హోటల్ లో డబ్బులు కట్టకుండా పారిపోయిన దండుపాళ్యం హీరోయిన పూజా గాంధీ…

దండుపాళ్యం చిత్రం ద్వారా ఫేమస్ అయిన పూజా గాంధీ ఇప్పుడు తాజాగా ఓ వివాదంలో ఇరుక్కున్నారు. బెంగళూరులో ఓ లగ్జరీ హోటల్ లో ఓ రూమ్ ను అద్దెకి తీసుకున్న పూజా గాంధీ, బిల్లు కట్టకుండా పరారయ్యారు. దీంతో ఏం చెయ్యలేని హోటల్ యాజమాన్యం పోలీసులను ఆశ్రయించారు.

కన్నడ సినీ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం…
కొద్ది రోజుల క్రితం బెంగళూరులో ఓ హోటల్ లో లగ్జరీ రూమ్ ను అద్దెకు తీసుకున్న పూజా గాంధీ కొన్ని రోజుల పాటు అక్కడే ఉన్నారు. హోటల్ బిల్లు నాలుగున్నర లక్షలు అయ్యిందని తెలుసుకున్న పూజా… బిల్లు చెల్లించకుండానే పరారయ్యింది. విషయాన్ని ఆలస్యంగా గ్రహించిన యాజమాన్యం పోలీసులను సంప్రదించగా తమ ఎదుట హాజరవ్వాలని పూజకు పోలీసులు నోటీసులు జారీ చేసారు.

పోలీసుల ఎదుట హాజరైన పూజా హోటల్ బిల్లు రూ.2 లక్షలు చెల్లించినట్లు తెలిపింది. మిగిలిన మొత్తాన్ని చెల్లించేందుకు తనకు కొంత సమయం కావాలని హోటల్ యాజమాన్యాన్ని, పోలీసులను పూజ కోరింది. దీనికి హోటల్ యాజమాన్యం అంగీకరించడంతో వివాదం సద్దుమణిగింది.
ఇలాంటి వివాదాలు పూజకు కొత్తేమీ కాదు. 2011లో డబ్బుల విషయంలో ప్రముఖ నిర్మాత కిరణ్ తో పూజా యుద్ధానికి దిగారు. ఒకరిపై ఒకరు కేసులు కూడా పెట్టుకొన్నారు. అప్పట్లో కన్నడ ఇండస్ట్రీలో పెద్ద వివాదమయ్యింది. 2002లో వెండితెరకు పరిచయమైన పూజా గాంధీకి వివాదాలు కొత్తేమీ కాదంటున్నాయి కన్నడ సినీ వర్గాలు.

 

Comments

comments

Share this post

scroll to top