అంబులెన్సు లో డాక్టర్ అని చెప్పి..ఏసీ మెకానిక్ ని పంపారు..! తర్వాత ఏమైందో తెలుస్తే షాక్ అవుతారు.!

నేడు మ‌న దేశంలో ఏ రాష్ట్రంలో చూసుకున్నా ప్ర‌భుత్వ హాస్ప‌ట‌ల్స్‌లో ప్ర‌జ‌ల‌కు అందుతున్న సౌక‌ర్యాలు నానాటికీ మృగ్య‌మైపోతున్నాయి. పేద వాడి ఆరోగ్యం అంటే ఎవ‌రికీ శ్ర‌ద్ధ లేదు. ఏమ‌యిపోతే మాకేం అన్న ధోర‌ణిలో హాస్పిట‌ల్స్ సిబ్బంది నిర్లక్ష్యం వ‌హిస్తున్నారు. ఓ వైపు బాధితులు ప్రాణాపాయ స్థితిలో ఉంటే సిబ్బంది మాత్రం త‌మ‌కేమీ ప‌ట్ట‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తూ వారి జీవితాల‌తో ఆడుకుంటున్నారు. ప్ర‌భుత్వ హాస్పిట‌ల్స్‌లో నెల‌కొన్న నిర్ల‌క్ష్య ప‌రిస్థితులు పేద‌ల‌కు ద‌డ పుట్టిస్తున్నాయి. తాజాగా జ‌రిగిన ఓ సంఘ‌ట‌న ఇదే విష‌యాన్ని మ‌న‌కు గుర్తుకు తెస్తుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ బాలుడికి చికిత్స అందించేందుకు డాక్ట‌ర్‌కు బ‌దులుగా ఏసీ మెకానిక్‌ను హాస్పిట‌ల్ సిబ్బంది పంపారు. ఆ ఏసీ మెకానిక్‌ను డాక్ట‌ర్ అని న‌మ్మింప‌జేసే ప్ర‌య‌త్నం చేశారు. చివ‌ర‌కు బండారం బ‌య‌ట ప‌డ‌డంతో వారికి నోట్లో వెల‌క్కాయ ప‌డిన‌ట్ట‌యింది. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే…

ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‌క‌తా న‌గ‌రంలో నివాసం ఉండే రంజిత్ దాస్ కుమారుడు అర్జిత్ దాస్ (16) 10వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను రాస్తున్నాడు. ఎగ్జామ్స్ బిజీలో అత‌ను ఉన్నాడు. అయితే అనుకోకుండా అర్జిత్ దాస్ తీవ్ర అనారోగ్యం బారిన ప‌డ్డాడు. దీంతో అత‌న్ని తండ్రి రంజిత్ దాస్ కోల్‌క‌తాలో ఉన్న రామ్‌పుర్హ‌త్ స‌బ్ డివిజ‌న‌ల్ హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లాడు. అయితే ప‌రిస్థితి మ‌రీ చేయి దాటిపోతుండ‌డంతో అత‌న్ని ర‌వీంద్ర‌నాథ్ ఠాగూర్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఫ‌ర్ కార్డియాక్ సైన్సెస్ కు త‌ర‌లించ‌మ‌ని అక్క‌డి వైద్యులు చెప్ప‌డంతో అత‌ను స‌రే అని చెప్పి అదే హాస్పిట‌ల్ ఆంబులెన్స్ కోసం య‌త్నించాడు.

అయితే ఆంబులెన్స్‌లో ఉచితంగా తీసుకెళ్లాల్సిందిపోయి దాని డ్రైవ‌ర్ షేక్ స‌ర్ఫ‌రాజుద్దీన్ (25) రంజిత్ ను డ‌బ్బులు డిమాండ్ చేశాడు. దీంతో రంజిత్ రూ.8వేల‌ను అత‌నికి ఇచ్చాడు. అయితే స‌ర్ఫ‌రాజుద్దీన్‌తోపాటు ఆంబులెన్స్‌లో వెళ్లేందుకు తారా బాబు షా (26) అనే మ‌రో వ్య‌క్తి ఎక్కాడు. నిజానికి తారా బాబు ఓ ఏసీ మెకానిక్‌. హాస్పిట‌ల్ సిబ్బంది అత‌న్ని డాక్ట‌ర్ అని చెబుతూ ఆంబులెన్స్‌లో వెళ్లేందుకు పుర‌మాయించారు. ఈ విష‌యం రంజిత్‌కు తెలియదు. దీంతో అత‌ను తారా బాబును నిజంగా డాక్ట‌రే అనుకున్నాడు. వారు అడిన‌ట్టుగా మ‌రో రూ.8వేల‌ను రంజిత్ ఇచ్చాడు. అయితే ఆంబులెన్స్‌లో త‌న కుమారుడితోపాటుగా వెళ్లేందుకు స‌ర్ఫ‌రాజుద్దీన్‌, తారా బాబులు అంగీక‌రించ‌లేదు. దీంతో రంజిత్ మ‌రో వాహనం తీసుకుని ఆంబులెన్స్ వెనుకాలే వ‌చ్చాడు. అయితే తీరా ర‌వీంద్ర‌నాథ్ హాస్పిట‌ల్ కు చేరుకోగానే అర్జిత్ మృతి చెందాడు. ఇక డాక్ట‌ర్ అని చెప్ప‌బ‌డిన తారా బాబుకు బ‌దులుగా డ్రైవ‌ర్ స‌ర్ఫ‌రాజుద్దీన్ అర్జిత్‌కు ఆక్సిజ‌న్ పెట్ట‌డంతో అనుమానం వ‌చ్చిన రంజిత్ ఎంక్వ‌యిరీ చేయ‌గా అస‌లు విష‌యం బ‌య‌ట ప‌డింది. తారా బాబు ఓ ఏసీ మెకానిక్ అని తెలిసింది. దీంతో రంజిత్ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా పోలీసులు స‌ర్ఫ‌రాజుద్దీన్‌, తారా బాబుల‌పై కేసు నమోదు చేసుకుని వారిని అరెస్టు చేశారు. చూశారుగా.. హాస్పిట‌ల్ నిర్ల‌క్ష్యం వ‌ల్ల ఓ నిండు ప్రాణం ఎలా బ‌లైందో. ఇలా ఎవ‌రికీ జ‌ర‌గ‌కూడ‌ద‌ని కోరుకుందాం.

Comments

comments

Share this post

scroll to top