రాజుల గుర్రాలను బట్టి వారెలా చనిపోయారో చెప్పొచ్చు.!? అదెలాగో తెలుసా?

మనం రాజులకు సంబంధించిన చాలా విగ్రహాలను చూస్తూనే ఉంటాం…గుర్రాల మీద యుద్దానికి సంబంధించిన స్టైల్లో రాజులు దర్శనమిస్తుంటారు. ఓ చేతిలో కత్తి, మరో చేతిలో డాలు…పట్టుకొని కదనరంగంలో పోరాడుతున్న సింహాల్లా కనిపిస్తుంటారు. అయితే ఈ సారి రాజుల విగ్రహాలు చూసేటప్పుడు వారి గుర్రాలను జాగ్రత్తగా పరిశీలించండి…ఆశ్చర్యకరమైన, ఆసక్తిదాయకమైన విషయాలు తెలుస్తాయ్…అదేంటంటే..గుర్రాలను బట్టి సదరు రాజు ఎలా చనిపోయారో తెలుసుకోవొచ్చు. దానికి సంబంధించిన సింపుల్ కోడ్ ఏంటంటే….

  • రాజు గారి గుర్రం రెండు కాళ్లు గాల్లోకి లేపి ఉంటే…సదరు రాజు ఓ యుద్దంలో పోరాడూ అక్కడే వీరమరణం పొందాడని దానర్థం.

statues-2

  • రాజు గారి గుర్రం ఓ కాలు మాత్రమే గాల్లోకి లేపి ఉంటే…సదరు రాజు ఓ యుద్దంలో గాయపడి, ఆ గాయాల కారణంగా కొన్ని రోజుల తర్వాత చనిపోయాడని అర్థం.

Rudramadevi

  • రాజు గారి గుర్రం రెండు కాళ్లు భూమి మీదే ఉంటే..సదరు రాజుది సహజమరణం అని చెప్పొచ్చు.

sedgwick

ఉదాహరణకు రుద్రమదేవి విగ్రహాలను పరిశీలించండి..ఆమె గుర్రం ఓ కాలు మాత్రమే పైకి లేపి ఉంటుంది. అంటే..ఆమె ఓ యుద్దంలో గాయపడి..ఆ గాయాల కారణంగా మరణించిందని అర్థం. వాస్తవం కూడా అదే…రుద్రమదేవి అంబదేవునితో చేసిన యుద్దంలో తీవ్రంగా గాయపడి..తదనంతరం మరణించారు.

 

shivaji-maharaj

ఇలా విగ్రహాంలో గుర్రం కాళ్ల పొజీషన్ ను బట్టి…. సదరు రాజు ఎలా చనిపోయాడో చెప్పొచ్చు.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top