మ‌నిషి చ‌నిపోయాక అత‌ని ఆత్మ య‌మ‌ధ‌ర్మరాజు ద‌గ్గ‌రికి ఎలా వెళ్తుందో తెలుసా..?

మ‌నిషి చ‌నిపోయాక ఏం జ‌రుగుతుంది? అత‌ని శ‌రీరాన్న‌యితే ఖ‌న‌నం చేస్తారు. మ‌రి ఆత్మ సంగ‌తి? అది ఎక్క‌డికి వెళ్తుంది? ఎన్ని రోజుల పాటు భూమిపై ఉంటుంది? మీకు తెలుసా? ఆ… అయినా ఈ రోజుల్లో ఆత్మ‌లు, ప్రేతాత్మ‌లు ఏంటి అంటారా? అలా అనుకునే వారు ఉంటే ఉంటార‌నుకోండి. వారి సంగ‌తి ప‌క్క‌న పెడితే అస‌లు చనిపోయిన వారి గురించి హిందూ పురాణాలు ఏం చెబుతున్నాయి? మ‌నిషి మ‌ర‌ణించాక అత‌ని ఆత్మకు ఏమ‌వుతుంది? య‌మ‌ధ‌ర్మ రాజు ద‌గ్గ‌రికి ఎలా వెళ్తారు? త‌దిత‌ర విష‌యాల‌ను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

yama-and-yamadutha

మ‌నిషి మ‌ర‌ణానంత‌రం జ‌రిగే ప‌రిణామాల గురించి హిందూ శాస్త్రం ప్ర‌కారం గ‌రుడ పురాణంలో వివ‌రించ‌బ‌డింది. మ‌రికొద్ది సెక‌న్ల‌లో చ‌నిపోతాడ‌న‌గా మ‌నిషికి సృష్టి అంతా క‌నిపిస్తుంద‌ట‌. త‌నకు ఆ స‌మయంలో దివ్య దృష్టి లాంటిది వ‌స్తుంద‌ట‌. దీంతో అత‌ను ప్ర‌పంచాన్నంత‌టినీ అర్థం చేసుకుంటాడ‌ట. కానీ ఆ క్ష‌ణంలో ఏమీ మాట్లాడ‌లేడ‌ట‌. అయితే ఆ స‌మ‌యంలోనే మ‌నిషి య‌మ‌దూత‌ల‌ను చూస్తాడ‌ట‌. వారు అత్యంత వికారంగా, న‌ల్ల‌గా, త‌ల అనేది ఒక స‌రైన ఆకారం లేకుండా ఆయుధాల వంటి పెద్ద పెద్ద గోళ్ల‌తో అత్యంత భ‌యంక‌రంగా వారు క‌నిపిస్తార‌ట‌. దీంతో మ‌నిషికి నోటి నుంచి ఉమ్మి వ‌స్తూ దుస్తుల్లోనే మూత్ర లేదా మ‌ల విసర్జ‌న చేస్తాడ‌ట‌. అనంత‌రం అన్ని స్పృహ‌ల‌ను కోల్పోయి చివ‌రికి ప్రాణం పోతుంద‌ట‌. దీంతో ఆ ప్రాణాన్ని (ఆత్మ‌ను) య‌మ‌దూత‌లు న‌ర‌కానికి తీసుకువెళ్తార‌ట‌.

య‌మ‌దూత‌లు ఆత్మ‌ల‌ను న‌రకానికి తీసుకువెళ్లేందుకు దాదాపు 47 రోజుల స‌మ‌యం ప‌డుతుంద‌ట‌. ఈ క్ర‌మంలో దారిలో ఆత్మ‌ల‌ను య‌మ‌దూత‌లు అనేక చిత్ర‌హింస‌లు పెడ‌తార‌ట‌. త‌మ‌ను చూసి భ‌య‌ప‌డినా, ఎక్క‌డైనా ఆగినా ఆత్మ‌ల‌ను కొర‌డాల వంటి ఆయుధాల‌తో చిత‌క్కొడుతూ య‌మ‌దూత‌లు తీసుకెళ్తార‌ట‌. దీంతోపాటు న‌రకంలో విధించే శిక్ష‌ల‌ను గురించి య‌మ‌దూత‌లు ఆత్మ‌ల‌కు క‌థ‌లు క‌థ‌లుగా చెబుతార‌ట‌. దీంతో ఆత్మ‌లు ఏడుస్తాయ‌ట‌. త‌మ‌ను అక్క‌డికి తీసుకువెళ్ల‌వ‌ద్ద‌ని ప్రార్థిస్తాయ‌ట‌. అయినా య‌మ‌దూత‌లు క‌నిక‌రించ‌రు స‌రి కదా, ఇంకాస్త క‌ఠినంగా ప్ర‌వ‌ర్తిస్తూ ఆత్మ‌ల‌ను య‌మ‌ధ‌ర్మ రాజు ముందు ప్ర‌వేశ‌పెడ‌తార‌ట‌.

soul-to-hell

న‌ర‌కంలో య‌మ‌ధ‌ర్మ‌రాజు మ‌నుషుల ఆత్మ‌ల‌కు వారు చేసిన పాప‌, పుణ్యాల ప్ర‌కారం శిక్ష‌లు వేస్తాడ‌ట‌. చిన్న చిన్న త‌ప్పులు చేసి ప‌శ్చాత్తాప ప‌డుతూ దైవాన్ని ప్రార్థిస్తే వాటిని పాపాల కింద య‌మ‌ధ‌ర్మ రాజు చూడ‌డ‌ట‌. కానీ దొంగ‌త‌నం, హ‌త్య వంటి నేరాల‌కు మాత్రం త‌ప్ప‌నిస‌రిగా శిక్ష ప‌డే తీరుతుంద‌ట‌. అబ‌ద్దాన్ని కూడా పాపం గానే ప‌రిగ‌ణిస్తార‌ట‌. అయితే పాప‌, పుణ్యాల‌ను లెక్కించ‌డానికి ముందు య‌ముడు ఆత్మ‌ల‌ను మ‌రోసారి భూలోకానికి వారి బంధువుల వ‌ద్ద‌కు పంపిస్తాడ‌ట‌. ఈ క్ర‌మంలో ఆత్మ‌కు చెందిన వారు హిందూ ధ‌ర్మ శాస్త్రం ప్ర‌కారం క‌ర్మ‌కాండ‌లు, పిండ ప్ర‌దానాలు అన్నీ చేయాల్సి ఉంటుంద‌ట‌. ఇవ‌న్నీ మ‌నిషి చ‌నిపోయిన 10 రోజుల్లో పూర్తి చేయాల‌ట‌. లేదంటే య‌మ‌లోకం నుంచి వ‌చ్చిన ఆత్మ అక్క‌డే చెట్ల‌పై తిరుగుతుంద‌ట‌. ఈ క‌థంతా విన‌డానికి ఆశ్చ‌ర్యంగా ఉంటుంది కానీ, గ‌రుడ పురాణంలో దీన్ని చెప్పార‌ట‌. అది చ‌దివితే ఇంకా మ‌రిన్ని విష‌యాలు తెలిసేందుకు అవ‌కాశం ఉంటుంది.

Comments

comments

Share this post

4 Replies to “మ‌నిషి చ‌నిపోయాక అత‌ని ఆత్మ య‌మ‌ధ‌ర్మరాజు ద‌గ్గ‌రికి ఎలా వెళ్తుందో తెలుసా..?”

 1. Nagaraju says:

  Manishi chanipoyaka thanani yamadhuthalu 47 days ki theeskelthe mari 10 days lo karmakandalu chesinapudu aathma ekkaduntundi

 2. sudhakar says:

  man dead to go an yamadarma raju 45 days time and it Wii back and earth it its only 10 days complete what is that time is not match that will going

 3. mohammad yakub says:

  Manam chanipoyaka atmanu 47days time padutundi yamalokam ku povadaniki
  But yamudu malli karmakandalu 10dayslo purthi cheyamani chepparu apudu atma velladaniki 47days pattindi ga mari apatike karmakandalu ayipotayi it’s fake story emaina chepthe nammela undali boss

 4. ravindra modi says:

  భగవద్గీత ప్రకారం పాత దుస్తులు విడిచి కొత్త దుస్తులు ధరించినట్టు ఆత్మ
  మరో శరీరాన్ని ధరిస్తుందని……… ఇక ఈ శిక్షలు ఎలా????
  ఆత్మని నీరు తడుపజాలదు,అగ్ని ధహింపజాలదు … అలాంటప్పుడు ఆత్మకి ఎలా
  శిక్షించగలరు ?????

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top