టీచర్ అనే పదానికి అసలైన నిర్వచనం సుబీర్ సార్.! తండ్రిగా సార్ పేరును తన పెళ్ళి శుభలేఖ లో అచ్చేయించుకున్న అతని స్టూడెంట్.!

అది కలకత్తాలోని బెహ్రంపూర్… తన పెళ్లికి సంబంధించిన శుభలేఖను  ప్రింట్  చేయించుకొని తొలి పత్రికను తన టీచర్ చేతిలో పెట్టాడు సిరాజుద్దీన్ అనే 30 సంవత్సరాల కుర్రాడు. నిఖా డిసెంబర్ 13, ఆహ్వానించు వారు  నా తండ్రి సమానులు సుబీర్ సార్ అని శుభలేఖ లో అచ్చు అయ్యి ఉంది. ఎంట్రా సిరాజ్… నీ పెళ్ళికార్డ్ లో, నాపేరెందుకు  అంటూ ఆశ్చర్యపోయాడు సుబీర్ సార్. అదేంటి సార్ అలాగంటారు.నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణమైన మీరు నాకు తండ్రి సమానులు కారా .! అన్నాడు, దానికి సుబీర్ సార్, సిరాజ్ ను ఆత్మీయంగా హత్తుకున్నాడు.

సార్ పేరును పెళ్లికార్డులో వేసుకునేంత గొప్ప సార్ లో ఎముంది సిరాజ్ అని అడిగితే అతడు చెప్పిన సమాధానం….

“మాది చాలా పేద కుటుంబం, పూటగడవడమే కష్టం, అలాంటిది చదువంటే అందని ద్రాక్షే.. కానీ చదువు పట్ల నాకున్న తపనను చూసి నన్ను చేరదీసారు సుబీర్ సార్, తన ఇంట్లోనే ఓ గదిని నాకిచ్చి సొంత కొడకులా చూసుకున్నారు, నా చదువు, తింటి,బట్ట…తో పాటు నేను చేసిన ఖర్చు చేసిన ప్రతి  పైసా సుబీర్ సార్ ఇచ్చిందే… డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో నన్ను LPG డిస్ట్రిబ్యూటర్ గా పార్ట్ టైం ఉద్యోగాన్ని ఇప్పించి, నాచేతే మా ఇంటి వారికి సహాయం చేయించారు…ప్రతి విషయంలో నాలో ఎంతో స్పూర్తిని నింపారు.

HINDU_b_051215

అసహనం అంటూ ముస్లీం- హిందువుల మద్య అర్థంలేని గొడవలు మా చుట్టుపక్కలే జరుగుతున్నా… ముస్లీం అయిన నన్నుహిందూ అయిన  సుబీర్ సార్ తన ఫ్యామిలీ మెంబర్ గా చూసుకున్నారు, నేనే కాదు నాతో పాటు నాలాంటి  చాలామంది స్టూడెంట్స్  ఇప్పటికీ సార్ ఇంట్లోనే ఉన్నారు, వాళ్లకు ఉన్నదాంట్లోనే స్టూడెంట్స్ పెట్టేవారు.. సార్ భార్య, సార్ వాళ్ళ అమ్మ కూడా  స్టూడెంట్స్ బట్టలు ఉతికేవారు, బట్టలే కాదు వారు వాడుకునే బెడ్ షీట్స్ కూడా వాళ్లే ఉతికే వారు.”

ఇప్పుడు చెప్పండి…..మా సార్ నాకు తండ్రి సమానులు కారా….!ఆయన పేరు నా శుభలేఖ లో ఉండండం కరెక్ట్ కాదా..?

Comments

comments

Share this post

scroll to top