హోటల్ సిబ్బంది సంచలన కథనం: “అప్పటికి శ్రీదేవి చనిపోలేదు.”.! బోనీ చెప్పింది కట్టుకథేనా.?

శ్రీదేవి మృతిలో మ‌రో ట్విస్ట్..! ఆమె గుండెపోటుతో మ‌ర‌ణించ‌లేద‌ని డాక్ట‌ర్లు తేల్చారు. ప్ర‌మాద‌వ‌శాత్తు నీటిలో మునిగి మ‌ర‌ణించిన‌ట్లు ఫోరెన్సిక్ నివేదిక‌లో తేలింది. శ్రీదేవి మరణానికి సంబంధించి దుబాయ్ అధికారులు ఫోరెన్సిక్ రిపోర్ట్‌ను విడుదల చేశారు. ఆమె ప్రమాదవశాత్తు మృతి చెందింద‌ని, ఇందులో ఎలాంటి కుట్ర లేదని తేల్చి చెప్పారు. అయితే ఆమె రక్త నమూనాల్లో ఆల్కహాల్ ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. మ‌ద్యం మ‌త్తులో బ్యాలెన్స్ త‌ప్పి.. బాత్‌టబ్‌లో ప‌డ‌టంతో నీటిలో మునిగి ఊపిరాడ‌క ఆమె చ‌నిపోయుంటుంద‌ని వెల్లడించారు.

మద్యం మత్తులో ఇలా జరిగిందా.? లేక నిజంగా హార్ట్ ఎటాక్ వచ్చిందా.? అనేది ఇంకా తేలలేదు. ఒకొక్కరి కథనం ఒకోలాగా ఉంది. ఇది ఇలా ఉండగా జుమీరా ఎమిరేట్స్ టవర్స్ సిబ్బంది చెప్పిన కథనం మరోలా ఉంది.

హోటల్ సిబ్బంది కథనం ప్రకారం “రాత్రి 10.30 గంటల ప్రాంతంలో హోటల్ రూం నుంచి సర్వీస్ కావాలని పిలుపు వచ్చింది. అయితే సిబ్బంది తలుపు తట్టినా గానీ డోర్ తీయలేదు అని సిబ్బంది చెప్పడం గమనార్హం.శ్రీదేవి ఉన్న రూం తలుపు తీయకపోవడంతో వెంటనే హోటల్ యాజమాన్యానికి సమాచారం అందించాను. దాంతో బలవంతంగా తలుపులు తెరిచాం. అప్పటికే శ్రీదేవి బాత్రూంలో నేలపై పడి ఉన్నది. అయితే అప్పటికి ఇంకా ఆమె చనిపోలేదు. నేలపై శ్రీదేవిని చూడగానే ఆందోళన మొదలైంది. ఇంకా హృదయ స్పందన ఉన్నట్టు గుర్తించాం. వెంటనే రషీద్ హాస్పిటల్ తరలించాం అని హోటల్ సిబ్బంది వెల్లడించారు. హాస్పిటల్‌కు తరలించే సరికి ఆమె మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.”

Comments

comments

Share this post

scroll to top