అడాల్ఫ్ హిట్లర్ కట్టించిన ఆ పురాతన భవనాలు ఇప్పుడు లగ్జరీ హోటల్స్‌గా మారనున్నాయి..!

అడాల్ఫ్ హిట్లర్. బహుశా ఈ పేరు వినని వారు ఉండరేమో. హిట్లర్ గురించి, అతని జీవిత చరిత్ర గురించి దాదాపు చదువుకున్న ప్రతి ఒక్కరికీ తెలుసు. మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓటమి పాలవ్వడాన్ని జీర్ణించుకోలేని హిట్లర్ ఆ దేశానికి నియంతగా మారి శత్రు దేశాలను గడ గడలాడించాడు. తన నియంత పాలనతో ప్రజల చేత ఛీ.. కొట్టించుకున్నాడు. అయితే ఇదంతా పక్కన పెడితే హిట్లర్ తన పాలనలో కట్టించిన ఓ అతి పెద్ద భవంతి మాత్రం ఇప్పుడు రూపురేఖలు మారిపోయి పర్యాటకులకు వినోద కేంద్రంగా మారనుంది.

hitler-building-2

అది 1939వ సంవత్సరం. రెండో ప్రపంచ యుద్ధపు రోజులవి. ఆ సమయంలో జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్ స్థానికంగా ఉన్న ఓ నగరంలో బీచ్ వద్ద జర్మన్ నాజీల కోసం ఏకంగా 3 మైళ్ల (దాదాపు 4.8 కిలోమీటర్లు) పొడవున ఎన్నో భవంతులను ఒకే వరుసలో కట్టించాడు. అవన్నీ చూసేందుకే ఒకే భవంతిలా కనిపిస్తాయి. అయితే 2వ ప్రపంచ యుద్ధం ముగిశాక ఆ భవంతులను మూసి వేశారు. అప్పటి నుంచి నేటి వరకు దాదాపు 75 ఏళ్ల పాటు అవి అలాగే మూతపడి ఉన్నాయి. వాటిని ఎవరూ తెరవలేదు.

కాగా హిట్లర్ కట్టించిన ఆ భవంతులను జర్మనీకి చెందిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థ కొనుగోలు చేసింది. దీంతో ఆ సంస్థ ఇప్పుడు ఆ భవంతులను విలాసవంతమైన హోటల్స్, నివాసాలుగా మార్చనుంది. అతి త్వరలోనే వాటి నిర్మాణాలను ప్రారంభించనున్నట్టు తెలిసింది. నిర్మాణాలు పూర్తయితే అక్కడికి అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తారని ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ అధికారులు భావిస్తున్నారు. ఇంకేం మరి, త్వరలోనే హిట్లర్ తిరిగిన నివాసాలను చూడవచ్చన్నమాట. ఆసక్తి ఉంటే మీరూ అక్కడికి వెళ్లి చూడండి!

hitler-building

Comments

comments

Share this post

scroll to top