రక్తంతో మోడీకి రాసిన లేఖ.!!!

ఇది విరహతాపాన్ని తట్టుకోలేక ప్రేమికుడు ప్రియురాలికి రాసిన రక్తపు లేఖ కాదు…  తమ బాధను అర్థం చేసుకోండి మహాప్రభో అంటూ సాక్షాత్తు దేశ ప్రధానమంత్రికి హోమ్ గార్డ్ లు రక్తంలో రాసిన లెటర్. ఒక్కటి కాదు రెండు కాదు వందకు పైగా రక్తంతో మోడీకి బహిరంగ లేఖ రాశారు ఆ హోమ్ గార్డ్ లు..

అంతగా రక్తాన్ని సిరాగా చేసి వీరు రాసిన  లెటర్ లో ఎముంది అంటే…. గౌరవనీయులైన ప్రధాన మంత్రిగారు.. మేమూ పోలీసులకు సమానంగా పని చేస్తాం కాబట్టి మాకు కూడా వాళ్ళతో  సమానంగా గౌరవాన్ని, హోదాను కల్పించండి. ఇదొక్కటే మా వినతి అంటూ  రాజస్థాన్‌లో హోంగార్డుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన  ఓ బహిరంగకు హాజరైన  హోంగార్డులందరూ ప్రధానికి  ఇలా రక్తంతో ఉత్తరం  రాశారు. రక్తంతో లేఖ రాసిన హోంగార్డుల బాధను ప్రధాని అర్థం చేసుకుని సమస్యను పరిష్కరించాలని ఆశిద్దాం.

letter-of-blood_55f14e49624c1

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top