది.. పదిహేను రోజుల్లో హైదరాబాద్‌ వచ్చేశా.” అంటూ  తన పేరు ఎలా మారిందనేది వివరించారు…

Comments

comments

Share this post

scroll to top