ఫూల్ = పువ్వులు; పుల్ = వంతెన‌…. ఈ చిన్న తేడాకు 23 నిండు ప్రాణాలు బ‌లి!

23 మంది మ‌ర‌ణానికి 39 మంది తీవ్ర‌గాయాల‌కు కార‌ణ‌మైన ముంబై ఎల్ఫిన్‌స్టోన్ పాదాచారుల వంతెన దుర్ఘ‌ట‌న ద‌ర్యాప్తు వేగ‌వంతంగా సాగుతుంది. ఈ క్ర‌మంలో ఓ ప్ర‌త్య‌క్ష‌సాక్షి క‌థ‌నం….నివ్వెరపోయేలా చేస్తుంది. ఫూల్ ను పుల్ గా విని, తొంద‌ర‌ప‌డ్డందుకే ఈ దుర్ఘ‌ట‌న జ‌రిగింద‌ని తెలుస్తుంది.!! ఆ ఘ‌ట‌న స‌మ‌యంలో ఎల్ఫిన్‌స్టోన్ పాదచారుల వంతెన పై ఉన్న శిల్పా విశ్వాస్ తన అనుభవాన్ని పోలీసులకు తెలిపింది. వంతెన మీద న‌డుస్తున్న ఓ పూల వ్యాపారి ‘ఫూల్ గిర్ గయా’ (పూలు పడిపోయాయి) అని అరిచాడ‌ట‌…దాన్ని విన్న జ‌నం ‘పుల్ గిర్ గయా’ (బ్రిడ్జి కూలింది) అని భావించడంతో…ప‌రుగులు స్టార్ట్ చేశారు. ఈక్ర‌మంలో తొక్కిస‌లాట జ‌రిగింది. దీని కార‌ణంగా 23 మంది ప్రాణాలు కోల్పోవాల్సి వ‌చ్చింద‌ని చెప్పిందామె…ఈ ఘ‌ట‌న‌లో ఆమెకు కూడా స్వ‌ల్ప గాయాల‌య్యాయి.!

ఫూల్ = పువ్వులు పుల్ = వంతెన‌…. ఈ చిన్న తేడాకు 23 నిండు ప్రాణాలు బ‌లి!

Watch Video:

Comments

comments

Share this post

scroll to top