శిక్ష కాదు చికిత్స: భగ భగ మండే రాళ్లపై పడుకోపెడతారు..! ఎందుకో తెలుసా? లాభాలేంటో చూడండి!

ఆయుర్వేదం, అల్లోప‌తి, హోమియో, యునాని, ఆక్యుప్రెష‌ర్‌, ప్ర‌కృతి వైద్యం… ఇలా మ‌న‌కు తెలిసిన చాలా ర‌కాల వైద్య విధానాలు మ‌న‌కు అందుబాటులో ఉన్నాయి. చాలా మంది వీటిల్లో త‌మ‌కు ఇష్ట‌మైన‌, అనుకూలమైన విధానంలో వైద్యం చేయించుకుంటారు. అయితే ఇప్పుడు కొత్త‌గా హాట్ స్టోన్ థెర‌పీ అనే కొత్త వైద్య విధానం అందుబాటులోకి వ‌చ్చింది. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఈ థెర‌పీ ఇప్పుడు ఆ దేశంలో చాలా పాపుల‌ర్ అయింది. దీంతో ప‌లు అనారోగ్యాలు న‌య‌మ‌వుతాయట‌. ఇంత‌కీ ఈ థెర‌పీ అందుబాటులో ఉన్న దేశం ఏదంటే…

ఇంకేముందీ చైనాయే… అక్క‌డే ఇప్ప‌డీ హాట్ స్టోన్ థెరపీ పాపుల‌ర్ అయింది. అందుకు గాను చాలా వైద్య‌శాల‌లు వెలుస్తున్నాయి. త‌మ సెంట‌ర్‌కు రావాలంటే త‌మ వ‌ద్ద‌కు రావాల‌ని వారు ఆఫ‌ర్ల‌ను అందిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, యువ‌త‌కు చెందిన క్యూ లైన్లు ఇప్పుడ‌క్క‌డ బాగా క‌నిపిస్తున్నాయి. ఇంత‌కీ అస‌లు ఈ థెర‌పీలో ఏం చేస్తారంటే… భ‌గ భ‌గ మండే రాళ్ల‌పై ప‌డుకోబెడ‌తారు. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. భ‌గ భ‌గ మండే రాళ్లపై నిర్దిష్ట స‌మ‌యం పాటు రోగుల‌ను ప‌డుకోబెడ‌తారు.

వెల్ల‌కిలా, బోర్లా, ప‌క్క‌ల‌కు ఇలా మార్చి మార్చి రోగుల‌ను రాళ్ల‌పై ప‌డుకోబెడ‌తారు. అయితే భ‌గ భ‌గ మండే రాళ్లు అన్నాం క‌దా అని అవి మంటల్లో కాలిన‌వి అనుకునేరు, అవి మాత్రం కాదు. ఎండ నుంచి వెలువ‌డే ఉష్ణానికి వేడి అయిన రాళ్లు అవి. ఇప్పుడు చైనాలో ఎండ‌లు దంచికొడుతున్నాయి. ప‌గ‌టిపూట ఉష్ణోగ్ర‌త‌లు చాలా అధికంగా న‌మోద‌వుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ హాట్ స్టోన్ థెర‌పీ ఇప్పుడ‌క్క‌డ పాపుల‌ర్ అయింది. అయితే ఈ థెర‌పీ ద్వారా ప‌లు అనారోగ్యాలు న‌య‌మ‌వుతాయ‌ట‌. అలా అని అంత‌కు ముందు వైద్యం చేయించుకున్నవారు చెబుతున్నారు. సాధార‌ణంగా మ‌నం ఒంట్లో ఉండే తేమను రాళ్లలో ఉండే ఉష్ణం గ్ర‌హించి త‌ద్వారా రోగాన్ని న‌యం చేస్తుంద‌ట‌. దీన్ని చైనా వారు న‌మ్ముతున్నారు. అందుకే ఈ థెర‌పీ అక్క‌డ పాపుల‌ర్ అయింది..! ఏది ఏమైనా హాట్ స్టోన్ థెర‌పీ భ‌లే వింత‌గా ఉంది క‌దూ..!

Comments

comments

Share this post

scroll to top