పవన్ కళ్యాణ్ మాటలపై.. సోషల్ మీడియా గరంగరం.

ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు రావాల్సిందిగా నిన్న ఆంద్రప్రదేశ్ మంత్రులు పవన్ కళ్యాణ్ ను కలిసి స్వయంగా ఆహ్వనించిన విషయం తెలిసిందే.. ఈ సంధర్భంగా పవన్ మాట్లాడుతూ  కొత్త రాజధాని హైద్రాబాద్ లా ఉండకూడదు అని మంత్రులతో అన్నారు. ఇప్పుడు ఈ విషయంపై సోషల్ మీడియాలో పవన్ కు వ్యతిరేఖంగా కామెంట్స్ హల్ చల్ చేస్తున్నాయ్.

కొత్త రాజధాని హైద్రాబాద్ లా ఉండకూడదు అంటే దాని అర్థం ఏంటి?   హైద్రాబాద్ కు ఏమైంది?  అంతగా నచ్చని హైద్రాబాద్ లో నువ్వెందుకుంటున్నావ్.? ఆంద్రా, రాయలసీమ, తెలంగాణ అని తేడా లేకుండా అందరం హాయిగా కలిసి ఉన్న విశ్వనగరం హైద్రాబాద్..ఇప్పుడు నీ మాటలు మా మద్య చిచ్చులు పెట్టేలా ఉన్నాయ్ అంటూ సోషల్ మీడియాలో పవన్ కు వ్యతిరేఖంగా కామెంట్స్ స్ప్రెడ్ అవుతున్నాయ్.

అయితే కొంత మంది మాత్రం పవన్ ఉద్దేశ్యం ఇది కాదు.. అభివృద్ది  అంతా ఒక్క రాజధానిలోనే జరగొద్దు… అన్ని జిల్లాల్లో కూడా అభివృద్ది జరగాలి.. హైద్రాబాద్ విషయంలో గత పాలకులు ఇదే చేశారు. అభివృద్ది అంతా హైద్రాబాద్ లో జరిగాక రాష్ట్రాలుగా విడిపోయేటప్పుడు చాలా మంది బాధ పడ్డారని కొంత మంది వర్షన్.  ఇదంతా పక్కన పెడితే ..శంకు స్థాపనకు నేను రాలేకపోవొచ్చు అనే పవన్ మాటలపై కూడా కామెంట్స్ హాట్ గానే చేస్తున్నారు. అన్నయ్య బర్త్ డే వేడుకలు షూటింగ్ ను వాయిదా వేసుకొని వచ్చిన పవన్…… ఆంద్రప్రదేశ్ రాజధాని శంకుస్థాపనకు ఎందుకు రారు? అంటూ ఇప్పటినుండే ప్రశ్నలను లేవనెత్తుతున్నారు…యాంటీ పవన్ బ్యాచ్.!

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top