ప్రపంచంలోనే వింతైన సంతకం….ఈ సంతకం కొట్లాట కోర్టుకెక్కింది.!

మనం మన సంతకాన్ని సింపుల్ గా ఉండేలా చూసుకుంటాం కదా.మనకు నచ్చిన విధంగా మన పేరు వచ్చేలా రాసుకుంటాం. కానీ ఆస్ట్రేలియాకు చెందిన జేర్డ్ హ్యామ్స్ సంతకాన్ని చూస్తే షాక్ అవుతారు. ఇలా కూడా సిగ్నేచర్ చేయవచ్చా అనే అనుమానం మనకు కలుగుతుంది. ఒకసారి తన పర్మినెంట్ అడ్రస్ ను నింపడానికి అప్లికేషన్ ను ఫిల్ చేసి చివర్లో సిగ్నేచర్ చేయమన్న చోటు  పురుషాంగం మరియు మాటలతో ఇలా చెప్పలేని విధంగా సంతకాన్ని చేశాడు. ఏదో సరదా కోసం ఇలా చేశాడో లేక తప్పుగా రాశాడేమోనని అధికారులు ఫోన్ చేయగా తన సంతకం అంతేనని బదులిచ్చాడు. ఇంకా ఇలా తన ఐడీ కార్డ్, బ్యాంక్ ఏటీఎం, డ్రైవింగ్ లైసెన్స్..ఇలా తనకు సంబంధించిన ప్రతి కార్డుపైనా ఇలానే సంతకం చేశాడు. ఈ సంతకంపై కొందరు అభ్యంతరం తెలుపుతూ కోర్టులో ఫిటీషన్ వేయగా రెండుసార్లు కోర్టుకు హాజరయ్యాడు. తన సంతకం తన ఇష్టమని కోర్టులో గత ఐదేళ్లుగా యుద్ధం చేస్తున్నాడు. అతను ప్రస్తుతం న్యాయశాస్త్రంలో డిగ్రీ చేస్తున్నాడు. త్వరలోనే తను చదివే ఈ చదువు పూర్తయి లాయర్ గా కూడా చేరతాడో లేదో తెలీదు కానీ ఇలా సంతకం కోసం కోర్టులో యుద్ధం చేస్తూ రివర్స్ కేసు పెట్టి, ఇలా ఎందుకు చేయకూడదని వారిస్తున్నాడు.
jared2
jared3
jared4

Comments

comments

Share this post

scroll to top