ఎప్పటినుండో వింటున్న “మొటిమలకు” సంభందించిన ఈ 9 అపోహలను నమ్మడం మానేయండి..! ఎందుకంటే.?

మొటిమలు. నేటి తరుణంలో చాలా మందిని ఇవి బాధిస్తున్నాయి. ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. వీటి కారణంగా చాలా మంది యువతులు నలుగురిలో తిరగాలంటేనే జంకుతున్నారు. ఎక్కడ మొటిమలతో నిండిన తమ ముఖాన్ని చూసి హేళన చేస్తారోనని భయం. అందుకే మొటిమలు వచ్చిన వారు సహజంగా బయటకు రావడానికి ఇష్టపడరు. ముఖాన్ని ఇతరులకు చూపించేందుకు సందేహిస్తారు. అయితే నిజానికి అసలు మొటిమలు అనేవి ఎందుకు వస్తాయో తెలుసా..? వాటిని ఎలా పోగొట్టుకోవాలో తెలుసా..? ఇదే ఇప్పుడు తెలుసుకుందాం.

1. పిండిపదార్థాలు అధికంగా ఉన్న ఆహారం తీసుకున్నా లేదంటే చక్కెర ఎక్కువగా ఉండే స్వీట్లు తిన్నా ఇన్సులిన్‌ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీంతో అది సెబం అనే పదార్థాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఫలితంగా అది మొటిమలకు దారితీస్తుంది. అయితే గోధుమలతో చేసిన బ్రెడ్‌, జీడిపప్పు, కాలిఫ్లవర్‌, కీరదోస వంటి వాటిని రెగ్యులర్‌గా తీసుకుంటే మొటిమలు తగ్గుతాయి.

2. కోడిగుడ్లు, మాంసం, పుట్టగొడుగులు, సీ ఫుడ్‌ లాంటి జింక్‌ ఎక్కువగా ఉండే ఆహారాలను తిన్నా మొటిమలు తగ్గుతాయి.

3. క్యారెట్లు, క్యాబేజీ, పాలకూరను తరచూ తింటున్నా మొటిమలను తగ్గించుకోవచ్చు. వీటిలో ఉండే విటమిన్‌ ఎ చర్మ సంరక్షణకు మేలు చేస్తుంది.

4. పొగతాగేవారికి కూడా మొటిమలు ఎక్కువగా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అదే ఆ అలవాటు మానేస్తే గనక చర్మానికి ఆక్సిజన్‌ సరఫరా పెరుగుతుంది. దీంతో చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. ఫలితంగా మొటిమలు రావు.

5. చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి కదా అని చెప్పి ఏది పడితే ఆ బ్యూటీ క్రీంను వాడరాదు. చాలా వాటిలో ఆల్కహాల్‌, ఆయిల్స్‌ ఉంటాయి. ఇవి మొటిమలకు కారణమవుతాయి. కనుక ఇవి లేకుండా ఉండే క్రీములు వాడితే బెటర్‌. ముఖ్యంగా అలోవెరా, రెటినాల్స్‌ , పెప్టైడ్‌ వంటి పదార్థాలు ఉండే క్రీములు వాడితే మొటిమలు త్వరగా తగ్గుతాయి.

6. ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల కూడా చర్మంలో ఉండే శ్వేదగ్రంథులు బాగా పనిచేసి సెబంను ఎక్కువగా విడుదల చేస్తాయి. దీంతో మొటిమలు వస్తాయి. అలా కాకుండా ఉండాలంటే బయటకు వెళ్లేటప్పుడు సన్‌ స్క్రీన్‌ లోషన్‌ను వాడాలి. దీంతో మొటిమలు రావు.

7. నిత్యం మానసిక ఆందోళన, డిప్రెషన్‌తో సతమతమయ్యే వారికి కూడా మొటిమలు వస్తాయి. కనుక మనస్సులో ఎలాంటి ఆలోచనా, దిగులు పెట్టుకోకుండా హాయిగా, ప్రశాంతంగా ఉంటే తద్వారా చర్మం కూడా కాంతివంతంగా, యంగ్‌గా ఉంటుంది.

8. ముఖాన్ని ఎప్పటికప్పుడు కడుగుతూ ఉన్నా మొటిమలు పోతాయి. కానీ అలా కడిగేందుకు కేవలం నీటిని వాడితే చాలు, ఫేస్‌వాష్‌లు, క్రీములు, సబ్బులు ఉపయోగించి ముఖాన్ని కడగాల్సిన పనిలేదు.

9. ఇక చివరిగా బంపర్‌ టిప్‌ ఏమిటంటే… మీరు రోజూ ఉపయోగించే ఏదైనా టూత్‌ పేస్ట్‌ను ముఖానికి రాసి కడిగేయండి. ఇలా తరచూ చేస్తున్నా చాలు, మొటిమలు పోతాయి.

Comments

comments

Share this post

scroll to top