“బాహుబలి” సినిమాలోనే కాదు…నిజంగా కూడా “మాహిష్మతి” నగరముంది..! ఎక్కడో తెలుసా..?

“మాహిష్మతి….ఊపిరి పీల్చుకో…నా కొదుకొచ్చాడు…
బాహుబలి తిరిగొచ్చాడు…”  – దేవసేన

“కట్టప్పా…వీరి రక్తంతో మాహిష్మతికి పట్టిన మకిలి కడిగెయ్యి” – రమ్యకృష్ణ

“అమరేంద్ర బాహుబలి అనే నేను మాహిష్మతి ప్రజల ధన, ప్రాణ, మాన సంరక్షకుడిగా ప్రాణత్యాగానికైనా వెనకాడబోమని రాజమాత శివగామి దేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నా” – ప్రభాస్

“జై మాహిష్మతి…!”

ఇది బాహుబలిలో ట్రేండింగ్ డైలాగ్స్. బాహుబలి సినిమా ద్వారానే మనకు “మాహిష్మతి” సామ్రాజ్యం పరిచయం అయ్యింది. కానీ బాహుబలి సినిమాలోనే కాదు నిజంగా కూడా “మాహిష్మతి” అనే నగరం ఉంది. అది ఎక్కడో కాదు మన దేశంలోనే ఉంది. ఏ రాష్ట్రంలో ఉందొ తెలుసా..?

భారత దేశం మధ్యలో ఉన్న “మధ్యప్రదేశ్” రాష్ట్రంలోని “నర్మదా నది” ఒడ్డున “మాహిష్మతి” నగరం ఉంది. పదమూడవ శతాబ్దం నుండి “మాహిష్మతి” అని పిలుస్తున్నారు ఆ నగరాన్ని. మొదట్లో “అవంతి రాజ్యం” లో ఉండేది “మాహిష్మతి. తరవాత “అనుపమ రాజ్య” రాజధానిగా మారింది. ఉజాయినికి దక్షిణాన. ప్రతిష్ఠానకి ఉత్తరాన ఈ నగరం ఉంది.

అక్కడ అందరు పరమేశ్వరుని భక్తులు. అక్కడ ఉన్న శివలింగ ఆలయానికి ఎంతో ప్రసిద్ధి ఉందట. సహస్రార్జున దేవాలయంలో అలనాటి నుండి నేటి వరకు “పదకొండు” దీపాలు నిత్యం వెలుగుతూనే ఉన్నాయి. రావణాసురుడు ఈ రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నించాడని ఓ కథ ఉంది. అలాగే మహాభారత సమయంలో కురుక్షేత్రం యుద్ధం జరిగిన “ధర్మరాజు” ఈ రాజ్యాన్ని పాలించాడని మరొక కథ కూడా ఉంది. సహదేవుడు ఈ రాజ్యానికి రాజుగా వ్యవహరించాడట.

ఈ మాహిష్మతి నగరంలో చీరలు అందంగా నేస్తారట. శీతాకాలంలో జరిగే “గంగాధర” ఉత్సవాలకు ఎంతోమంది వస్తుంటారట. రాజభవనాలు, దేవాలయాలతో ఈ రాజ్యానికి ఎంతో ప్రసిద్ధి ఉంది. గణేశుని, నవ రాత్రి ఉత్సవాలకు కూడా ఈ నగరం పెట్టింది పేరు అంట.

బాహుబలిలో మాహిష్మతిని చూసేసాము. ఈ నిజమైన మాహిష్మతి గురించి కూడా అందరికి షేర్ చేయండి!

 

Comments

comments

Share this post

scroll to top