బాహుబలి విడుదల రోజు సెలవు ప్రకటించాలని డిమాండ్!

సాధారణంగా సినిమాల ప్రభావం జనాల మీద ఎక్కువగా ఉంటుందనేది అందరికీ తెలిసిందే కానీ, జక్కన్న చెక్కిన బాహుబలి ఎఫెక్ట్ మాత్రం అంతా ఇంత లేదు సీనీ ప్రేక్షకులపై…. అదేదో మంత్రం వేసినట్టు.

టిక్కెట్లు దొరక్క ఒకరు, టికెట్లు దొరికి కూడా సినిమాకు ఎలా వెళ్లాలని ఇంకొందరు, బాస్ సెలవిస్తాడా లేదా అని మరికొందరు ఇలా ఎవరి టెంక్షన్ వారిది…. ఇంత వరకు బాగానే ఉంది కానీ బాహుబలి అభిమానులు ఇప్పుడు కొత్త డిమాండ్ కు తెర తీసారు.

తెలుగు రాష్ట్రాలు బాహుబలి విడుదల రోజు ఆప్షనల్ హాలిడే ప్రకటించాలనే  ప్రతిపాదనను తెస్తున్నారు బాహుబలి అభిమానులు. ఎందుకంటే మన దేశంలోనే మొదటి మోషన్ పిక్చర్ బాహుబలి కావడం, దేశం మొత్తం బాహుబలి రిలీజ్ కోసం చూస్తుంటే, అంతా మన తెలుగు వాళ్ళు నటించిన సినిమా విడుదలవుతుంటే ఆ మాత్రం అయినా వీలు కల్పిస్తే బాగుంటుందనేది వారి అభిప్రాయం.

jAI MAYUSHANMTI

 

ఇప్పటికే నెటీజన్లు దీనిపై పోస్ట్  పబ్లిషింగ్ ను స్టార్ట్ చేసేశారు…. బాహుబలి అభిమానులు ఈ ప్రతిపాదనకు గట్టిగా మద్దత్తునిస్తున్నారు..  న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా ల మధ్య వరల్డ్ కప్ మ్యాచ్ జరుగుతుంటుంటే.. గెలుపు కు మన దేశ ప్రజల మద్దతు అవసరం కాబట్టి సెలవు ప్రకటించండి అని న్యూజిలాండ్ కెప్టెన్ అనగానే అక్కడి ప్రభుత్వం సెలవు ప్రకటించింది. సో ఇప్పుడు కూడా దేశం గర్వించే సినిమా విడుదలకు ఒక్క రోజు సెలవు ప్రకటించాలని బాహుబలిని క్రికెట్ లోని ఆ సన్నివేశంతో పోల్చుతున్నారు అభిమానులు.

ఈ ప్రతిపాదన కొంత హాస్యాస్పదమైనప్పటికీ ఫ్యాన్స్ లోని ఇంటెక్షన్ కు అద్దం పడుతోంది. సెలవు ప్రకటన పక్కనపెడితే…. దేశం గర్వించదగ్గ , చరిత్ర లో శాశ్వతంగా నిలిచే సినిమా బాహుబలి కావాలని ఆకాంక్షిద్దాం… అంతర్జాతీయ వేదిక పై తెలుగు సినిమా పవర్ ను చూపించాలని బాహుబలికి ఆల్ ది బెస్ట్ చెబుదాం.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top