కుక్క క‌రిచిందా..? ఈ స‌హ‌జ సిద్ధ‌మైన ప‌దార్థాల‌తో ఆ గాయాన్ని మాన్పించ‌వచ్చు..!

కుక్క కాటు ఎంత‌టి ప్రాణాంత‌క‌మో అంద‌రికీ తెలిసిందే. పెంచుకునే కుక్క కరిస్తే రిస్క్ త‌క్కువ‌గా ఉంటుంది, కానీ అదే ఊర కుక్క, పిచ్చి కుక్క క‌రిస్తే ఒక్కోసారి ప్రాణాల‌కే ప్ర‌మాదం ఏర్ప‌డుతుంది. రేబిస్ అనే ప్ర‌మాద‌క‌ర‌మైన వ్యాధి కూడా వ‌స్తుంది. దీంతోపాటు అది క‌రిచిన చోట ఇన్‌ఫెక్ష‌న్లు కూడా వ‌స్తాయి. అయితే అనుకోని ప‌రిస్థితుల్లో కుక్క క‌రిస్తే అప్పుడు ఇంట్లో ఉండే స‌హ‌జ సిద్ధ‌మైన ప‌దార్థాల‌తో చికిత్స ఎలా చేసుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం. దీని వ‌ల్ల ప్రాణాపాయ స్థితి రాకుండా చూసుకోవ‌చ్చు. అందుకోసం ఏం చేయాలంటే…

వేప ఆకులు…
వేప ఆకుల్లో యాంటీ సెప్టిక్, యాంటీ బ‌యోటిక్ గుణాలు పుష్క‌లంగా ఉన్నాయి. ఇవి కుక్క క‌రిచిన గాయాన్ని త్వ‌ర‌గా మానేలా చేస్తాయి. కొన్ని వేప ఆకుల‌ను న‌లిపి డైరెక్ట్‌గా అలాగే గాయంపై పెట్టి క‌ట్టు క‌ట్టాలి. లేదంటే ఆ మిశ్ర‌మంలో కొద్దిగా క‌ల‌బంద గుజ్జును క‌లిపి కూడా గాయానికి అప్లై చేయ‌వ‌చ్చు. దీంతో గాయం త్వ‌ర‌గా మానుతుంది.

వెల్లుల్లి…
స‌హజ సిద్ధ‌మైన యాంటీ బ‌యోటిక్‌, యాంటీ వైర‌ల్‌, యాంటీ ఫంగ‌ల్ గుణాలు వెల్లుల్లిలో ఉన్నాయి. ఇవి కుక్క చేసిన గాయాన్ని త్వ‌ర‌గా మానేలా చేస్తాయి. కొన్ని వెల్లుల్లి రెబ్బ‌ల్ని న‌లిపి అందులో క‌ల‌బంద గుజ్జు లేదా కొబ్బ‌రి నూనె క‌లిపి గాయంపై వేసి క‌ట్టు క‌ట్టాలి. ఇలా చేసినా గాయం త్వ‌ర‌గా మానుతుంది.

జీల‌క‌ర్ర‌…
జీల‌క‌ర్ర‌ను పొడిగా చేసి అందులో కొంత నీరు క‌లిపి పేస్ట్‌లా చేయాలి. ఈ పేస్ట్‌ను గాయంపై రాసి క‌ట్టు క‌ట్టాలి. దీంతో గాయం మానుతుంది. జీల‌క‌ర్ర‌లోనూ యాంటీ బ‌యోటిక్ గుణాలు ఉన్నాయి. అవి గాయం మానేలా చేస్తాయి. ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా చూస్తాయి.

ఇంగువ‌…
మ‌నం కూర‌ల్లో వేసుకునే ఇంగువ కూడా కుక్క చేసిన గాయాన్ని మాన్చ‌గ‌ల‌దు. అందుకు ఏం చేయాలంటే కొద్దిగా ఇంగువ పొడిని తీసుకుని గాయంపై చ‌ల్లాలి. అనంత‌రం క‌ట్టు క‌ట్టాలి. దీంతో గాయం మానుతుంది.

క‌ల‌బంద‌…
క‌ల‌బంద గుజ్జు కూడా కుక్క చేసిన గాయాన్ని న‌యం చేయ‌గ‌ల‌దు. ఇందులోనూ స‌హ‌జ సిద్ధ‌మైన యాంటీ బ‌యోటిక్‌, యాంటీ ఫంగ‌ల్ గుణాలు ఉన్నాయి. ఇవి గాయాన్ని మాన్చ‌గ‌ల‌వు. కొద్దిగా క‌ల‌బంద గుజ్జుతో క‌ట్టు క‌డితే గాయం త్వ‌ర‌గా మానుతుంది.

ప‌సుపు…
ఇత‌ర గాయాలే కాదు, కుక్క చేసిన గాయాన్ని కూడా ప‌సుపు మాన్చ‌గ‌ల‌దు. కొంత ప‌సుపు తీసుకుని నేరుగా గాయంపై చ‌ల్లి క‌ట్టు క‌ట్టాలి. దీంతో గాయం త్వ‌ర‌గా మానుతుంది. ప‌వ‌ర్‌ఫుల్ యాంటీ బాక్టీరియ‌ల్ గుణాలు ప‌సుపులో ఉన్నాయి. అందుకే గాయం త్వ‌ర‌గా మానుతుంది.

Comments

comments

Share this post

scroll to top