మ‌ద్యం సేవించ‌డానికి ముందు చీర్స్ ఎందుకు కొడ‌తారు..? దాని వెనుక ఉన్న క‌థ ఏమిటి..?

మ‌ద్యం సేవించే వారెవ‌రైనా దాన్ని ఎలా తాగుతారు..? ఎలా తాగ‌డమేంటి? ఎవ‌రి ఇష్టాల‌కు అనుగుణంగా వారు తాగుతారు. ఒక్కొక్క‌రు ఒక్కో ర‌కం మ‌ద్యాన్ని ఇష్ట‌ప‌డ‌తారు. అందుకు అనుగుణంగానే త‌మ కెపాసిటీని బ‌ట్టి మ‌ద్యం సేవిస్తారు. ఇంత‌కీ ఇదంతా ఎందుకు చెబుతున్నార‌నే క‌దూ మీ ప్ర‌శ్న‌? ఏం లేదండీ, మందు ఎవ‌రు తాగినా, ఎక్క‌డ తాగినా, ఎప్పుడు తాగినా ప్ర‌తి ఒక్క‌రు విధిగా ఓ నియ‌మాన్ని పాటిస్తారు. నియ‌మ‌మంటే అదేదో క్ర‌మ‌శిక్ష‌ణ ప‌ర‌మైన చ‌ర్య కాదులెండి. అదొక విధానం, ప‌ద్ధ‌తి. అంతే. ఇంత‌కీ ఏంటా ప‌ద్ధ‌తి అనుకుంటున్నారా? అదేనండీ మందు తాగేముందు అంద‌రూ చెప్పుకుంటారే, అదే… చీర్స్‌. అస‌లు ఇలా చీర్స్ కొట్ట‌డ‌మ‌నే విధానం ఎలా అమ‌లులోకి వ‌చ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌ధ్య యుగంలో స‌ముద్ర‌పు దొంగ‌లు తాము దోచుకున్న సొమ్మును పంచుకోవ‌డానికి, త‌మ విజ‌యాల‌ను సెల‌బ్రేట్ చేసుకోవ‌డానికి మార్గ మ‌ధ్య‌లో ఏదైనా దీవిలో ఆగేవార‌ట‌. అలా వారు సంబ‌రాలు చేసుకునే స‌మ‌యంలో ఒకరి సొమ్మును మ‌రొక‌రు దోచుకునేందుకు ఇత‌రులు తాగే మ‌ద్యంలో విషం క‌లిపేవార‌ట‌. దీన్ని ప‌సిగ‌ట్టిన కొంద‌రు దొంగ‌లు ఇకపై ఎప్పుడు మ‌ద్యం సేవించినా అంత‌కు ముందే త‌మ త‌మ గ్లాసుల‌ను చీర్స్ కొట్టుకుని సంబ‌రాల‌ను ప్రారంభించేవార‌ట‌. ఇలా చేయ‌డం వ‌ల్ల ఒక‌రి గ్లాసులోని మ‌ద్యం మ‌రొక‌రి గ్లాసులో ప‌డుతుంద‌ని, దీంతో అంద‌రూ సంతోషంగా, ఎలాంటి భ‌యం లేకుండా మ‌ద్యం సేవించవ‌చ్చ‌ని, ఎంజాయ్ చేయ‌వ‌చ్చ‌ని వారి ఉద్దేశం. అలా కాల‌క్ర‌మేణా వారి చీర్స్ అంత‌టా వ్యాపించింది.

cheers

మ‌న‌కు తెలుస్తున్న విష‌యాల ప్ర‌కారం చీర్స్ కొట్ట‌డం వెనుక ఇంకో అర్థం కూడా ఉంద‌ని చెబుతారు. అదేమిటంటే గ్లాసుల‌తో చీర్స్ కొడితే ఆ శబ్దానికి దుష్ట శ‌క్తులు పారిపోతాయ‌ని న‌మ్ముతారు.

ఇంకో క‌థ కూడా చీర్స్ విష‌యంలో ప్ర‌చారంలో ఉంది. మ‌న‌కు ఉన్న పంచేద్రియాలైన క‌ళ్లు, ముక్కు, నాలుక‌, చ‌ర్మం, చెవులలో మొద‌టి నాలుగింటి ద్వారా మ‌ద్యం సేవించ‌డాన్ని అనుభూతి చెందుతాం. కానీ చెవుల‌కు మాత్రం ఎలాంటి అనుభూతి క‌ల‌గ‌దు. ఈ క్ర‌మంలో చెవులు కూడా మ‌ద్యం అనుభూతిని పొందాల‌నే వాటికి విన‌ప‌డే విధంగా గ్లాసులు కొడుతూ చీర్స్ చెబుతారట‌.

చీర్స్ ఎలా ప్రారంభ‌మైంద‌నే క‌థ ఎలా ఉన్నా మ‌ద్య‌పానం మాత్రం ఆరోగ్యానికి హానిక‌ర‌మే. ఇది చ‌దివాక కేవ‌లం చీర్స్ కోస‌మే అయితే మాత్రం మ‌ద్యం సేవించ‌కండేం!

Comments

comments

Share this post

scroll to top