క్రికెట్ అంపైర్ కావ‌డ‌మెలా.? ఆ కోర్స్ ఎక్క‌డ ఉంది..ఎలా చేరాలి?

ఇండియాలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ యే వేరు. అందుకే ఇప్పుడు చాలా మంది ఈ క్రీడ‌వైపు మ‌క్కువ చూపుతున్నారు. జ‌ట్టులో స్థానం కోసం ఎంత మంది ప్ర‌య‌త్నిస్తున్నారో అదే రీతిలో ఎంపైర్ గా త‌మ కెరీర్ ను స్టార్ట్ చేయాల‌ని కూడా చాలా మంది ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా IPL వ‌చ్చాక ఎంపైర్స్ కు ఇస్తున్న శాల‌రీ చూశాక‌..చాలా మంది అటువైపుగా త‌మ కెరీర్ ను బిల్డ్ చేసుకోవాల‌ని చూస్తున్నారు.దీని కోసం ఏమైనా కోర్సులున్నాయేమోన‌ని వెతుకుతున్నారు. వాస్త‌వానికి అలాంటి కోర్సులేవీ లేవు…అంపైర్ అవ్వాలంటే ఒక‌టే ప్రాసెస్ అదేంటో తెలుసుకుందాం.

  • ఆట‌గాడిగా క్రికెట్ లో కొద్దో గొప్పో అనుభ‌వం ఉండాలి.
  • స్టేట్ క్రికెట్ అసోసియేష‌న్ …అంపైర్స్ రిక్రూట్మెంట్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తుంది. అలా రిక్రూట్మెంట్ ప‌డ్డ‌ప్పుడు అప్లై చేసుకోవాలి.
  • అలా….అప్లై చేసుకున్న వారంద‌రినీ పిలిచి…స్టేట్ క్రికెట్ అసోసియేష‌న్ మూడు రోజుల ఓరియెంటేష‌న్ ప్రోగ్రామ్ ను నిర్వ‌హిస్తుంది.
  • ప్రోగ్రామ్ త‌ర్వాత‌…. క్రికెట్ లా కు సంబంధించిన బుక్ తో పాటు ఇత‌ర అంపైరింగ్ నాలెడ్జ్ బుక్ ను అందిస్తుంది. దానిపైనే ఎగ్జామ్ ను నిర్వ‌హిస్తారు, అందులో ఎంపికైన అభ్య‌ర్థుల‌ను BCCI కు రిఫ‌ర్ చేస్తారు.


BCCI వ‌ద్ద‌.

ఇంట‌ర్నేష‌న‌ల్ అంపైర్స్ కావాల‌నుకునే వారికి BCCI 2 ద‌శ‌ల్లో ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హిస్తుంది.

LEVEL 1:
వివిధ స్టేట్స్ నుండి వ‌చ్చిన అభ్య‌ర్థుల‌కు మ‌రోమారు ప‌రీక్ష నిర్వ‌హించి మ‌రో మెరిట్ లిస్ట్ ను త‌యారు చేసుకుంటుంది.

LEVEL 2:
BCCI త‌యారు చేసుకున్న మెరిట్ అభ్య‌ర్థుల‌కు ఎక్స్ పీరియ‌న్స్ ఉన్న అంపైర్స్ తో నాలుగు రోజులు పాటు ట్రైనింగ్ ఇస్తారు. ఈ ద‌శ‌లోనే అభ్య‌ర్థుల‌కు సైకాల‌జిక‌ల్ గా ప‌రిస్థితుల‌కు అనుగుణంగా ఎలా ఉండాలో కూడా ట్రైన్ చేస్తారు.వారికి కొన్ని లోక‌ల్ మ్యాచ్ ల‌కు అంపైరింగ్ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గిస్తుంది.

త‌ర్వాత రాత ప‌రీక్ష‌, ప్రాక్టిక‌ల్, వైవా ఈ మూడు ప‌రీక్ష‌లు పెట్టి అందులో టాప‌ర్స్ ను తీసుకొని వారికి మెడిక‌ల్ టెస్ట్ లు చేసి….ఫైన‌ల్ గా కొంత మందిని సెలెక్ట్ చేసి వారిని అంపైరింగ్ చేయ‌డానికి అర్హులుగా ఆమోదిస్తూ BCCI ఓ స‌ర్టిఫికేట్ ను జారీ చేస్తుంది.

ఎవ‌రు త్వ‌ర‌గా సెలెక్ట్ అవుతారు .

  • ఫిజిక‌ల్ గా ఫిట్ ఉన్న‌వారు. ( రోజుకి దాదాపు 7 గంట‌లు నిల‌బ‌డి అంపైరింగ్ చేయాల్సి ఉంటుంది)
  • మాన‌సికంగా ధృఢంగా ఉన్న‌వారు ( పెద్ద పెద్ద మ్యాచ్ లు జ‌రిగేట‌ప్పుడు ఆట‌గాళ్ళు త‌మ అస‌హ‌నాన్ని, అత్యుత్సాహాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ ఉంటారు ఆక్ర‌మంలో మాన‌సికంగా స్థిరంగా ఉండాలి )
  • మ్యాథ‌మెటిక‌ల్ నాలెడ్జ్ ( బేసిక్ మ్యాథ‌మెటిక‌ల్ నాలెడ్జ్ మిమ్మ‌ల్ని మంచి అంపైర్ గా నిల‌బెడుతుంది)
  • టివిల ముందు నుండి చూసినంత ఈజీ కాద‌నేది గుర్తుపెట్టుకోవాలి.

Comments

comments

Share this post

scroll to top