లిఫ్ట్ లో ఒంటరిగా మహిళ… వెంటనే వెనుక వెళ్లిన యువకుడు… ఆ తర్వాత.??

షాపింగ్ కు ఒంటరిగా వెళ్తున్నారా… అయితే మాల్ లో లిఫ్ట్ లో వెళ్లడం కన్నా మెట్లు మీద నుంచే వెళ్లడం మంచిది. ఒంటరిగా ఉన్న మహిళలే వారి టార్గెట్… అమాయకంగా వచ్చి లిఫ్ట్ లో పక్కన నిలబడతారు… డోరు మూసుకున్నాకా… అతి కిరాతకంగా గాయపరిచి బ్యాగ్ ఎత్తుకుపోతారు… ఏంటి చెప్తున్నామనుకుంటున్నారా..అవును ఇధి సత్యం… మలేషియా లిఫ్ట్ లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయ్యింది.
మలేషియా కౌలాలంపూర్ లో ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం రోజు షాపింగ్ కు వెళ్లిన 48 ఏళ్ల ఓ మహిళపై ఒక దొంగ అతికిరాతకంగా దాడి చేసాడు. చెరస్ జిల్లాలోని షాపింగ్ మాల్ కు ఓ మహిళ వెళ్లింది. షాపింగ్ అనంతరం కిందకు వెళ్లేందుకు ఒంటరిగా లిఫ్ట్ ఎక్కింది. ఇది గమనించిన దొంగ ఆమె వెనకాలే వచ్చి తాను కూడా లిఫ్ట్ ఎక్కాడు. డోర్లు మూసుకోగానే వాడి ప్రతాపాన్ని చూపించాడు. మహిళ అని కూడా చూడకుండా అత్యంత క్రూరంగా దాడి చేసాడు. పిడి గుద్దులు గుద్దుతూ… కాళ్లతో కడుపులో తన్నుతూ దాడి చేసాడు. బ్యాగ్ లాగేందుకు ప్రయత్నిస్తున్న దొంగను ప్రతిఘటించేందుకు ఎంతో తీవ్రంగా ప్రయత్నించింది.

మధ్యలో ఒక సారి లిఫ్ట్ డోర్ తెరుచుకున్న సమయంలో ఏం తెలియనట్టు నించున్నాడు. కాళ్లతో మహిళను పక్కకు నెట్టి డోరు మూసుకోగానే, మరో సారి దాడికి తెగబడ్డాడు. తర్వాత ఆమె చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకుని పరారయ్యాడు. ఈ వ్యవహారం మొత్తం లిఫ్ట్ లోని సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.
ఈ ఘటన వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చెయ్యగానే గంటల వ్యవధిలోనే లక్షల్లో వ్యూస్ వచ్చాయి. ఈ ఘటనపై కౌలాలంపూర్ పోలీసులు కూడా సీరియస్ గానే ఉన్నారు. లిఫ్ట్ లో మహిళపై దాడి చేసిన వ్యక్తిని పట్టించి ఇచ్చిన వారికి బహుమతి కూడా ఎనౌన్స్ చేసారు. అతడిని పట్టించిన వారికీ లేదా ఆచూకీ తెలిపిన వారికి పది వేల మలేషియన్ రిగ్గిట్స్ ఇండియన్ కరెన్సీలో లక్షా డెబ్బై ఐదు వేల రూపాయలు బహుమతిగా ఇస్తామంటూ ప్రకటన విడుదల చేసారు. లిఫ్ట్ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ మహిళను మాల్ సిబ్బంది దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ మహిళ బ్యాగ్ లో ఐడీ కార్డ్, ఏటీఎం కార్డ్ తో పాటు నాలుగు వందల రిగ్గిట్స్ కూడా ఉన్నట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇటు పోలీసులతో పాటు… అక్కడి వారు కూడా దొంగను పట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దొంగను పట్టించి ఇస్తే పదివేల రిగ్గిట్స్ వస్తాయని ఆశగా ఎదురు చూస్తున్నారు. సమాజంలో స్త్రీలపై దాడులు ఏ విధంగా జరుగుతున్నాయో చూసారుగా… అఖరికి షాపింగ్ మాల్స్ లో కూడా రక్షణ లేకుండా పోయింది.

Comments

comments

Share this post

scroll to top