ఫ్రెండ్ షిప్ డే ఎలా వచ్చిందో తెలుసా…?

ఆగస్ట్ మొదటి ఆదివారం వచ్చిందంటే చాలు నైట్ 12 నుండే  సెల్ ఫోన్  ఇన్ బాక్స్…లో హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే అనే మెసేజ్ ల వరద వస్తూనూ ఉంటుంది. ఇక వాట్సాప్ లో అయితే ఓ పిక్..దాని కింద స్నేహానికి సంబంధించిన రెండు లైన్ల కామెంటరీ.. ఇక ఫేస్ బుక్ ఓపెన్ చేస్తే….ఇక్కడ పిక్ కాకపోతే సెల్ఫ్ కామెంటరీ..ఇలా ఈ రోజు మొత్తం Happy FriendShip Day అంటూ స్తోత్రం చదివేస్తాం.

గ్రీటింగ్ కార్డులు, బ్రాస్ లేట్ లు , ఫ్రెండ్ షిప్ బాండ్ ..ఇక మన స్నేహం మరింత బలంగా ఉండాలని కోరుతూ ఆత్మీయమైన ఆలింగనాలు.. కలిసి కాఫీ తాగడాలు, లంచ్ కు బయటికి వెళ్లడాలు ఎవరి ప్లాన్స్ వాళ్లకు ఉంటాయ్ లేండి.  అయితే అసలు ఫ్రెండ్ షిప్ డే ఎందుకు వచ్చిందో తెలుసా….?

friends-fingers

అమెరికా ప్రభుత్వము 1935 ఆగస్టు మొదటి శనివారము ఓ వ్యక్తిని చంపింది . అతని మరణ వార్త విని ఆమరుసటి రోజు అతని స్నేహితుడు ఆత్మహత్య చేసుకున్నాడు . ఈ సంఘటనకు స్పందించిన అమెరికా ప్రభుత్వము వీరి స్నేహానికి గుర్తుగా అప్పటి నుంచీ ఏటా ఆగస్టు మొదటి ఆదివారాన్ని స్నేహితుల దినోత్సవము గా ప్రకటించినట్లు చరిత్ర చెబుతోంది.

స్నేహం అంటే..వన్ బై టూ చాయ్ లే కాదు. సగం సగం తాగే కింగ్ సైజ్ సిగరేట్ కాదు. అదో అనిర్వచనీయ బంధం. హృదయానికి సంబంధించిన ఫీలింగ్.. చచ్చే వరకు , చావు తర్వాత కూడా నీ వెంట ఉండే ఓ బలమైన బంధం స్నేహం.

Happy FriendShip Day:

Click: స్నేహ పరిమళాన్ని గుభాలించే పాటలు..

CLICK: స్నేహం గురించి రజనీకాంత్ చెప్పిన మాటలు!

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top